Prabhas The Raja Saab Telugu Trailer Decode | దెయ్యాలతో నింపేసి రాజాసాబ్ తో భయపెడుతున్న Maruthi
సలార్, కల్కి లాంటి సూపర్ హిట్స్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా రాజాసాబ్. రీసెంట్ గా అంత మంచి సక్సెస్ రికార్డ్ లేని డైరెక్టర్ మారుతి చెప్పిన కథ ప్రభాస్ ఇంత కెరీర్ లో పీక్ లో యాక్సెప్ట్ చేశాడంటేనే కథలో ఏదో మ్యాజిక్ ఉందని ముందు నుంచే అందరూ అనుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల అవుతున్న సినిమాకు మూడు నెలల ముందే ట్రైలర్ వదిలేశారు. మరి ఈ ట్రైలర్ లో అసలేం ఏముంది. రాజాసాబ్ గురించి ఏమైనా కథ తెలుసుకోవచ్చా..డీకోడ్ చేసేద్దాం.
ఈ సినిమాలో ప్రభాస్ రెండు రోల్స్ లో కనిపిస్తున్నారు. ఒకటి యంగ్ రోల్, రెండోది ముసలివాడిగా ఉన్న రాజాసాబ్ రోల్. యంగ్ రోల్ లో మే బీ కూరగాయల బిజినెస్ చేస్తాడనుకుంటా ప్రభాస్. ఈ రెండు మూడు షాట్స్ లో ఆయన వెనుక వెజిటిబుల్ మార్కెట్ ఉండటం చూడొచ్చు. మే బీ వడ్డీ వ్యాపారమైనా కావచ్చు. ఇది ఎందుకు ఫిక్స్ అవ్వొచ్చు అంటే ప్రభాస్ కి డబ్బు కావాలి. పేరు కావాలి. ఏదో ఒకటి ఫేమస్ అయిపోవాలి. మన పేరు సంచలనమైపోయి అందరూ మాట్లాడుకోవాలి అంటున్నాడు. ఎండ్ ఇక్కడ చూడాలి ప్రభాస్ డబ్బులు కోసం వచ్చినట్లు అర్థం చేస్తున్న విజువల్స్ ఇవే. ముందు హిప్నటైజ్ చేస్తున్న వ్యక్తి కళ్లు మూసుకోమన్నప్పుడు డబ్బులు ఉన్నాయి. రాజుగారి గదిలో ఈ భాండాగారంలో కూడా డబ్బులు, గోల్డ్ బిస్కెట్లు, వజ్రాలు లాంటి ఉన్నాయి. బట్ ఇక్కడే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాజమహల్ లో ఇవన్నీ నిధులు ఉన్నా వీటిని తీసుకోవటానికి ఛాన్స్ లేదన్నమాట. కాపలాగా చాలా దెయ్యాలు భూతాలు ఉన్నట్లున్నాయి. వింత వింత జీవులు, దెయ్యాలను చూపించారు డైరెక్టర్ మారుతి. మొసళ్లు లాంటి కొన్ని ప్రాణులు కూడా దాడి చేస్తున్నాయ్. ప్రభాస్ మొసలి ఫైట్ ని చూపించారు. ఇక సంజయ్ దత్ కూడా రెండు రోల్స్ లో కనిపిస్తున్నారు. ఒకటి సైకాలజిస్ట్, ఎక్స్ టార్టిస్ట్, తాంత్రిక విద్యలు తెలిసినవాడు అని చూపించారు రెండోది ఈ ట్రైన్ మీద బంగారు ఆభరణాలు వేసుకుని సముద్రఖని ని తన్నింది కూడా సంజయ్ దతే. దట్ మీన్స్ దట్ దట్ మీన్స్ సంజయ్ దత్ మే బీ ది విలన్.
అయితే ఇక్కడ విలన్లకు విలన్ గా ఓ పెద్దాయన ఆయనే మన మొగల్తూరు ప్రభాస్ రాజుగారు. ఎస్ ప్రభాస్ రాజుగారి గెటప్ లో అదరగొట్టేశాడు. మే బీ ఆయన కూడా ఆత్మ. తన సంపదను, కోటను దుష్టశక్తుల పాలిట పోకుండా కాపాడుకునేది ఆయనే. బట్ ఈయన ఎందుకు చనిపోయారు. అసలు ఆ నగలు, డబ్బు ఎందుకు ఇలా బయటపెట్టి ఉంచారు. దీని కోసం యంగ్ ప్రభాస్ వాళ్ల టీమ్ ఎందుకు ట్రై చేస్తున్నారు..సంజయ్ దత్ అసలు ఎవరు..ట్రైలర్ చివర్లో సర్ ప్రైజ్ ఎలిమింట్ లా చూపించిన ఆ భారీ మనిషి ఎవరు..ఇవన్నీ తెలియాలంటే జనవరి 9వరకూ ఆగాల్సిందే. యంగ్ లుక్ లో ప్రభాస్ కొంచెం సోసోగా ఉన్నా ముసలి రాజు గా ప్రభాస్ స్టైల్ అండ్ స్వాగ్ అరుపులు అరింపిచటం థియేటర్లలో పూనకాలు తెప్పించటం ఖాయం అనిపిస్తోంది. అసలు దేశమంతా మారుమోగిపోతున్న ప్రభాస్ ఇలాంటి ముసలి గెటప్ ను ఒప్పుకోవటమే ఆయన స్థాయి ఆయన స్థానం చెప్పేస్తున్నాయి. మొత్తానికి మన డార్లింగ్ ఎప్పుడూ ట్రై చేయని హారర్ ఫాంటసీ ఇండియా వైడ్ దుమ్ముదులిపేస్తే తెలుగువాళ్లుగా మన కావాల్సింది అంతకంటే ఏముంది. మారుతి అయితే చాలా ఎలిమింట్స్ తో మిక్చర్ పొట్లం కట్టారని అర్థమౌతోంది. మరి అవన్నీ సరిగ్గా సెట్ అయితే మాత్రం ప్రభాస్ రాజు మళ్లోసారి ఇండియన్ సినిమా స్క్రీన్ ను తగలబెట్టేయటం ఖాయం





















