Guppedantha Manasu Serial December 22nd Episode: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్

గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. వసుధారతో సారీ చెప్పించాలని ఫిక్సైన రిషి ఆమెను బయటకు తీసుకెళతాడు.. డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్

జగతి ఇంట్లో: రెస్టారెంట్ నుంచి వసుధారని ఇంటిముందు దించుతాడు రిషి. బయట నిల్చుని గౌతమ్-వసుధార మాట్లాడుకుంటూ ఉండగా లోపల నుంచి మహేంద్ర, జగతి కలసి బయటకు వస్తారు. ఒకర్ని చూసి మరొకరు షాక్ అవుతారు. ఇది వసుధార ఇల్లు కదా మీరిక్కడ ఉన్నారేంటని గౌతమ్ క్వశ్చన్ చేస్తాడు. మహేంద్ర సమాధానం చెప్పేలోగా కంగారుగా కార్లోంచి బయటకు వచ్చిన రిషి..డాడ్ మిషన్ ఎడ్యుకేషన్ పనులుంటే మాత్రం ఇంత టైమ్ వరకూనా అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ మీద డాడ్ కి చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అని కౌంటర్ వేసిన రిషి గౌతమ్ ని తీసుకుని వెళ్లిపోతాడు. ఏంటి వసు... రిషికి కోపం ఇంకా తగ్గలేదా అన్న జగతి ప్రశ్నకు అంత ఈజీగా తగ్గిపోతే రిషిసర్ ఎందుకవుతారని కౌంటర్ ఇస్తుంది. 

Also Read: రిషిని ఆలోచనలో పడేసిన మహేంద్ర మాటలు, వసు విషయంలో రిషి తీరుపై గౌతమ్ కి బోలెడు డౌట్స్, గుప్పెడంత మనసు డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్…
రిషి ఇంట్లో: మా పెద్దమ్మకి సారీ చెప్పాలని అడిగితే వసుధార సారీ చెప్పను అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. వసు ఇలా ఉండదు తనపై మేడం ప్రభావం ఉందేమో అనుకుంటాడు. ఈ నైట్ చాలా అందంగా ఉందని గౌతమ్ అంటే ఈ ప్రకృతి కూడా అమ్మలాంటిదే ఎప్పుడెలా మారుతుందో అని చెప్పలేం అంటాడు రిషి. నీకో గిఫ్ట్ తెచ్చా అన్న గౌతమ్ తో నువ్వు రావడమే సంతోషం ఇంకా బహుమతులేంటి అంటాడు. గౌతమ్ ఇచ్చిన మౌత్ ఆర్గాన్ చూసి రిషి చాలా సంతోషిస్తాడు. ఇది నువ్వు బాగా ప్లే చేస్తావ్, నాకు నేర్పమంటే నేర్పలేదు అందుకే ఇది నీకు ఇష్టమని బాగా గుర్తుంది అంటాడు. అందమైన జ్ఞాపకాలను పాటగా మార్చి ప్లే చేయి అని అడిగిన గౌతమ్ కోసం రిషి.. వసుధారతో గడిపిన క్షణాలు గుర్తుచేసుకుని మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తాడు. మౌత్ ఆర్గాన్ సౌండ్ విని రిషిని చూసిన మహేంద్ర... ఇది దారి తప్పిన మనసు పాటా, ఇది ఆలోచనలా, ఇది నీ బాధా-నీ భావనలా అని అనుకుంటాడు 

Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
మహేంద్ర- ధరణి: రిషికి నిజం చెప్పాలి అందుకు నీ సహాయం కావాలని అడుగుతాడు మహేంద్ర. మీరే చెప్పడానికి వెనుకా ముందు అవుతుంది మరి నా వల్ల  అవుతుందా అంటుంది ధరణి. నిజా నిజాలేంటో రిషికి నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి. చూడ్డానికి చిన్న విషయమే అయినా వసు-జగతి-రిషి ముగ్గుర్నీ ఇబ్బంది పెడుతోంది ఈ విషయం. జరిగిందేంటో అత్తయ్యగారు తన నోటితో చెబితేనే రిషి నమ్ముతాడేమో అంటుంది ధరణి. ఇంతలో ఎదురుగా ఉన్న రిషిని చూసి షాక్ అయిన ధరణి..మహేంద్రకి సైగ చేస్తుంది. అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు రిషి. 

Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
జగతి ఇల్లు: జగతి-వసు ఎవరిపనుల్లో వారుంటారు. బయట కార్ హారన్ వినిపించడంతో  కాఫీ తాగమన్నా తాగకుండా, టిఫిన్ కూడా తినకుండా వసు పరిగెత్తుతుంది. రిషిని నువ్వు రమ్మన్నావా- వస్తున్నట్టు చెప్పి వచ్చాడా మరి ఎందుకొచ్చినట్టు అంటుంది జగతి. వర్షం చెప్పి వస్తుందా రిషి సార్ కూడా అంతే అంటుంది వసుధార. బహుశా సారీ చెప్పించుకునేందుకు వచ్చారేమో బై అనేసి వెళ్లిపోతుంది. రిషి-వసు: మాట్లాడాలి అన్న రిషితో మాట్లాడండి సర్ అంటుంది వసు. ఇక్కడ కాదు ఎక్కడికి అని అడగకు నాతో రావాలని అడిగితే సరే అంటుంది వసుధార. వీళ్లిద్దర్నీ చూసిన జగతి... ఏంటీ వసు అప్పుడే రిషిపై కోపం చూపిస్తుంది అప్పుడే పెరిగెత్తుకు వెళుతుందని అనుకుంటుంది.

Also Read: వసుధార కౌంటర్లకి విలవిల్లాడుతున్న ఇగోమాస్టర్ రిషి.. వసుని చూసి మురిసిపోతున్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 16 గురువారం ఎపిసోడ్
మహేంద్ర-గౌతమ్: ప్రేమలో పడితే ప్రపంచం అధ్బుతంగా కనిపిస్తుందంటారు నిజమేనా అంటాడు గౌతమ్. పొద్దున్నే గొప్ప టాపిక్ తీసావన్న మహేంద్ర.. ప్రేమ ఎంత తియ్యనిదో అంతే చేదుగా మారుతుంది, ఏంత నవ్విస్తుందో అంత ఏడిపిస్తుంది అది ఏ ప్రేమైనా సరే అని అంటాడు. సింపిల్ గాచెప్పాలంటే ప్రేమ సముద్రం లాంటింది గౌతమ్ బీచ్ లో అలల వరకూ ఆహ్లాదంగానే ఉంటుంది ఇంకా ముందుకెళితేనే ప్రమాదాలు జరుగుతాయి. అంకుల్ మీరు సూపర్...నేను చిటికెడు అడిగితే మీరు సముద్రమంత సమాధానం ఇచ్చారంటాడు గౌతమ్. ఇంతకీ నువ్వు ప్రేమ గురించి ఎందుకు అడిగావో తెలుసుకోవచ్చా అన్న మహేంద్రకు.. ఏం లేదు ఫ్రెండ్స్ డిస్కషన్ చూసి అడిగా అంటాడు. పొద్దున్నే రిషి ఎక్కడకు వెళ్లాడని అడుగిన గౌతమ్ తో... రిషి చెప్పింది వినడమే తప్ప మనం అడిగేది చెప్పడని అంటాడు మహేంద్ర. ఇప్పటికీ తన ఆలోచనలు, ఎమోషన్స్ అన్నీ దాచేసుకుంటాడు.  సంతోషం-బాధ అన్నీ మనసులో దాచేసుకోవడం అలవాటైపోయిందంటాడు.

Also Read: సారీ చెప్పమంటున్న రిషి.. చెప్పేదే లే అంటున్న వసుధార... మిషన్ ఎడ్యుకేషన్ ఫొటోస్ లో రిషి-నువ్వే ఉన్నారు జగతి మేడం కనిపించలేదన్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్
రిషి-వసుధార: కార్లో గాలికి జుట్టు ఎగురుతుంటే క్లిప్స్ పెట్టుకుంటారు కదా అంటాడు గౌతమ్. మీరు రమ్మంటారని అనుకోలేదన్న వసుతో... టై ఇచ్చి జుట్టు ముడేసుకోమంటాడు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళుతున్నాం అని అడుగుతుంది వసు... ఎపిసోడ్ అయిపోయింది.

రేపటి ఎపిసోడ్ లో
పెద్దమ్మ విషయంలో తప్పు చేశావ్ వసుధార అంటాడు రిషి. సర్..ఆ రోజు ఏవేవే ఫొటోలు చూపించి ఏదేదో మాట్లాడారు..ఆ  రోజు నాతప్పు, జగతి మేడం తప్పు లేదని చెబుతుంది. కట్ చేస్తే  కాలేజీలో జగతి రూమ్ కి వెళ్లిన రిషి...వసుధార గురించి నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నా అంటాడు. ఇన్నాళ్లకి రిషి ఓపెన్ అవుతున్నాడన్నమాట అనుకుంటుంది. వసుధారని మీ ఇంట్లోంచి పంపించేయండి మేడం అని పెద్ద షాకిస్తాడు...
Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read:  దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Dec 2021 08:42 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu serial Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు Guppedantha Manasu Upcoming story Guppedantha Manasu Written Update Turns and Twists in Guppedantha Manasu Upcoming episode of Guppedantha Manasu Upcoming story of Guppedantha Manasu Upcoming turns and twists ahead in story of Guppedantha Manasu Written update of Guppedantha Manasu\ Guppedantha Manasu Upcoming track

సంబంధిత కథనాలు

Balakrishna: బాలయ్యకు కోవిడ్ నెగెటివ్ - నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ షురూ 

Balakrishna: బాలయ్యకు కోవిడ్ నెగెటివ్ - నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ షురూ 

NTR: ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమం.. ఫోన్ చేసి మాట్లాడిన హీరో!

NTR: ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమం.. ఫోన్ చేసి మాట్లాడిన హీరో!

Pranitha On Udaipur Murder: ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్ - ఉదయ్‌పుర్‌ ఘటనపై ప్రణీత స్పందన

Pranitha On Udaipur Murder: ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్ - ఉదయ్‌పుర్‌ ఘటనపై ప్రణీత స్పందన

Khushbu Sundar: మీనా భర్త మృతిపై తప్పుడు ప్రచారం - నటి ఖుష్బూ ఫైర్!

Khushbu Sundar: మీనా భర్త మృతిపై తప్పుడు ప్రచారం - నటి ఖుష్బూ ఫైర్!

Aamir Khan: అసోం ప్రజల కోసం విరాళం ప్రకటించిన అమీర్ ఖాన్, ఆ మంచి మనసును మెచ్చుకోవాల్సిందే

Aamir Khan: అసోం ప్రజల కోసం విరాళం ప్రకటించిన అమీర్ ఖాన్, ఆ మంచి మనసును మెచ్చుకోవాల్సిందే

టాప్ స్టోరీస్

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Relief For Amaravati Employees : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Relief For Amaravati Employees  : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Husband For Hire: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం!

Husband For Hire: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం!