Karthika Deepam December 23 Episode: బుద్ధి చూపించిన మోనిత, బాధపడిన డాక్టర్ బాబు.. కార్తీకదీపం డిసెంబరు 23 గురువారం ఎపిసోడ్..

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్23 బుధవారం 1230 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే

FOLLOW US: 

కార్తీకదీపం సీరియల్ డిసెంబరు 23 గురువారం ఎపిసోడ్

గత ఎపిసోడ్‌లో.. దీప తన బంగారమంతా తాగట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటుంది. ఇక రుద్రాణి దారిలో కోటేష్, శ్రీవల్లి కొడుకుని చూసి ముచ్చటపడి దిష్టి తీస్తుంది.  మరోవైపు వారణాసి సౌందర్యని కలిసి.. ‘దీపక్క వాళ్ల సమాచారం ఏం తెలియలేదు మేడమ్’ అంటూ కంటతడి పెట్టుకుంటాడు. ఈ రోజు ఎపిసోడ్ సౌందర్య-మోనిత మధ్య డిస్కషన్ తో మొదలైంది. సౌందర్య వారణాసి  దీప గురించి మాట్లాడుకుంటుంటే అక్కడకు వచ్చిన మోనిత రచ్చ చేస్తుంది. కోడలి కోసం ఎంత ఏడుస్తున్నారు ఆంటీ? మరి నా బాబు ఏం పాపం చేశాడు.. వాడు మీ మనవడే కదా.. వాడి కోసం మీరు ఇలా తాపత్రయపడ్డారా అసలు అని వాదనకు దిగుతుంది. చూడు మోనితా అనవసరంగా మాట్లాడొద్దని సౌందర్య వార్నింగ్ ఇస్తుంది. ఆంటీ ఆ రోజు మీరు తల్లిని బిడ్డని వేరు చేసి హిమని ఎత్తుకొచ్చారు.. ఆ రోజు దీప, కార్తీక్‌లని కలపడానికి మీరు అలా చేయగాలేనిది.. ఈ రోజు నన్ను, కార్తీక్‌ని విడదియ్యడానికి నా బిడ్డని ఎత్తుకొచ్చి ఉంటారని నేను అనుకోవడంలో తప్పేముంది అంటుంది.  నోరుముయ్ మోనితా.. నీ బాబు కనిపించకపోతే వెళ్లి వెతుక్కో ..ఇలాగే పిచ్చి వాగుడు వాగితే నిద్రపోయినప్పుడు  కాల్చిన అట్లకాడతో ఆటోగ్రాఫ్ ఇస్తాను అంటుంది. 

Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..
సీన్ కట్ చేస్తే.. హిమ, సౌర్య, కార్తీక్ మొక్కలు నాటుతూ ఉంటారు. దీప ఇంటికి వచ్చి మంచి పని చేస్తున్నారు.. నేను హెల్ప్ చేస్తాను అంటుంది. అప్పుడే అక్కడున్న శ్రీవల్లి దీప ఒంటి మీద బంగారం లేదని గుర్తించి అడిగేస్తుంది. దీప సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతుంటే.. కార్తీక్, పిల్లలు షాకింగ్‌గా దీపవైపే చూస్తుంటారు. ఇంతలో బాబు ఏడుపు వినిపించడంతో  శ్రీవల్లి, పిల్లలు అటు పరుగుతీస్తారు. వెంటనే కార్తీక్ దీపతో.. బంగారం అమ్మేశావా నేను చేతకానివాడిలా అయిపోయాను.. నన్ను ఏ పని చెయ్యొద్దు అంటావ్.. నువ్వు మాత్రం ఇలాంటి పనులు చేస్తుంటావ్ అంటాడు. అమ్మలేదు కార్తీక్ బాబు.. తాగట్టు పెట్టానంతే  మళ్లీ విడిపించుకుందాం అని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా కార్తీక్ బాధపడతాడు. మొక్కలు నాటుతున్న కార్తీక్ చేతుల్ని పట్టుకున్న దీప..ఒక్కోసారి మంచి పనులు చేసినా చేతికి మట్టి అంటుంది కార్తీక్ బాబు.. మీ తప్పేం లేదు కదా అంటుంది దీప. నేను చేసిన తప్పుల్ని నువ్వు సరిదిద్దుతున్నావ్ దీపా అంటాడు కార్తీక్. 

Also Read: సామీ సాంగేసుకున్న డాక్టర్ బాబు-వంటలక్క, నెక్ట్స్ లెవెల్ కి చేరిన రుద్రాణి పంతం , కార్తీకదీపం డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్
మోనిత మనసులో తెగ రగిలిపోతుంది. ‘నేను తల్లిగా ఓడిపోతున్నానా? నా కన్న ప్రేమ వీళ్లకి అర్థం కావట్లేదా? తెలిసేలా చేస్తాను అనుకుంటుంది. ఆనందరావుగారు మిమ్మల్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటా అంటుంది. మరోవైపు దీప తాగట్టు పెట్టిన  బంగారం తీసుకెళ్లి  రుద్రాణికి ఇస్తాడు సేటు. ఆ దీప డబ్బు తెచ్చి నా బంగారం నాకు ఇవ్వమంటే రుద్రాణికి అమ్మేశానని చెప్పు అని సేటుని పంపించేస్తుంది. దీప బంగారాన్ని చూస్తూ..దీపా భూమి గుండ్రంగా ఉంది దీపా.. ఎప్పటికైనా వీటి కోసం నువ్వు నా దగ్గరకు రావాల్సిందే అనుకుంటుంది. మరోవైపు రుద్రాణి మమ్మల్ని మనశ్సాంతిగా బతకనిచ్చేట్టు లేదని దీప బాధపడుతుంది. కార్తీక్ మాటలు తలుచుకుని కుమిలిపోతుంది. పిల్లలు కథ చెప్పమన్నా పడుకోమ్మా అనేస్తాడు కార్తీక్. ఇంతలో బాబు ఏడుపు వినిపిస్తుంది. అమ్మా నీకో విషయం తెలుసా... తమ్ముడు...నాన్న ఎత్తుకుంటే ఏడుపు ఆపేస్తాడని చెబుతుంది శౌర్య. అవునమ్మా మంచి వాళ్లంటే పిల్లలకి చాలా ఇష్టం అంటుంది దీప.  కార్తీక్ ఆస్తంతా వేరేవాళ్లకి ఇచ్చేసిన విషయం గుర్తుచేసుకుంటారు. 

Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
సౌందర్య ఇంట్లో:
శ్రావ్య ఏడుస్తూ .. అత్తయ్యా దీపుగాడు కనిపించడంలేదంటుంది. తలో మోనిత రాగానే.. శ్రావ్యకు అర్థమైపోతుంది. మోనితా దీపుని మాయం చేసిందని. మోనిత మాత్రం ఏం పట్టనట్లుగా కూల్‌గా ఉంటే.. వెంటనే కాళ్ల మీద పడిపోతుంది శ్రావ్య. ‘మోనితా నీకు దండం పెడతాను ప్లీజ్ నా బాబుని నాకు ఇచ్చెయ్ అని ఏడుస్తుంది. శ్రావ్య ఏడుస్తుంటే.. మోనితకే బాధనిపిస్తుంది. సౌందర్య మాత్రం.. శ్రావ్య లే దాని కాళ్లు పట్టుకుంటావేంటని తిడుతుంది. లేదత్తయ్యా.. మోనితే నా బాబుని తీసుంటుందని ఏడుస్తుంది. మోనిత పొగరుగా సౌందర్య వైపు చూస్తూ.. పైకి మెట్లు ఎక్కుతూ మధ్యలో ఆగి అక్కడే కూర్చుని కాలు మీద కాలేసుకుని ఇప్పుడు అర్థమైంది శ్రావ్య కన్నప్రేమ.. బాబు కనిపించకపోతే ఎలా ఉంటుందో చిన్న శాంపిల్ చూపించానంతే అంటుంది.  ‘వెళ్లు.. నా బెడ్ కింద పడుకోబెట్టాను తెచ్చుకో’ అని చెబుతుంది. శ్రావ్య ఏడుస్తూ పరుగుతీస్తుంది.  ఈ రోజు  ఎపిసోడ్ ముగిసింది

రేపటి ఎపిసోడ్
జేబులోంచి పది రూపాయలు తీసి ఏదైనా కొనుక్కోమని ఇస్తాడు కార్తీక్. వద్దు డాడీ అంటారు పిల్లలు. మీరు కూడా నాపై జాలి పడొద్దు ప్లీజ్ అంటాడు. మరోవైపు దీప తలపై బియ్యం బస్తా,సరుకులు మోసుకుంటా రావడం చూసి కార్తీక్ బాధపడతాడు. అప్పులా తీర్చాలనే ఆలోచనలో రోడ్డుపై నడుస్తూ వెళుతుంటాడు.

Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: రిషిని ఆలోచనలో పడేసిన మహేంద్ర మాటలు, వసు విషయంలో రిషి తీరుపై గౌతమ్ కి బోలెడు డౌట్స్, గుప్పెడంత మనసు డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్…
Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్

Published at : 23 Dec 2021 09:54 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam new Episode23nd December Episode

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో 

Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో 

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులపై ఫిర్యాదు !

Complaint On Avanti Srinivas :

CM Jagan Davos Tour Contro : దావోస్ కంటే ముందు జగన్ లండన్ వెళ్లారా? అసలు నిజం ఏమిటి ?

CM Jagan Davos Tour Contro :  దావోస్ కంటే ముందు జగన్ లండన్ వెళ్లారా? అసలు నిజం ఏమిటి ?

NSE Co-location Scam: ఎన్‌ఎస్‌ఈ స్కామ్‌లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు

NSE Co-location Scam: ఎన్‌ఎస్‌ఈ స్కామ్‌లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు