Guppedantha Manasu Serial December 18th Episode: సారీ చెప్పమంటున్న రిషి.. చెప్పేదే లే అంటున్న వసుధార... మిషన్ ఎడ్యుకేషన్ ఫొటోస్ లో రిషి-నువ్వే ఉన్నారు జగతి మేడం కనిపించలేదన్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్
ఈగో మాస్టర్ రిషి..ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి వసుధార మధ్య గౌతమ్ ఎంట్రీ ఇవ్వడంతో గుప్పెడంత మనసు సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్
గౌతమ్ కార్డ్స్ తన బ్యాగులో ఉండిపోవడం చూసిన వసుధార కాల్ చేస్తుంది. ఏదో కొత్త నంబర్లా ఉందే అంటూ ఫోన్ ఎత్తుతాడు గౌతమ్..హలో సార్ గుడ్ మార్నింగ్ నేను వసుధారని మాట్లాడుతున్నాను అనేసరికి అక్కడే ఉన్న రిషి, మహేంద్ర స్టన్ అయిపోతారు. ఏ వసుధార అని అడిగి ఆమె అని కన్ఫర్మ్ చేసుకుని దేవుడా నువ్వున్నావ్ అంటూ గాల్లో తేలిపోతాడు. అప్పటి వరకూ స్పీకర్ ఆన్ చేసిన మాట్లాడిన గౌతమ్ స్పీకర్ ఆఫ్ చేస్తాడు. రిషి వెళ్లి వసుధార నీకు కాల్ చేసిందా అనగానే ప్లీస్ పర్సనల్ కాల్ అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మీ కార్డ్స్ కొన్ని నా బ్యాగులో ఉండిపోయాయని వసు మాట్లాడుతుంటే సో నైస్ అంటూ ఏదేదో మాట్లాడతాడు గౌతమ్. ఇది మీనంబరేనా సేవ్ చేసుకోవచ్చా అని అడుగుతాడు. విధి విచిత్రం అంటూ మాట్లాడుతున్న గౌతమ్ ని ఎందుకలా సార్ అని అడుగుతుంది వసు. త్వరలో కలిసినప్పుడు చెబుతా అంటాడు.. కార్డ్స్ ఎప్పుడు తీసుకుంటారని అడిగితే .ఈవెనింగ్ మీ రెస్టారెంట్ కి వస్తాను ఓ కప్పు కాఫీ షేర్ చేసుకుందాం..అప్పుడు తీసుకుంటాలే అంటాడు గౌతమ్. సరే సర్ బై అని ఫోన్ కట్ చేస్తుంది. వెనుకనుంచి ఇదంతా వింటున్న రిషి మొహంలో రంగులు మారుతుంటే మహేంద్ర మాత్రం నవ్వుకుంటాడు. హ్యాపీ ..అంకుల్ ఈ గౌతమ్ ఫుల్ హ్యాపీ..అంకుల్ ఈవెనింగ్ కాఫీ తాగుదాం వస్తారా వసుధార రెస్టారెంట్లో అంటే నేనెందుకులే గౌతమ్ అంటే నువ్వు రెడీగా ఉండు ఈవెనింగ్ కాఫీకి వెళుతున్నాం అని అంటే రిషి సారీ నేను రానంటాడు. మరీ మంచిది నన్ను అక్కడ డ్రాప్ చేసివెళ్లు అంటాడు. వసు నీకెలా కాల్ చేసింది, నీ నంబర్ తనదగ్గర ఎలా ఉందని అడిగితే.. పర్సనల్ మ్యాటర్స్ అడగొద్దు మిత్రమా అనేసి వెళ్లిపోతాడు. వసుధార ఈ మార్నింగ్ ఎంత హాయిగా ఓపెన్ అయిందో అనుకుంటాడు. వసు తనకెందుకు కాల్ చేసిందని ఆలోచనలో పడతాడు రిషి.
Also Read: గౌతమ్ కి కాల్ చేసిన వసుధార.. షాక్ లో రిషి.. ఎంజాయ్ చేస్తున్న మహేంద్ర..గుప్పెడంత మనసు డిసెంబరు 17 శుక్రవారం ఎపిసోడ్
వసు రాత్రి ఎవర్నో ఆసుపత్రిలో చేర్పించారు కదా ఎలా ఉందో కనుక్కున్నావా అంటే కనుక్కున్నా అంతా బాగానే ఉందని చెప్పారని అంటుంది వసుధార. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ షార్ట్ ఫిలిం గురించి నువ్వు రిషితో మాట్లాడాలి అన్న జగతితో..పిలిచి పనిచెబితే చేస్తాను కానీ కల్పించుకుని వెళ్లనంటుంది. దీంతో నువ్వు కుదరదు అంటే నాకు తప్పదు కదా అంటూ మహేంద్రకి కాల్ చేస్తుంది. వసు ద్వారా కాల్ చేయించి ఫోన్ స్పీకర్ ఆన్ చేయిస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి నావైపునుంచి షార్ట్ ఫిలిం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి. నువ్వే రిషికి చెప్పి ఓ మీటింగ్ పెట్టు అంటుంది. మహేంద్ర అక్కయ్యకి ఎలా ఉందని అడిగితే తనకేం బాగానే ఉందని చెబుతాడు మహేంద్ర. ఏంటో వసు నీపనులు కూడా నేను చేయాల్సి వస్తోందని నువ్వు ఇలా లేకుండా ఉండింటే ఇవన్నీ నువ్వే చేయాలి కదా అంటుంది. మేడం మీరు రిషిసర్ తల్లిగా ఆలోచిస్తున్నారు, వసుధార గురువుగా ఆలోచించండి నాది పంతమో, ఆత్మాభిమానమో అర్థమవుతుంది, రిషిసర్ ఏమన్నారో చెప్పాను కదా, అయినా నేనెందుకు సారీ చెప్పాలి అంటుంది. ఏంటో నువ్వు మారవు, రిషిని మార్చలేనని మనసులో అనుకుంటుంది జగతి.
Also Read: వసుధార కౌంటర్లకి విలవిల్లాడుతున్న ఇగోమాస్టర్ రిషి.. వసుని చూసి మురిసిపోతున్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 16 గురువారం ఎపిసోడ్
కట్ చేస్తే కాలేజ్ లో సీన్ ఓపెన్ అవుతుంది. క్లాస్ చెప్పేందుకు వస్తాడు రిషి..అందరూ లేచి నిలబడినా వసుధార మాత్రం అలాగే పుస్తకంలో రాసుకుంటూ ఉండిపోతుంది. పుష్ప చెబుతున్నా వినకపోవడంతో రిషి..వసుధార అని పిలుస్తాడు. లాస్ట్ క్లాస్ లో చెప్పిన చాప్టర్ ఓసారి రివిజన్ చేసుకుందాం...లాస్ట్ క్లాస్ లో నోట్స్ ఎవరు సరిగ్గా రాశారని అడిగితే వసుధార చెయ్యి ఎత్తుతుంది. క్లాసులో ఇంతమంది ఉండి ఎవ్వరూ రాయలేదా అని క్లాస్ వేస్తాడు. ఇంతలో వసు తన నోట్స్ ఇచ్చి పుష్పతో పంపిస్తుంది. ఆ నోట్స్ లోంచి గౌతమ్ కార్డు కిందపడుతుంది. అప్పుడు ఈ నోట్స్ వసుధారది అని చూస్తాడు రిషి. గౌతమ్ విజిటింగ్ కార్డ్ వసుధార నోట్స్ లోకి ఎలా వచ్చిందని అనుకుంటా పుష్ప అని పిలిచి లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్న ఈలెక్కని బోర్డుపై రాయి అంటాడు. నోట్ బుక్ నాదని తెలిసినట్టుంది ఇప్పుడు ఇదొక తలనొప్పా అనుకుంటుంది. నా పక్కనే కూర్చుని దేవయాని విషయంలో సారీ చెప్పమని అడుగుతారనుకుంటా..అయినా నేను చెప్పను.. రండి వచ్చి మీరు ఏం తిట్టాలనుకుంటే తిట్టండి అనుకుని పక్కకు జరుగుతుంది. రిషి మాత్రం వసుధారని దాటుకుని మరో బెంచిలో కూర్చుంటాడు.
Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
మహేంద్ర, జగతి ఇద్దరూ కలసి ఫణీంద్ర దగ్గర అసలు విషయం చెబుతారు. రెస్టారెంట్లో జరిగింది దేవయాని తప్పే అయినా మనం రిషికి నచ్చచెప్పి ఏం ఒరుగుతుందని అంటాడు ఫణీంద్ర. నేను వెళ్లి దేవయానిది తప్పని చెప్పినా రిషి నమ్మడు. ఎవ్వరు చెప్పినా రిషి నమ్మడు..తనకు తానుగా తెలుసుకుంటే కానీ ఫలితం ఉండదంటాడు. మీటింగ్ కి అన్నీ సిద్ధం చేశారా అని అడిగిన ఫణీంద్ర మీరు ఆపనిలో ఉండండని చెబుతారు. బయటకు వచ్చిన జగతి మహేంద్ర...ఏంటీ మహేంద్ర బావగారు కూడా ఈ విషయంలో చేతులెత్తేశారు..ఆయన చెబితే రిషి వింటాడని అనుకున్నా అంటుంది. ఇంతలో గౌతమ్ అక్కడకు రావడంతో జగతిని పరిచయం చేస్తాడు మహేంద్ర. మీలాగే మా రిషి కూడా మ్యాథ్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అంటాడు. జీన్స్ రా బాబు తల్లి దారిలో కొడుకు అని మహేంద్ర అనుకుంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ ఐడియా జగతి మేడందే అని చెబుతాడు. మీలాంటి వాళ్లు కాలేజీకి ఒక్కరు ఉంటే చాలన్న గౌతమ్ తో మేడం ఆ ప్రాజెక్ట్ కి హెడ్ గా ఉన్నారని పొగిడేస్తుంటే ఇంతలో వసుధార ఎంట్రీ ఇస్తుంది. గౌతమ్ ఆమెనే అలా చూస్తూ ఉండిపోతాడు.
జగతి, మహేంద్రకి గుడ్ మార్నింగ్ చెప్పిన వసుధారని..హలో వసుధార అని పలకరిస్తాడు గౌతమ్. ఏంటి మళ్లీ కాలేజీకి వచ్చాడనుకుంటున్నారా అంటే అలాఏం లేదంటుంది...గౌతమ్ మాత్రం మనసులో నేను వచ్చింది నీకోసమే అనుకుంటాడు. ధరణి వదిన మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కొన్ని ఫొటోస్ చూపించింది. అందులో నువ్వు, రిషి మాత్రమే ఉన్నారు జగతి మేడం లేరు అంటాడు. నువ్వు రిషికి ప్రాజెక్టులో రైట్ హ్యాండ్ అంటకదా అని మాట్లాడుతుంటే అక్కడకు ఈగో మాస్టర్ రిషి ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజు సీరియల్ ముగిసింది.
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
సోమవారం ఎపిసోడ్ లో
సోమవారం ఎపిసోడ్ కి సంబంధించిన కమింగప్ లో ...వసుధార-పుష్ప కాలేజీ మెట్లపై కూర్చుని మాట్లాడుకుంటారు. నీకు తెలుసా పుష్ప .. గౌతమ్ సార్ ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నారో మన రిషి సార్ కూడా ఉన్నారు నోట్లోంచి మాటేరాదు. గౌతమ్ సార్ గలగలా మాట్లాడతారని అంటుంది. ఇంతలో బుక్ లో ఉన్న నెమలి ఈక ఎగిరి రిషిపై పడుతుంది. నువ్వు-జగతి మేడం మా పెద్దమ్మకి సారీ చెప్పాలని రిషి అంటే..చెప్పేదిలేదంటుంది వసుధార.
Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి