News
News
X

Karthika Deepam 24 December Today Episode : కార్తీక్, దీపకు మరోసారి షాక్ ఇచ్చిన రుద్రాణి, మోనిత కొడుకుని వెతికే పనిలో పడిన సౌందర్య, కార్తీకదీపం డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్24 శుక్రవారం 1231 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే

FOLLOW US: 

కార్తీకదీపం డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్

కార్తీక దీపం గురువారం ఎపిసోడ్ లో శ్రావ్య కొడుకుని దాచిపెట్టి టెన్షన్ పెట్టిన మోనిత... తన రూమ్ లో బెడ్డుకింద ఉన్నాడని చెబుతుంది. ఆ తర్వాత చూశారా అత్తయ్య.. దీపూగాడు ఒక్క పది నిమిషాలు కనిపించకపోతే మీరు అల్లాడిపోయారు. దీపూ మీ మనవడు, అలాగే నా కొడుకు కూడా మీ మనవడే కదా..నా కొడుకు తప్పిపోయాడంటే ఎందుకు బాధపడడం లేదంటుంది. 

Also Read:  సామీ సాంగేసుకున్న డాక్టర్ బాబు-వంటలక్క, నెక్ట్స్ లెవెల్ కి చేరిన రుద్రాణి పంతం , కార్తీకదీపం డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్
కట్ చేస్తే.. శౌర్య, హిమ ఇద్దరూ స్కూల్ కు వెళ్లేందుకు రెడీ అవుతారు. స్కూల్ లో ఎవ్వరూ డాడీ డాక్టర్ అనే విషయం చెప్పొద్దు అని దీప పిల్లలకు చెబుతుంది. సరే అంటారు. ఆ తర్వాత తన జేబులో ఉన్న 10 రూపాయలు తీసి ఇచ్చిన కార్తీక్ ఏదైనా కొనుక్కోమంటాడు. ముందు వద్దు అన్న పిల్లలు..దీప తీసుకోమని చెప్పడంతో తీసుకుంటారు.  మరోవైపు సౌందర్య, ఆనందరావు, ఆదిత్య ముగ్గురూ కూర్చుని తింటుంటే అక్కడకు వచ్చిన మోనిత..ఏంటి ఇవాళ వంటలు అంటూ డైనింగ్ టేబుల్ పై కూర్చుంటుంది. నాకు వడ్డించు శ్రావ్య అనడంతో..ఛీఛీ అంటూ లేస్తాడు ఆదిత్య. వారించిన సౌందర్య..సిగ్గులేనిది దానికి..నువ్వెందుకు లేస్తున్నావ్ కూర్చో అంటూ గట్టిగానే క్లాస్ పీకుతుంది. నాకు ఉన్నది ఇద్దరు మనవరాళ్లు, ఒక మనవడు అంటుంది. అసహజంగా బిడ్డను కని ఈ ఇంటిపైకి వచ్చి మా పరువు తీసి.. బిడ్డను తీసుకొచ్చి మా మనవడు అంటే సరిపోతుందా..ప్రతి దానికీ నువ్వే అడ్డదారిలో గెలుస్తావని అనుకోకు..ఇది మా ఇల్లు..ఇది సౌందర్య ఇల్లు..నీ ఆటలు ఇక్కడ సాగవ్... నాకు కోపం వచ్చిందంటే రెండు నిముషాల్లో నీ జీవితం తారుమారైపోతుంది. జాగ్రత్తగా ఉండుగెట్ అవుట్ అంటుంది సౌందర్య. 

Also Read:
మరోవైపు దీప సరుకుల కోసం కిరాణం షాపుకి వెళుతుంది. సరుకులు ఇవ్వు అంటే ఈ సరుకులు లేవంటాడు వ్యాపారి. ఎందుకు లేవంటున్నావ్ అంటే..నాకు రుద్రాణే కనిపిస్తుంది అంటాడు. నాకు కోటేశ్ బాకీ ఉన్నాడు...ముందు బాకీ తీర్చు అంటాడు.  దీంతో కోటేశ్ నీకు ఇవ్వమని డబ్బులు ఇచ్చాడు.. అవి కూడా వద్దా అంటుంది దీప. ఇవ్వండి.. సరుకులు మీకు ఇవ్వను. కోటేశ్ కు ఇస్తున్నాను అంటాడు. సరుకులు తీసుకుని వెళ్తుంది దీప. కట్ చేస్తే స్కూల్ కి వెళ్లిన పిల్లలు లంచ్ టైమ్ లో స్కూల్లోనే భోజనం పెడుతున్నారని తెలిసి అక్కడికి వెళతారు. అక్కడ తినబుద్ధి కాకపోయినా తప్పని పరిస్థితుల్లో ఇద్దరూ తింటారు. ఆయా రమ్మని పిలవడంతో వెళ్లి తింటారు. 

Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..
మరోవైపు రత్నసీతను కలిసిన సౌందర్య..నువ్వు మోనిత వైపు ఎందుకు ఉన్నావో, మోనిత మాటలు ఎందుకు విన్నావో తెలియదు కానీ మోనిత తన బిడ్డను నీ దగ్గర దాచిపెట్టిందా అని అడుగుతుంది. దీంతో లేదు మేడమ్ నా దగ్గర తన బిడ్డ లేదు అంటుంది రత్నసీత. అయితే ఒక పని చేస్తావా? నేను చెప్పిన ఒక్క పని నాకోసం చేస్తావా? అని అడుగుతుంది. దీంతో సరే మేడమ్ చేస్తాను అంటుంది. మోనిత ఎక్కడికి వెళ్తుందో.. ఎవరిని కలుస్తుందో నాకు చేసి పెట్టు అదొక్క సాయం నాకు చేయి. నేను నీకోసం ఏదైనా చేస్తా అంటుంది సౌందర్య.

Also Read:  శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
మరోవైపు దీప సరుకులు తీసుకుని ఇంటికి మోసుకెళ్తూ ఉంటుంది. దీప సరుకులు మోసుకురావడం చూసిన కార్తీక్ బాధపడతాడు. నువ్వు ఇలా మోయడం ఏంటి ఇటివ్వు అంటాడు. సారీ దీప నిన్ను ఇలా కష్టపెడుతున్నాను అంటే.. వంటలక్కకు ఇవన్నీ మామూలే కార్తీక్ బాబు అంటుంది. వంటలక్కగా నువ్వు మారడానికి కూడా కారణం నేనే కదా అంటాడు. మీరు నా పక్కన ఉంటే ఏదీ కష్టం కాదు అంటుంది దీప. నీ కష్టాలన్నింటికీ నేను బాధ్యుడిని అంటూ అక్కడ ఒక పెద్ద ఆకు ఉంటే దానితో దీపకు గాలి విసురుతాడు. 

Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
మరోవైపు పిల్లలకు సరైన భోజనం పెట్టలేకపోతున్నాను అని బాధపడతాడు కార్తీక్. నిన్ను కష్టాల పాలు చేస్తున్నాను అంటాడు కార్తీక్. దీంతో ప్రతి స్త్రీకి భర్త తోడు ఉంటే చాలు కార్తీక్ బాబు అంటుంది. రుద్రాణి అప్పెలా తీరుస్తాం, పిల్లలకు పుస్తకాలు కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నాం అంటాడు. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

రేపటి ఎపిసోడ్ లో

రేపు బాబుకు నామకరణం చేద్దాం అంటుంది శ్రీవల్లి . ఇంతకీ పేరు ఏం పెడదామని అనుకుంటున్నావు అని అంటుంది దీప. ఆనంద్ అని పెడదామని అనుకుంటున్నా అంటుంది శ్రీవల్లి. ఆనంద్ ఎందుకు అంటే.. ఏమో తెలియదు కానీ.. కోటేశ్... బాబును దత్తత తీసుకున్నప్పటి నుంచి ఆనంద్ అనే పేరే పెడదామని అనుకుంటున్నాడు అంటుంది శ్రీవల్లి. దీంతో అందరూ షాక్ అవుతారు. 

రేపటి ఎపిసోడ్ లో

Also Read: రిషి మనసులో ఏముంది.. వసుని ఎందుకు హాస్టల్ కి పంపించేయమన్నాడు, గుప్పెడంత మనసు డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్...
Also Read:  నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read:  వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

Published at : 24 Dec 2021 10:37 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam new Episode24 December Episode

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham August 18th Update: యష్ ఇంట ఖైలాష్ తుఫాన్ - భర్త ఇచ్చిన చీర కట్టుకుని మురిసిన వేద, యష్ కంటతడి

Ennenno Janmalabandham August 18th Update: యష్ ఇంట ఖైలాష్ తుఫాన్ - భర్త ఇచ్చిన చీర కట్టుకుని మురిసిన వేద, యష్ కంటతడి

అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!

అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనట, వాళ్లకు సెకండ్ ఛాన్స్?

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనట, వాళ్లకు సెకండ్ ఛాన్స్?

Janaki Kalaganaledu August 17th Update: గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి అఖిల్ వెళ్తున్నాడని పసిగట్టిన మల్లిక- అన్నకి రాఖీ కట్టమని జానకికి చెప్పిన జ్ఞానంబ

Janaki Kalaganaledu August 17th Update: గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి అఖిల్ వెళ్తున్నాడని పసిగట్టిన మల్లిక- అన్నకి రాఖీ కట్టమని జానకికి చెప్పిన జ్ఞానంబ

Guppedantha Manasu ఆగస్టు 17 ఎపిసోడ్: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి

Guppedantha Manasu ఆగస్టు 17 ఎపిసోడ్: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి

టాప్ స్టోరీస్

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !