News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Guppedantha Manasu Serial December 16th Episode: వసుధార కౌంటర్లకి విలవిల్లాడుతున్న ఇగోమాస్టర్ రిషి.. వసుని చూసి మురిసిపోతున్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 16  గురువారం ఎపిసోడ్

రిషికి కౌంటర్లు వేసిన వసుధార..కక్కలేక మింగలేక మనసులోనే మథనపడిపోతున్న ఇగో మాస్టర్..మరోవైపు వసుధారని చూసి తెగ మురిసిపోతున్న గౌతమ్… గుప్పెడంత మనసు డిసెంబరు 16 గురువారం ఎపిసోడ్ ఎలా సాగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంత మనసు డిసెంబరు 16  గురువారం ఎపిసోడ్

కాజేల్ లోంచి బయటకు వచ్చిన వసుధార రోడ్డుపై నడిచి వెళ్తుంటే.. అదే దారిలో రిషి, గౌతమ్‌లు కారులో వస్తారు. వసుని చూసిన గౌతమ్ ‘రేయ్ రిష్ ఆపరా కారు ఆపరా.. ప్లీజ్ రా.. అమ్మాయిరా అంటూ కారు ఆపించి..ఆమెతో మాట్లాడి వస్తానంటూ పరుగుతీస్తాడు. రిషి కూడా కారు దిగి వసుని చూసి షాక్ అవుతాడు. ఇప్పటి దాకా వీడు చెబుతున్న అమ్మాయి వసుధారనా అనుకుంటాడు. వసుని చూసి గౌతమ్ సంబరపడిపోతుంటాడు.. హాయ్ అండీ గుర్తుపట్టలేదా  నేనండీ నిన్న కారు యాక్సిడెంట్, హాస్పిటల్ అంటూ గుర్తుచేస్తాడు. గుర్తుంది అందుకే హలో చెప్పానంటుంది వసుధార. నేను ఇప్పుడే మిమ్మల్ని తలుచుకున్నాను మీరు కనిపించారు అందుకే అని ఉత్సాహంగా చెబుతాడు. అవునా మీరు గ్రేట్ అండీ అయితే ఈసారి ప్రపంచం అంతా బాగుండాలని తలుచుకోండి జరిగిపోతుంది అంటుంది వసు. అయ్యో అది కాదండీ సరే మీరు ఎక్కడికో వెళ్లాలనుకుంటా రండీ మా ఫ్రెండ్ కారులో లిఫ్ట్ ఇస్తా అని అటువైపు చూపిస్తాడు. రిషిని చూసి షాక్ అయిన వసు ఇతను రిషి సార్ ఫ్రెండా అనుకుంటుంది మనసులో. ప్లీజ్ రండి అని గౌతమ్ బతిమలాడడంతో...రిషి సార్  ఏం మాట్లాడతారో చూద్దాం.. కోపంగా మాట్లాడతారు, ఫ్రెండ్ ముందు కూడా దేవయాని విషయాన్ని బయటపెడతారా చూద్దాం అనుకుని గౌతమ్ తో పదండి అంటుంది. 
Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

రిషిని గౌతమ్ రిక్వెస్ట్ చేసి మరీ కారెక్కిస్తాడు. రిషి కారు డ్రైవ్ చేస్తుంటే గౌతమ్ వెనకే కూర్చున్న వసుతో మాటలు కలుపుతాడు. వీడు రమ్మనగానే రావాలా.. రాను అనొచ్చుగా అని వసుని ఉద్దేశించి మనసులో అనుకుంటాడు రిషి. మీ పేరు ఏంటో తెలుసుకోవచ్చా అన్న గౌతమ్ తో ... గౌతమ్. రిషి, వసులు ఇద్దరూ ఒకేసారి వసుధార అని సమాధానం ఇస్తారు. పేరు చాలా బాగుందంటూనే తన పేరు నీకు ఎలా తెలుసురా అని గౌతమ్ అడుగుతాడు. నేను సార్ వాళ్ల కాలేజ్‌లోనే చదువుతున్నాను సార్ అంటుంది వసుధార. అవునా అన్న గౌతమ్ కాలేజ్ పెట్టి మంచి పని చేశావ్‌రా రిషి అంటాడు నవ్వుతూ. హా వసుధార అని ఏకవచనంతో పిలిచి సారీ అండీ,  గారు, మేడమ్ ఇవన్నీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయని నా అభిప్రాయం నీకు ఓకేనా అంటాడు గౌతమ్. వసుధరా వద్దు అని చెప్పు అని రిషి మనసులో అనుకుంటాడు. కానీ వసు రిషిని కారు లోపలి అద్దం నుంచి గమనిస్తూ హా ఓకే అండి మనుషుల మధ్య మీరు చెప్పిన పిలుపులు మాత్రమే కాదు.. కోపాలు, అలకలు, అపార్థాలు ఇవి కూడా దూరాన్ని పెంచుతాయంటుంది వసుధార. అవునవును ఉంటారు లెండీ కొందరు వెధవలు అయినా వీడు అంతే చిన్నప్పుడు ప్రతి చిన్నదానికి అలిగేవాడు ఏరా ఇప్పుడు అలానే ఉన్నావా మారావా అంటాడు గౌతమ్ నవ్వుతూ. ‘రేయ్ ఆపు’ అంటాడు రిషి కోపంగా. 
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..

వెంటనే గౌతమ్ వసువైపు తిరిగి వసుధరా నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని. మనసులో ఏదుంటే అదే చెప్పేస్తా అని గౌతమ్ వసుతో అనడంతో వసు వెంటనే.. ‘గుడ్ అండీ.. అదే మంచి పద్దతి.. నాకు తెలిసిన కొందరున్నారు మనసులో ఏదైనా ఉన్నా అడగరు...మళ్లీ ఏదేదో ఊహించి ఫీల్ అవుతూ ఉంటారని రిషిని ఉద్దేశించి అంటుంది. నవ్వేసిన గౌతమ్ అదొక వేస్ట్ పద్ధతండీ మనసులో ఉంటే చెప్పాయాలి... ఆరోజు మనం కలిశాం కదా అప్పటి నుంచీ ప్రతిరోజూ ఎప్పుడెప్పుడు కలుస్తామా అని ఎదురుచూశా, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందంటాడు. అసలు నా ఆనందం ఎలా చెప్పాలో అర్థంకావడం లేదంటాడు గౌతమ్. ఇంతలో సడెన్ బ్రేక్ వేయడంతో వసు వచ్చి గౌతమ్ భుజాన్ని గుద్దుకుంటుంది. వసు సారీ చెబితే గౌతమ్ థ్యాంక్స్ అంటాడు.. రిషి మాత్రం మనసులోనే ఉడుక్కుంటాడు. వసుధారా మీది ఏ గ్రూప్ అని అడిగిన గౌతమ్ కి మ్యాథ్స్ అని చెబుతుంది. నాదీ, వీడిది మ్యాథ్సే అని చెప్పడంతో అవును సార్ మ్యాథ్స్ లో గోల్డ్ మెడలిస్ట్ కదా అంటుంది..అంతలోనే వాడిమొహం వాడికి మ్యాథ్స్ నేర్పించింది నేను ట్యూషన్ కావాలంటే చెబుతా అంటాడు గౌతమ్. స్పందించిన రిషీ తను కాలేజ్ టాపర్, యూత్ ఐకాన్ టైటిల్ విన్నర్ అని చెబుతాడు.
Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్

వసుధారా మీ హాబీస్ ఏంటని గౌతమ్ అడగడంతో నీగోల ఆపుతావా అంటాడు రిషి. వసుధార గురించి నీకు అన్నీ తెలుసు కదా నిన్నే అడిగి తెలుసుకుంటా అంటాడు రిషి. నా అంత కాకపోయినా నువ్వూ తెలిపైన వాడివేకదా అంటాడు గౌతమ్. దీంతో వింటున్నా కదా అని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పకని రిషి..గౌతమ్ పై సీరియస్ అవుతాడు. ఓ ఒప్పందానికి వద్దాం ఇద్దరం తెలివైన వాళ్లమే అంటాడు గౌతమ్. ఇంతలో తన రెస్టారెంట్ వచ్చిందని చెబుతాడు రిషి. ఏంటిలా తనకి రెస్టారెంట్ ఉందా అంత రిచ్ కిడ్డా అని అంటాడు గౌతమ్. కాదండీ నేను ఇందులో పనిచేస్తా అంటుంది వసుధార. రిషి కాఫీ తాగివెళదాం పద అంటాడు గౌతమ్. తనకు కాఫీ నచ్చదనడంతో అదేంటి నీకు కాఫీ ఇష్టం కదా అని గౌతమ్ క్వశ్చన్ చేస్తాడు. ఇష్టాలు మార్చుకున్నా అన్న రిషితో ...నేను వెళ్లి కాఫీ తాగొస్తా అంటాడు గౌతమ్. నోర్మూుసుకుని కార్లో కూర్చో అని బెదిరించడంతో వసుధార మనం మళ్లీ కలసి కాఫీ తాగుదాం అంటాడు. బై సర్ అంటుంది...థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్ అని సంబరపడిపోతాడు. కారు నాది వాడిది కాదని రిషి అనడంతో లిఫ్ట్ ఇచ్చింది పిలిచింది ఆ సార్ కదా అని కౌంటర్ ఇస్తుంది. కాఫీ తాగి వెళదాం అని బతిమలాడినా రిషి వినకపోవడంతో కారెక్కుతూ... వసుధార ఇక్కడ పనిచేస్తోందని నీకెలా తెలుసనగా...తను మా స్టూడెంట్ కదా అని బదులిస్తాడు రిషి.
Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…

కట్ చేస్తే జగతి, మహేంద్ర కూర్చుంటారు. రెస్టారెంట్లో దేవయాని చేసిన ఓవర్ యాక్షన్ తలుచుకుని జగతి బాధపడుతుంది. ఏంటి జగతి ఏం ఆలోచిస్తున్నావ్ అన్న మహేంద్రలో రిషి గురించి ఆలోచిస్తున్నా.. తన కళ్లతో చూస్తున్నా తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేను-వసు కలసి వాళ్ల పెద్దమ్మని ఏదో చేశామని అపార్థం చేసుకున్నాడు. వీలైనంత తొందరగా రిషికి అర్థమయ్యేలా చెప్పవా.. కనీసం ఈ విషయాన్ని అయిన సీరియస్ గా తీసుకో అంటుంది జగతి. శిరీష్ విషయంలో రిషి ఎలా అర్థం చేసుకున్నాడో, అదెంతవరకూ దారితీసిందో తెలిసుకదా అలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే జరిగిన నిజాన్ని రిషికి చెప్పాలి. అక్కయ్యమీద అమితమైన ప్రేమ తప్పుదారి పట్టిస్తోంది. తనని మార్చకున్నా పర్వాలేదు కానీ తను వెళుతున్న దారి కరెక్ట్ కాదని చెప్పాలి.. కనీసం ప్రయత్నించు మహేంద్ర అనడంతో ..ఫీలవుతాడు. అన్నిసార్లు చెప్పొద్దు..నేను ప్రయత్నిస్తా అన్నాకదా అంటాడు. మేం చేయని తప్పుని నింద మోస్తున్నాం ..ఇందులో మాతప్పేం లేదని రిషికి తెలిస్తే మాకన్నా ఎక్కువగా రిషి రిలాక్స్ అవుతాడంటుంది జగతి. మేం బాధపడుతున్నామని కాదు తన బాధ తగ్గిపోతుందని చెబుతున్నాఅంటుంది జగతి. నన్ను అపార్థం చేసుకున్నాడు నన్నింకా ద్వేషిస్తూనే ఉన్నాడు..దేవయాని విషయంలో అయినా రిషి మనసులో ఉన్న అపోహ తొలగించని కోరుతుంది జగతి. మహేంద్ర సరే అంటాడు. రిషి ఎందుకు కోపంగా ఉన్నాడో తెలుసుకునేందుకు వసుధారకి కాల్ చేస్తుంది ధరణి. ఎపిసోడ్ పూర్తైంది.
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
రేపటి ఎపిసోడ్ లో
రేపటి ఎపిసోడ్ ( శుక్రవారం) లో వసుధార తో ధరణి కాల్ మాట్లాడుతోందని తెలుసుకున్న రిషి...వసుకి వినిపించేలా మాట్లాడతాడు. పెద్దమ్మకి గాయం ఎలా అయిందో తెలుసుకదా..ఆ వసుధార ఒక్కసారీ కూడా చెప్పలేదు, తన కిరీటం పడిపోతుందా, అహంకారమా, గర్వమా అని చెలరేగిపోతాడు. అంతా విన్న వసు నా తప్పులేదు, సారీ చెప్పేది లేదనుకుంటుంది. 
Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Dec 2021 11:02 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu serial Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు Guppedantha Manasu Upcoming story Guppedantha Manasu Upcoming track Guppedantha Manasu Written Update Turns and Twists in Guppedantha Manasu Upcoming episode of Guppedantha Manasu Upcoming story of Guppedantha Manasu Upcoming turns and twists ahead in story of Guppedantha Manasu Written update of Guppedantha Manasu\

ఇవి కూడా చూడండి

Keerthy Suresh: నా దగ్గరికి వచ్చే కథలన్నీ అలాంటివే, మరో ఆలోచనే లేదంటున్న కీర్తి సురేష్!

Keerthy Suresh: నా దగ్గరికి వచ్చే కథలన్నీ అలాంటివే, మరో ఆలోచనే లేదంటున్న కీర్తి సురేష్!

Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ

Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023: జోరు చూపుతున్న కాంగ్రెస్, జిల్లాల వారిగా ఇలా

Telangana Election Results 2023: జోరు చూపుతున్న కాంగ్రెస్, జిల్లాల వారిగా ఇలా

Telangana Election Results 2023 LIVE: ఈసీ ట్రెండ్స్ - ముందంజలో కాంగ్రెస్, సంబరాల్లో తెలంగాణ హస్తం నేతలు

Telangana Election Results 2023 LIVE: ఈసీ ట్రెండ్స్ - ముందంజలో కాంగ్రెస్, సంబరాల్లో తెలంగాణ హస్తం నేతలు

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?

Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
×