అన్వేషించండి

Asia Cup విజేతగా తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది, ప్రజల ప్రార్థనలు ఫలించాయి: Suryakumar Yadav

దేశ ప్రజల మనసులు గెలుచుకోవడం, దేశం కోసం అద్భుత విజయాలు సాధించడమే అసలైన ట్రోఫీ అని ఆసియా కప్ ట్రోఫీని తిరస్కరించడంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు.

ముంబై: ఆసియా కప్ 2025 విజయం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఘన స్వాగతం లభించింది. సూర్యకుమార్ మాట్లాడుతూ.. "ఆసియా కప్ విజేతగా నిలిచి స్వదేశానికి తిరిగి రావడం సంతోషంగా ఉంది. మేం గత కొన్ని రోజుల మంచి క్రికెట్ ఆడి టోర్నమెంట్ గెలిచాము. ఇది మాకు గొప్ప అనుభవం. ప్రభుత్వం, BCCI మాకు స్వేచ్ఛగా ఆడటానికి అవకాశం ఇచ్చాయి. దాంతో పూర్తి స్థాయి ప్రదర్శన చేసి ఆసియా కప్ లో  విజయం సాధించాము. మా కోసం దేశ ప్రజలు ప్రార్థనలు చేయడం ఎల్లప్పుడూ బలాన్ని ఇస్తుంది’ అన్నాడు.

దుబాయ్: పాకిస్తాన్ మంత్రి, ఏసీసీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా #AsiaCup2025 ట్రోఫీని భారత్ తిరస్కరించడంపై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించారు. దీనిపై భారత్‌తో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ, పాకిస్తాన్ జట్టును తమ జట్టు ఓడించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్ తో పోల్చడంపై సైతం సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అసలు అది వివాదమే కాదు.. అసలైన ట్రోఫీకి అర్థం ఇదే
పాకిస్తాన్ మంత్రి నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకపోవడాన్ని నేను వివాదం అని పిలవను. ప్రజలు ట్రోఫీ ఫోటోలను మా చేతుల్లో ఉన్నట్లు, మేం ట్రోఫీతో సెలబ్రేట్ చేసుకున్నట్లు పోస్ట్ చేశారు. కానీ నిజమైన ట్రోఫీ అంటే మేం ప్రజల హృదయాలు గెలుచుకోవడం. ఆటగాళ్లు దేశ ప్రజల నుంచి సంపాదించే నమ్మకం. మాతో పాటు సహాయక సిబ్బంది, వారు చూపిన నమ్మకం, తెరవెనుక మాకోసం పనిచేసే వారిపై విశ్వాసం ఉంచడం నిజమైన ట్రోఫీ. నిజమైన ట్రోఫీ అంటే మైదానంలో బరిలోకి దిగి విజయం సాధించడమే’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.

మోదీ ముందుండి బ్యాటింగ్ చేస్తే..

"ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్" అనే భారత ప్రధాని మోదీ ట్వీట్ పై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. "దేశ ప్రధాని స్వయంగా ముందుండి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంటుంది. ఆయన జట్టు కోసం స్ట్రైక్ తీసుకుని పరుగులు చేసినట్లు అనిపించింది. ఇది చాలా మంచి విషయం. మోదీ సర్ మమ్మల్ని ముందుండి నడిపిస్తే ఖచ్చితంగా ఆటగాళ్ళు స్వేచ్ఛగా ఆడతారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దేశం మొత్తం విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. మేం (భారతదేశానికి) తిరిగి వెళ్ళినప్పుడు, ఆ విషయం బాగా అనిపిస్తుంది. దేశం కోసం మరిన్ని విజయాలు సాధించడానికి మాకు మరింత ప్రేరణ ప్రేరణ లభిస్తుంది’ అన్నాడు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget