Karthika Deepam December 20 Episode: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్20 సోమవారం 1227 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే..

FOLLOW US: 

కార్తీకదీపం సీరియల్ డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్

గత ఎపిసోడ్‌లో కార్తీక్‌ని రుద్రాణి పిలిపించి..ఆ శ్రీవల్లి, కోటేష్‌ చేసిన అఫ్పు తీస్తానని  అగ్రిమెంట్‌లో సంతకం చేస్తావా? లేక వాళ్లని రోడ్డుకి ఈడ్చమంటావా? ఏదొకటి చెప్పు అంటుంది. దాంతో నేను సంతకం చేస్తాను.. వాళ్ల డబ్బు నేను తీరుస్తాను అంటాడు కార్తీక్. నెలరోజుల్లో డబ్బు ఇవ్వాలని గుర్తుచేస్తూ సంతకం పెట్టమంటుంది.  ఈ రోజు ఎపిసోడ్ దీనికి కొనసాగింపుగా ప్రారంభమైంది. 

రుద్రాణి-కార్తీక్ : అగ్రిమెంట్ పై కార్తీక్ సంతకం చేసేస్తాడు. సంతకం పెట్టిన తర్వాత ఆ పేపర్స్ ని ఆమె అసిస్టెంట్ రుద్రాణికి  అందిస్తూ.. ‘అక్కా సంతకం పెట్టాడు సరే.. మరి డబ్బులు ఇవ్వకపోతే..?’అంటాడు. ఆవేశంగా లేచి వాడిని కొట్టిన రుద్రాణి...‘నాకు తెలివి ఉందిరా.. గడువులోగా నాకు డబ్బు చెల్లించకపోతే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా వారినుంచి నేను ఒకర్ని తెచ్చుకుంటా అని అగ్రిమెంట్ లో రాశాంకదా. దేవుడు నాకు  పిల్లల్ని ఇవ్వలేదు.. అందుకే అందులోంచి నేను ఒకరిని తెచ్చుకుంటానంటుంది రుద్రాణి. ఈ అగ్రిమెంట్ చదవకుండా సార్ ఆవేశంతో సంతకం పెట్టేశారంటుంది. షాక్ అయి చూస్తున్న కార్తీక్ తో...‘చాలా పొద్దు పోయిందిగా వెళ్లయ్యా.. మీ బిడ్డ, నా దగ్గరకి రాబోయే బిడ్డ ఇద్దరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారంటుంది రుద్రాణి. 

Also Read:  తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
దీప ఇంట్లో: అమ్మా నాన్నింకా ఇంటికి రలేదని పిల్లలు అడుగుతారు. కళ్లుమూసుకుని పడుకోండని చెప్పిన దీప తాను కూడా మనసులో ఆలోచిస్తుంది.  ఇంటికి చేరుకున్న కార్తీక్ దీపకు ఆ విషయం చెప్పి బాధపెట్టడం కన్నా చెప్పకపోవడం మంచిది అనుకుంటాడు.  ‘కోటేష్ డబ్బు మనం ఇస్తాం అన్నాం కదా.. ఏవో సంతకాలు పెట్టించుకుంది అంతే’ అంటాడు. దాంతో దీప ‘అంత డబ్బు మనం ఇవ్వగలమా కార్తీక్ బాబు’అంటుంది భయంగా. దీపా డబ్బు గురించి బెంగపడకు, ఆ రుద్రాణి మూర్ఖత్వంతో శ్రీవల్లి వాళ్లని బయటకు గెంటేస్తే మనం అన్నీ మరిచిపోయి సుఖంగా ఉండగలమా, పరిస్థితులు మారుతున్నాయని వ్యక్తిత్వం మార్చుకోలేం కదా అంటాడు కార్తీక్. మీ గురించి నాకు తెలుసు కార్తీక్ బాబు కానీ ఇప్పుడున్న పరిస్థితులే నన్ను భయపెడుతున్నాయనుకుంటుంది దీప. 

