News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Karthika Deepam December 17 Episode: నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం డిసెంబరు 17 శుక్రవారం ఎపిసోడ్ లో సౌందర్య ఇంట్లో మోనిత పెద్ద రచ్చే చేసింది. మరోవైపు బాబుని ఎత్తుకున్న దీప... రోజుల పిల్లాడిలా లేడంటూ క్వశ్చన్ చేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందంటే…

FOLLOW US: 
Share:

కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కార్తీక దీపం ఈ రోజు (శుక్రవారం) ఎపిసోడ్ లో ఎంట్రీ సీన్ కార్తీక్- హిమ-సౌర్యతో మొదలైంది.  స్కూల్‌కు వెళ్తున్నాం  కానీ వెళ్లినట్టు అనిపించడం లేదు. బుక్స్, యూనిఫాం లేవంటుంది శౌర్య.  అందుకే మీరు సోమవారం నుంచి వెళుదురుగారినే అంటాడు కార్తీక్. పండక్కి నానమ్మ ఇంటికి వెళ్దామా అని హిమ అడిగడంతో  కార్తీక్ ఏం చెప్పాలో తెలియక సైలెంట్‌గా ఉంటాడు. తండ్రిని ప్రశ్నలతో వేధించకండి అని దీప చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న శౌర్య ఎక్కడికి వద్దు ఇక్కడే సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకుందాం అంటుంది. ఇలానే స్కూల్‌కు వెళ్లి చూసొద్దామని హిమ అంటే ఇలా వెళ్తే అందరూ మనల్ని విచిత్రంగా చూస్తారు వద్దంటుంది శౌర్య.  దీప రాకను గమనించిన శౌర్య అదిగో అమ్మ వస్తుందంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. నాన్న స్కూల్‌కి వద్దన్నారని చెబితే బుక్స్ లేవు కదా వద్దన్నానని అంటాడు కార్తీక్. ఈ రోజు మంచి రోజు కాదంట వద్దులే అంటుంది దీప. మళ్లీ కొన్ని రోజులకే సంక్రాంతి హాలీడేలే వస్తాయ్.. అయినా ఇప్పుడు స్కూల్‌కు వద్దులే అని అంటుంది శౌర్య. సంక్రాంతిని ఇక్కడే బాగా చేస్తారట కదా అని హిమ అంటే.. పండుగలు, సంప్రదాయాలు పల్లెల్లోనే బావుంటాయంటారు. మాకు పట్టుపరికిణీలు కుట్టించు, మీ ఇద్దరు కొత్త బట్టలు కొనుక్కోండని చెబుతారు పిల్లలు. ఇప్పటి నుంచే వేస్తున్నారా అని దీప అడిగితే అదేం లేదంటుంది శౌర్య. ఇద్దరూ ఆడుకుందికి వెళ్లిపోతారు. 

Also Read:
ఏమైంది దీప అని కార్తీక్ అడుగుతాడు. రుద్రాణి మన మీద పగబట్టింది.. అని దీప అంటే.. ఏమంటోంది.. ఎదురుపడిందా? బెదిరించిందా? అని కార్తీక్ అంటే స్కూల్ కాంపౌండ్‌లోకి కూడా వెళ్లనివ్వలేదు. పని ఇవ్వొద్దని చెప్పిందట అని జరిగిన విషయాన్ని దీప చెబుతుంది. నువ్వేం భయపడకు దీప అంతకన్నా ఏం చేయగలదులే ఇలాంటి పనులు వాళ్ల వ్యక్తిత్వాన్ని చూపుతాయ్ అంటాడు కార్తీక్ . మనం ఎదురించామని కోపం బాకీ డబ్బులు ఇస్తామని అన్నాం కదా పైగా ఆమెను కొట్టాను కదా అని దీప అంటే.. నువ్వే కాదు నేను కూడా కొట్టానని జరిగిన ఫైటింగ్ గురించి చెబుతాడు. ఏంటి కార్తీక్ బాబు.. ఎందుకు అలా చేశారు అసలే ఇది కొత్త ప్రదేశం అంటుంది. ప్రదేశం మారినంత మాత్రాన న్యాయం, ధర్మం మారదు కదా అంటాడు కార్తీక్.  నేను చేయి చేసుకున్నాను, వాళ్లేమో మొరటు మనుషులు ఈయనేమో సుకుమారమైన మనిషి అని దీప తనలో తను అనుకుంటుంది. 

Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ప్రియమణి.. ఓ గుడ్ న్యూస్ చెప్పాలి నీకు అని మోనిత ఇంట్లో హడావుడి మొదలెట్టింది. చేతిలో ఏంటమ్మ అది అని ప్రియమణి అడగడంతో నీకెప్పుడూ తొందరే అంటూ.. మామయ్యగారు, ఆంటీ, ఆదిత్య, శ్రావ్య ఏంటో చెప్పుకోండి అంటుంది మోనిత. అభిమానుల కోరిక మేరకు ఇదేంటో చూపించబోతున్నా అంటుంది మోనిత. గుళ్లో పూజ చేయించిన ఫోటోలను ఫ్రేమ్‌గా చేసి తీసుకొచ్చి ఫొటో అదిరిందిగా కదా.. దేవుడి సన్నిధిలో నేనూ, నా పతిదేవుడు అరే క్యాప్షన్ బాగుంది కదా ఫోటో కింద రాస్తే బాగుండేది అప్పుడు గుర్తుకు రాలేదు జంట బాగుంది కదా దీవించండి అంటుంది. అలా కోపంగా ఎందుకు చూస్తారని  మోనిత రెచ్చిపోతుంటే ఏంటి మమ్మి ఇదేంటి.. మన ఇంట్లోకివచ్చి ఈ పిచ్చి వేషాలు ఏంటని ఆదిత్య ఫైర్ అవుతాడు. ఆదిత్య కోపం తగ్గించుకో ఈ ఫోటోను ఇక్కడ పెడతాను దిష్టి తియ్  అంటుంది మోనిత.  

Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
ఆ ఫోటో పీకి అవతల పారేద్దామని అనుకుంటాడు ఆదిత్య. కానీ మోనిత మాత్రం  హలో ఆగమ్మ నువ్ ఆ ఫోటో తీసేస్తే నేను ఇంటి ముందు పది ఫ్లెక్సీలు తీసి పెట్టిస్తాను వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పెద్ద కటౌట్స్ పెట్టిస్తాను ఇప్పుడు మనం ఆరుగురమే చూస్తున్నాం అప్పుడు వీధి అంతా కూడా చూస్తుంది. ఇంట్లో ఫోటోను ఉంచమంటావా? వీధిలో ఫోటో పెట్టమంటావా? అని మోనిత బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఎక్కువ చేస్తున్నావేంటి బెదిరిస్తున్నావా అని సౌందర్య నిలదీస్తుంది. నాకు కూడా కొన్ని అచ్చట్లు ముచ్చట్లు ఉంటాయ్.. దోష నివారణ పూజ అన్నారు కానీ దోషం పోలేదు కదా కార్తీక్ కనిపించడం లేదు.. నా బిడ్డను ఎత్తుకెళ్లారు.. ఎక్కువ చేస్తున్నాను అని అన్నారు కదా?. నేను ఎక్కువే చేస్తున్నాను. కార్తీక్ వద్దన్నా.. జైలుకి పంపించినా నేను కార్తీక్ కావాలనే అంటున్నాను. ఆ దీపక్కలా వదిలేసి వెళ్లడం లేదు. ప్రేమ ఉన్న వాళ్లు దగ్గరవుదానమి చూస్తారు, ప్రేమ లేని వాళ్లు దూరమవుదామని చూస్తారు. అరిచిఅరిచి నోరు పోతోంది.. అల్లం టీ తీసుకురా ప్రియమణి అని మోనిత అంటుంది. ఆంటీ అల్లం టీ తాగుతారా అని మోనిత అడుగుతుంది. ఇంటి సభ్యులకు ఓ ముఖ్య గమనిక.. ఫోటో తీస్తే వీధిలో పెట్టే ఫ్లెక్సీల సంఖ్య మరింత పెరుగుతుంది.. అని బెదిరిస్తుంది. 

Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న శ్రీవల్లి, కోటేశ్‌లకు ఇంట్లో సామాన్లు ఏవీ కనిపించవు . వల్లి మన సామాన్లు కనిపించడం లేదేంటని కోటేశ్ అడుగుతాడు. నాకు ఎలా తెలుస్తుందండి దొంగలు ఎత్తుకెళ్లారా ఏంటి.. రుద్రాణి వల్ల మళ్లీ మనం రోడ్డున పడ్డాం అని శ్రీవల్లి బాధపడుతుంది. పోతే పోనీలే.. మనకు బిడ్డ వచ్చాడు అని కోటేష్ అంటే ఎలా బతుకుతాం  అని శ్రీవల్లి అంటుంది. మీ సామాన్లు మా దగ్గరే భద్రంగా ఉన్నాయ్ అని కార్తీక్ అసలు విషయం చెబుతాడు. మీరు ఎవరో ఏంటో గానీ రుద్రాణి గురించి మీకు తెలీదని కోటేష్ భయపడతాడు. మీ ఇంట్లోకి మీరు రావడానికి భయపడుతున్నారు పర్లేదు రండి.. అని లోపలకి తీసుకెళ్తాడు కార్తీక్. హారతిచ్చి మరీ లోపలకి తీసుకొస్తుంది దీప. లోపలకి వచ్చి కూర్చో మీ ఇంట్లో మీకు మర్యాద చేస్తున్నాను. ఈ ఇల్లు మీది అని తెలియక అద్దె ఆవిడకి ఇస్తాను అని అన్నాను క్షమించండి అంటుంది దీప. మీకు తెలియక అలా చేశారు అని శ్రీవల్లి అంటుంది. మొత్తానికి డెలివరీ జరిగింది సంతోషం అని కార్తీక్ లోలోపల అనుకుంటాడు. అక్కా అని పిలిచావ్ చాలా సంతోషంగా ఉంది కొన్ని రోజులు ఇక్కడే ఉంటాం మాకు ఇల్లు దొరికాక వెళ్తామని దీప అంటే మా దగ్గరే ఇక్కడే ఉండండి అందరం కలిసే ఉందాం అని శ్రీవల్లి అంటుంది. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఇళ్లు మీరు మాకు సాయం చేశారు మా సామాన్లు తెచ్చి ఇంట్లో పెట్టారు. మీ మంచితనం ఏంటో తెలుస్తోంది. కానీ ఆ రుద్రాణి అని కోటేశ్ అంటుంటే.. ఆ రుద్రాణి విషయం నేను చూసుకుంటాను అని దీప అంటుంది. ఇదంతా రుద్రాణి మనిషి అబ్బులు చూస్తాడు. 

Also Read: కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్

ఫోటో తీసేస్తే ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టిస్తా అన్న మోనిత మాటలు తలుచుకుని సౌందర్య బాధపడుతుంటుంది. పెద్దోడా ఎంత పని చేశావ్ రా తలెత్తుకోలేకుండా చేశావ్. ఒక్కతప్పుకే మన ఫ్యామిలీ మొత్తం మూల్యం చెల్లించుకుంటోంది అని సౌందర్య అనుకుంటుంది. ఇంతలో అక్కడకొచ్చిన ఆదిత్య... ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది. ఫోటోలు, ఫ్లెక్సీలు, కటౌట్లు పెడతాని అంటోంది. చంపేయాలని అనిపిస్తోంది. కానీ సంస్కారం అడ్డొస్తోంది. దీనంతటికి కారణం నువ్వే మమ్మీ అని ఆదిత్య అంటే నేనేం చేశానురా అని సౌందర్య బాధపడుతుంది. పూజ చేయించింది నువ్వే కదా.. నువ్ చేసిన పనికే కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక్కడే ఉండనిద్దామా నువ్ చేసిన తప్పుకే ఇంటికి వచ్చింది అన్నయ్య పక్కన భార్యలా ఉంటోంది. మనం మళ్లీ ఇలా సైలెంట్‌‌గానే ఉంటాం. మొదట్లోనే కరెక్ట్‌గా బుద్ది చెబితే ఇంతదాక వచ్చేది కాదు. బయట అన్నయ్య గురించి అడిగితే వాళ్లు మోనిత గురించి అడుగుతున్నారు. నాకేం అర్థం కావడం లేదు మమ్మీ అని ఆదిత్య చిరాకుగా వెళ్లిపోతాడు.

Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
శ్రీవల్లికి దీప జాగ్రత్తలు చెబుతుంది. పిల్లలకు సంబంధించినవి శుభ్రంగా ఉంచుకోవాలంటూ ఏది బాబును ఒకసారి ఇవ్వండి అని ఎత్తుకుంటుంది. రోజుల బిడ్డల్లా లేడే వీడి వయసు ఎక్కువగా ఉన్నట్టుందని డాక్టర్ బాబు అంటాడు. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. 

రేపటి ఎపిసోడ్ 
శనివారం ఎపిసోడ్ లో ఏమైందంటే... కోటేశు ఇది మీ బిడ్డేనా.. నిజం చెప్పండని దీప అడుగుతుంది. మరేం జరుగుతుందో చూడాలి...
Also Read: వసుధార కౌంటర్లకి విలవిల్లాడుతున్న ఇగోమాస్టర్ రిషి.. వసుని చూసి మురిసిపోతున్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 16 గురువారం ఎపిసోడ్
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Dec 2021 09:07 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam new Episode 16th December Episode Karthika Deepam December 17 Episode

ఇవి కూడా చూడండి

Chinna Trailer: మ‌న‌సుకు హ‌త్తుకుంటున్న సిద్ధార్థ్ ఎమోషన్ థ్రిల్లర్- `చిన్నా` ట్రైల‌ర్ విడుద‌ల

Chinna Trailer: మ‌న‌సుకు హ‌త్తుకుంటున్న సిద్ధార్థ్ ఎమోషన్ థ్రిల్లర్- `చిన్నా` ట్రైల‌ర్ విడుద‌ల

Balakrishna : గిరిజనుల హక్కుల కోసం ఎన్‌బికె పోరాటం

Balakrishna : గిరిజనుల హక్కుల కోసం ఎన్‌బికె పోరాటం

Madam Chief Minister Movie : మహిళ ముఖ్యమంత్రి అయితే? - 'మేడమ్‌ చీఫ్ మినిస్టర్‌' షురూ!

Madam Chief Minister Movie : మహిళ ముఖ్యమంత్రి అయితే? - 'మేడమ్‌ చీఫ్ మినిస్టర్‌' షురూ!

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

టాప్ స్టోరీస్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?

Chandrababu Naidu Arrest :  బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ  -   కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప