Tilak Varma Innings Asia Cup Final | తెలుగోడి పొగరు చూపించిన తిలక్
ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో ఆసియా కప్ 2025 విజేతగా నిలిచింది భారత్. పాకిస్తాన్ ను 5 వికెట్ల తేడాతో చితుగా ఓడించింది. పాకిస్తాన్ బ్యాట్స్మన్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసారు భారత బౌలర్లు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దాంతో 147 మాత్రమే చేసింది పాకిస్తాన్.
ఛేజింగ్ మొదలు పెట్టిన ఇండియా 20 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. అప్పుడు క్రీజ్ లోకి వచ్చాడు మన తెలుగోడు తిలక్ వర్మ. ఓ ఎండ్ లో వికెట్లు పడుతుంటే .. తను మాత్రం చాలా ఓపికగా బ్యాటింగ్ చేసాడు. ఎక్కడా పొరపాట్లు చేయకుండా షాట్లు కొట్టాడు. సంజు శాంసన్ ఔటయ్యాక శివమ్ దూబే క్రీజులోకి వచ్చాడు. తిలక్ వర్మతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరు కలిసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు తిలక్ వర్మ. గెలుపు ఖాయం అనుకున్న పాకిస్తాన్ కు తెలుగోడి దెబ్బ రుచి చూపించాడు. తన బ్యాటింగ్ తో భారత్ కు విజయ తిలకం దిద్దాడు. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు తిలక్ వర్మను పొగడ్తలతో ముంచేతుతున్నారు.




