Also Read:  ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
మోనిత:  మోనిత సౌందర్య ఇచ్చిన వార్నింగ్‌ తలుచుకుని రూమంతా తిరుగుతూ ఉంటుంది. నిద్రలో ఉన్న ప్రియమణి లేపి మరీ.. ‘అలా ఎలా పడుకుంటావ్ ప్రియమణి. వీళ్లని నేను ఏం చెయ్యలేనా? ఏదొక ప్లాన్ చెయ్యాలిగా..’ అంటూ ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది. నా బిడ్డ కనిపించలేదు, కార్తీక్ ఎటో వెళ్లిపోయాడు, నువ్వు నిద్రపోతే ఎలా , నాబాధ నీకు అర్థంకాలేదా అంటుంది. మళ్లీ మీకేమైనా ఐడియా వచ్చిందా అమ్మా అని ప్రియమణి అంటుంది. మనం వచ్చాం రెండు మూడుసార్లు వార్నింగ్ ఇచ్చాం, వాళ్లు భయపడ్డారో లేదో అర్థంకాలేదంటుంది. వాళ్లని అలా వదిలేస్తే ఎలా నా కల ఎలా నెరవేరుతుంది, నా బుల్లి ఆనందరావు ఎలా వస్తాడు, నా కార్తీక్ ఎలా దొరుకుతాడు, ఏదో ఒక ప్లాన్ చేయాలి కదా అంటుంది. మీరు చెప్పింది నిజం అమ్మా అన్న ప్రియమణి ... మీరు రాంత్రంతా కూర్చుని మంచి ఐడియాలు ఆలోచించుకుని నేను పొద్దున్న లేవగానే నాకు చెప్పండని నిద్రపోతుంది. 

Also Read:  నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
సీన్ కట్ చేస్తే.. ఇంటికి వెళ్లిన కార్తీక్.. తన పక్కనే కింద నిద్రపోతున్న పిల్లల్ని చూసుకుని రుద్రాణి మాటలు తలుచుకుని బాధపడుతుంటాడు.  ఇంతలో దీపకు మెలుకువ రావడంతో పిల్లల్ని చూసి ఏడుస్తున్న కార్తీక్ ను చూసి కంగారుగా పైకి లేస్తుంది. నిద్రపట్టడం లేదు దీపా అని కవర్ చేసి దీపని పడుకోమంటాడు. 

సౌందర్య ఇంట్లో:  ఉదయాన్నే సౌందర్య, ఆనందరావు, ఆదిత్య, శ్రావ్య కూర్చుని . మోనితని పంపించడం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మోనిత వచ్చి ప్రియమణిని పిలిచి వాళ్ల అందరి ముందే. ప్రియమణి ఇదిగో ఈ నా బాబు ఫొటో తీసుకుని వెళ్లి యాడ్ ఏజెన్సీలో కనుపడట లేదు అని యాడ్ వేయించిరా. ఆచూకి చెప్పిన వారికి లక్ష రూపాయలు బహుమతా అమ్మా అన్న ప్రియమణితో నీ మొహం బుల్లి ఆనందరావు నాకు దేవుడిచ్చిన వరం అందుకే ఆచూకీ చెప్పిన వారికి నా ఫామ్ హౌస్ రాసిస్తానని  రాయించు. నా బాబు పుట్టుక భూమ్మీద స్పెషల్ ..వాడి పుట్టుక చాలా అద్భుతం ఇంతమంది జనాభాలో నా బాబు  చాలా స్పెషల్ ప్రియమణి.. వాడికి వీపు మీద రూపాయి బిళ్లంత  పుట్టుమచ్చ ఉంటుంది. ఫోన్ నంబర్ మాత్రం మావయ్యగారిది వేయించు అంటుంది. ఆవేశంగా లేచిన సౌందర్య  ‘మోనితా ఊరుకుంటుంటే ఏంటే రెచ్చిపోతున్నావ్, నీకు వార్నింగ్ ఇచ్చా అప్పుడే మరిచిపోయావా అంటుంది.  మోనిత ఏదో మాట్లాడబోతుంటే ఆనందరావు అడ్డుపడతాడు. ‘చూడమ్మా మోనితా.. మనగురించి పక్కవాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు,  నువ్వేంటో నీ జీవితం ఏంటో, నువ్వు ఎంత నీఛమైన పనులు చేస్తున్నావో నీకు తెలుసు.  బాబు కనిపించడం లేదనే సానుభూతితో మేము నిన్ను ఏం అనట్లేదు. నువ్వు తప్పులు చేసి మాపై నెట్టాలని చూడకు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. కాదు-కూడదు నేను ఇలాగే ఉంటానంటే మాకు కోపం వస్తే ఏం జరుగుతుందో చూద్దుగానివి పద సౌందర్య అంటూ ఆనందరావు అందర్నీ అక్కడినుంచి తీసుకెళ్లిపోతాడు. 

Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
దీప ఇంట్లో: శ్రీవల్లి బాబుని చక్కగా రెడీ చేస్తుంటే...సౌర్య, హిమ వచ్చి గుడ్ మార్నింగ్ తమ్ముడూ అంటారు. అప్పుడు వెనకగా పడుకోబెడితే వీపుపై పుట్టుమచ్చ చూసి భలే ఉంది మచ్చ అనుకుంటారు పిల్లలు. అక్కలుగా బాబుకి పరిచయం చేసుకుంటారు. వీడికి మనమే మంచి పేరు పెడదాం అనుకుంటారు హిమ, శౌర్య. బాబుని ఎత్తుకుని కార్తీక్-దీప దగ్గరకు తీసుకెళతారు. తమ్ముడు బావున్నాడు కదా అంటే భలే ముద్దుగా ఉన్నాడంటుంది దీప. బాబుని కార్తీక్ చేతిలో పెడుతుంది. వీడికి వీపుపై పెద్ద పుట్టుమచ్చ ఉందని చూపిస్తారు. బాబుని చూస్తూ ఉండిపోతాడు కార్తీక్. 

మోనిత: తనని తాను అద్దంలో చూసుకుంటూ... విచిత్రంగా ఉందే నాకు కన్నీళ్లు వస్తాయా, ఎంతకాదన్నా తల్లినే కదా ఆనందరావుగారు నా ప్రేమకు ప్రతిరూపం అనుకున్నా ఇంతమంది అసహ్యించుకున్నా చివరకు కార్తీక్ కూడా నన్ను వద్దనుకున్నా నా ప్రేమను నిరూపించుకోవాలని నన్ను నేను గెలిపించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవాలనే అనుకుంటున్నాను. దేవుడిచ్చిన అపురూపమైన కానుక బుల్లి ఆనందరావు. నా బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారంటే ఇంట్లో ఎవ్వరూ గుర్తించడం లేదు. కార్తీక్ భార్యగా గుర్తించలేదు, ఇంట్లో వాళ్లు కోడలిగా నమ్మలేదు, బిడ్డను పోగొట్టుకున్న తల్లిగా నా బాధను అర్థంచేసుకోలేని వారు వీళ్లు మనుషులేనా...వీళ్లకి అర్థమయ్యేలా చెబుతాను నేను గెలుస్తాను అనుకుంటుంది. 

కార్తీక్ ఫాస్ట్ గా ఇంట్లోంచి బయటకు వచ్చి పిల్లల్ని వెతుక్కుంటాడు... దీపా పిల్లలు కనిపించడం లేదని దీపకు చెబుతాడు.  ఏరి అని అడుగుతాడు. దీప కంగారు పడుతుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
Also Read: గౌతమ్ కి కాల్ చేసిన వసుధార.. షాక్ లో రిషి.. ఎంజాయ్ చేస్తున్న మహేంద్ర..గుప్పెడంత మనసు డిసెంబరు 17 శుక్రవారం ఎపిసోడ్
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read:  రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Dec 2021 09:46 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam new Episode 20 December Episode Karthika Deepam December 20 Episode

సంబంధిత కథనాలు

Anshula Kapoor: 'నో బ్రా క్లబ్' ఛాలెంజ్ - కెమెరా ముందు ఇన్నర్ బయటకు తీసిన హీరో సిస్టర్

Anshula Kapoor: 'నో బ్రా క్లబ్' ఛాలెంజ్ - కెమెరా ముందు ఇన్నర్ బయటకు తీసిన హీరో సిస్టర్

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

Janaki Kalaganaledu July 4 Episode: ‘జానకి కలగనలేదు’ - చెత్త కాగితాల్లోకి జానకి ఎస్సైనమెంట్ పేపర్స్, జ్ఞానంబ ప్రశ్నకు జానకి మౌనంగా

Janaki Kalaganaledu July 4 Episode: ‘జానకి కలగనలేదు’ - చెత్త కాగితాల్లోకి జానకి ఎస్సైనమెంట్ పేపర్స్, జ్ఞానంబ ప్రశ్నకు జానకి మౌనంగా

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

టాప్ స్టోరీస్

Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు