(Source: ECI/ABP News/ABP Majha)
Guppedantha Manasu Serial Today Episode: మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని చెప్పిన రిషి మాటల్ని గుర్తుచేసుకుని వసుని బాధపెట్టి తను బాధపడుతుంది జగతి.. డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
జగతి-వసుధార
రిషికి గుడ్ నైట్ మెసేజ్ పెట్టేసి జగతి దగ్గరకు వచ్చిన వసుధార.. ఎందుకిలా ఉన్నారని అడుగుతుంది. ఏమీ లేదని చెప్పిన జగతి ..నేనొకటి చెబుతాను చేస్తావా అంటుంది. మీరు నాకు మార్గదర్శకులు, నా భవిష్యత్ కి కొత్త దారి చూపించారు, మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, ఏ బంధం-బంధుత్వం లేకుండా నన్ను ఆదరిస్తున్నారని అంటుంది. రిషి చెప్పిన పని గురించి ఆలోచిస్తే నాకు ఏం చేయాలో అర్థంకావడం లేదు..నీతోనే నీ మొహం మీదే నా ఇంట్లోంచి వెళ్లిపో అని ఎలా చెప్పగలను అనుకుంటుంది జగతి. మేడం ఏదైనా ప్రాబ్లెమా అని వసు అడుగుతుంది. ఏం లేదు వసు..నాకు తలనొప్పిగా ఉంది వెళ్లి నిద్రపో అనేస్తుంది. కాఫీ ఇవ్వనా, ట్యాబ్లెట్ తేనా అని అడిగితే... ఆ పనులు నేను చేసుకోగలను అంటుంది. మేడంని చూసిన వసు ఏమైంది ఎందుకింత డల్ గా ఉన్నారని ఆలోచిస్తుంది.
Also Read: రిషి మనసులో ఏముంది.. వసుని ఎందుకు హాస్టల్ కి పంపించేయమన్నాడు, గుప్పెడంత మనసు డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్...
రిషి-మహేంద్ర
రిషి మౌత్ ఆర్గాన్ వాయిస్తూ కూర్చుంటాడు. వసు గుడ్ నైట్ మెసేజ్ చూసి నేను రిప్లై ఇవ్వలేదని గుడ్ నైట్ అని పెట్టిందా.. అంటే మెసేజ్ పంపొద్దనా, నేను ఫోన్ చేస్తే అనుకుని.. నిద్రపోతుందేమో అనుకుని ఆగిపోతాడు. వసుతో కలసి ఉన్న ఫొటోస్ చూస్తూ తండ్రి ఫొటో దగ్గర ఆగిపోతాడు. లేచి మహేంద్ర రూమ్ కి వెళ్లేసరికి మహేంద్ర నిద్రపోయి ఉంటాడు. కొడుకుని గమనించి లేచి కూర్చుంటాడు మహేంద్ర. నిద్రపట్టలేదు డాడ్..ప్రతీసారీ మీరు నన్ను డిస్టబ్ చేస్తారు కదా ప్రేమగా..ఇప్పుడు నా వొంతు అనుకోండి అంటాడు. చెప్పండి డాడ్ అంటే ఏం చెప్పమంటావ్ అని అడిగిన మహేంద్రతో కబుర్లు చెప్పండి అంటాడు రిషి. నువ్వింకా చిన్న పిల్లాడివా అన్న తండ్రితో.. నేను ఎప్పుడూ చిన్నపిల్లాడినే కదా..మనసెప్పుడూ పసిదే కదా అంటాడు రిషి. మనసుని అప్పుడప్పుడు వదలాలి-అప్పుడప్పుడు కళ్లెం వేయాలి-అన్నీ మనసులోనే దాచుకుంటే కష్టం నాయనా అంటాడు మహేంద్ర. మామూలుగా అయితే కొటేషన్..కొడుక్కి చెబుతున్నా కదా అందుకే సజిషన్ అంటాడు మహేంద్ర. రిషి వెళుతూ ఈ రూమ్ తలుపులు మూసి పెట్టు..నీ మనసు తలుపులు తీసిపెట్టి అంటాడు.
Also Read: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్
జగతి ఇంట్లో
కాలేజీకి రెడీ అయిన జగతి.. వసుధారని ఇంట్లోంచి ఎందుకు పంపించేయాలని ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార కాఫీ ఇస్తుంది. ఇంకా మేడం డల్ గా కనిపిస్తున్నారు ఏమై ఉంటుందని ఆలోచిస్తుంది వసుధార. కాఫీ పక్కన పెట్టేసిన జగతిని.. పక్కన పెట్టారెందుకు అని వసు అడుగుతుంది. మనకు నచ్చినా,నచ్చకపోయినా కొన్ని పక్కన పెట్టాల్సి వస్తుందంటుంది జగతి. మీకు కాఫీ నచ్చకపోతే మళ్లీ కలుపుతా అంటుంది వసుధార. నచ్చని ప్రతి విషయాన్ని మార్చలేం కదా అనేసి ఆ కాఫీ బాధగా ఒంపేస్తుంది. వసు మాట్లాడేందుకు ప్రయత్నించినా జగతి ముభావంగానే ఉండిపోతుంది. నేను ఒంటరిదాన్ని నాకు అలవాటే అన్నీ నువ్వంటే మధ్యలో వచ్చావ్..నువ్వు నాతో జీవితాంతం ఉండవు కదా కాఫీ కలుపుకుంటాలే అనేస్తుంది. కారు డ్రైవ్ చేస్తున్న రిషి..ఎక్కడికి వెళ్లాలో చెప్పు అని గౌతమ్ ని అడుగుతాడు. వసు దగ్గరకు అని తెలియగానే కారు ఆపేసిన రిషి... అర్జెంట్ పని ఉందంటే పొద్దున్నే వచ్చా ఇంత పొద్దున్నే ఆమెతో నీకేం పని అంటాడు. ఇది కరెక్ట్ కాదని రిషి చెప్పినా గౌతమ్ ఒప్పుకోడు.
Also Read: రిషిని ఆలోచనలో పడేసిన మహేంద్ర మాటలు, వసు విషయంలో రిషి తీరుపై గౌతమ్ కి బోలెడు డౌట్స్, గుప్పెడంత మనసు డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్…
కట్ చేస్తే.. రూమ్ లో ఒంటరిగా కూర్చున్న వసుధార మేడంలో ఏదో మార్పొచ్చిందని అనుకుంటుంది. కాలేజీకి జగతితో కలసి బయలు దేరుదాం అనుకుంటుంది. కానీ జగతి మాత్రం నేను వెళతా నువ్వు వచ్చెయ్ అంటుంది. మేడం నేను కూడా వస్తాను అన్న వసుతో అన్నిసార్లు మనకోసం ఆగవు..సౌకర్యాలు-విలాసాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయే మేఘాల్లాంటివి మనసు అన్నింటికీ అలవాటు పడాలి..ప్రతిరోజూ కారు అలవాటైందా..ఆటోలో కాలేజీకి వచ్చెయ్ అంటుంది. లంచ్ నా వరకే చేసుకున్నా..నీకు కావాల్సింది ఏదో నువ్వు వండుకో అంటుంది. ఏంటి మేడం కొత్తగా అన్న వసుతో అన్నింటికీ ప్రశ్నలు వేయడం సరికాదు.. ఒక్కోసారి కొన్ని నేర్చుకోవాలి నువ్వు ఒంటరిగా రావడం నేర్చుకో అనేసి వెళ్లిపోతుంది. ఏమైంది మేడంకి ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారని బాధపడుతుంది వసుధార. అటు జగతి కూడా ఓ దగ్గర కారు ఆపేసి వసు నా మనసు తొందరగా అర్థం చేసుకో అని ఏడుస్తూ..ఖాళీ లంచ్ బాక్స్ చూసి బాధపడుతూ సారీ వసు అనుకుంటుంది.
Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
జగతి ఇంటికి రిషి-గౌతమ్ వస్తారు. ఇంటి ముందు నిల్చుని ఉన్న వసుధారని చూసి గౌతమ్ కారు దిగి వెళతాడు. పొద్దున్నే వచ్చామనే షాక్ లో ఉన్నారా అన్న గౌతమ్ ..రిషి వస్తుంటే తనతో పాటూ వచ్చేశా అంటాడు. వసు డల్ గా ఉందంటే జగతి మేడం నేను చెప్పిన పని మొదలు పెట్టారా అనుకుంటాడు రిషి. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.
Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
Also Read: సారీ చెప్పమంటున్న రిషి.. చెప్పేదే లే అంటున్న వసుధార... మిషన్ ఎడ్యుకేషన్ ఫొటోస్ లో రిషి-నువ్వే ఉన్నారు జగతి మేడం కనిపించలేదన్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి