Team India Match Fess to India Army | Asia Cup 2025 | మ్యాచ్ ఫీజులు ఆర్మీ కి ఇచ్చిన SKY
ఆసియా కప్ లో పాక్ పై ఇండియా మొదటి మ్యాచ్ గెలిచినప్పుడు ... ఆ విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌లో పోరాడిన సైనికులకు అంకితం ఇచ్చాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో తాను చేసిన పనితో ఫ్యాన్స్ నుంచి ప్రసంశలు అందుకుంటున్నారు.
ఆసియా కప్‌లో గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్ లో ఒక ప్రకటన చేసాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో వచ్చిన మ్యాచ్ ఫీజును ఇండియా ఆర్మీకి, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పాడు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ఇదేమీ కాంట్రవర్సీ కాదని, నిజంగా చెప్పాలంటే చాలా మంచి విషయమని కూడా అన్నాడు.
అలాగే ఎక్స్ వేదికగా ఒక ప్రకటన కూడా చేసాడు. “ఈ టోర్నమెంట్ నుంచి నాకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని సైనికులకు, అలాగే పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అందజేయాలని నిర్ణయించుకున్నాను. జై హింద్,” అని తన పోస్టులో పేర్కొన్నాడు.





















