Kakinada Latest News: కాల్చి పడేస్తా! గంజాయి స్మగ్లర్లకు కాకినాడ ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్
Kakinada Latest News: గంజాయి స్మగ్లర్లకు కాకినాడ ఎస్పీ బింధు మాధవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి వేషాలు వేస్తే కాల్చిపడేస్తానంటూ హెచ్చరించారు.

Kakinada Latest News: అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై కాకినాడ పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. ఇతర్రాష్ట్రాలకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఒక లగ్జరీ కారు, అందులో లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ స్మగ్లింగ్ దందా ఏ స్థాయిలో విస్తరించిందో, వారికి లభించే లాభాలు ఎంత భారీగా ఉంటాయో స్పష్టం చేస్తున్నాయి. అధికార వర్గాలు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు, ఈ కేసులో నలుగురు నిందితులు ఉన్నారు. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా, మిగిలిన ముగ్గురు రాజస్థాన్‌కు చెందినవారు. ఈ అంతర్రాష్ట్ర బంధాన్ని ఛేదించేందుకు పోలీసు బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.
క్రిస్టా వాహనంలో క్రిమినల్స్- లగ్జరీ కార్ల వెనుక దందా
ఈ కేసులో చిక్కిన వాహనం సాధారణమైనది కాదు. అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న వాహనం ఇన్నోవా క్రిస్టా. లగ్జరీ ఎస్‌యూవీగా పేరుగాంచిన ఈ వాహనం, సాధారణంగా అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటే, ఈ ముఠా ఎంత పకడ్బందీగా కార్యకలాపాలను నిర్వహించారో అర్థమవుతుంది. పోలీసులు అంచనా ప్రకారం, ఈ ఇన్నోవా క్రిస్టా వాహనం విలువ సుమారుగా రూ. 25 లక్షలు ఉంటుంది. కేవలం వాహనం విలువ ఇంత భారీగా ఉండటం చూస్తుంటే, ఈ రవాణాలో ఎంత పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతుందో తెలుస్తోంది.
గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్న ఈ వాహనం రాజస్థాన్ రిజిస్ట్రేషన్‌తో ఉంది. ఈ నెంబర్ అంతర్రాష్ట్ర లింక్‌ను మరింత బలోపేతం చేస్తోంది. విచారణలో నిందితులు పేర్కొన్నదాని ప్రకారం, చిక్కిన సరకు విలువ దాదాపు రూ. 30 లక్షలు. అయితే, రూ. 25 లక్షల విలువైన వాహనాన్ని రవాణా కోసం వినియోగించారంటే, అసలు సరకు విలువ చాలా ఎక్కువగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే, అధిక విలువ గల వాహనాలను ఉపయోగించడం ద్వారా తనిఖీలను తప్పించుకోవచ్చని, లేదా వేగంగా గమ్యాన్ని చేరుకోవచ్చని స్మగ్లర్లు భావిస్తారు. ఈ ఇన్నోవా క్రిస్టా వినియోగం ఈ ముఠా ఆపరేషనల్ స్టైల్, రిస్క్ తీసుకునే స్వభావాన్ని తెలియజేస్తుంది.
10 రెట్లు పెరిగే లాభం
ఈ కేసులో అత్యంత ముఖ్యమైన, పరిశోధనకు దారితీస్తున్న అంశం, రవాణా జరిగే ప్రాంతాన్ని బట్టి సరుకు విలువలో వచ్చే భారీ తేడా. అక్రమ సరకు లభించే ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు విలువ చాలా తక్కువగా ఉంటుందని, కానీ అదే సరకును రాజస్థాన్ వంటి సుదూర ప్రాంతానికి తరలిస్తే దాని విలువ ఏకంగా 10 రెట్లు పెరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఉదాహరణకు, రూ. 30 లక్షలు విలువ చేసే సరుకును గనుక రాజస్థాన్ వరకు చేర్చగలిగితే, దాని మార్కెట్ విలువ రూ.3 కోట్లకుపైగా పెరుగుతుంది. ఒక్క ట్రిప్‌తో పది రెట్లు లాభం పొందవచ్చనే ఈ ఆర్థిక ప్రలోభం కారణంగానే, ఈ అంతర్రాష్ట్ర ముఠాలు అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన రవాణా మార్గాలను ఎంచుకుంటున్నాయి.
గంజాయి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు రాజస్థాన్, ఉత్తర భారత రాష్ట్రాలకు తరలించినప్పుడు ఈ ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఈ భారీ లాభాల కోసమే హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఈ నెట్‌వర్క్‌లలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందినవాడు కావడం, ఈ నెట్‌వర్క్ తెలంగాణ రాజధానిలో కూడా వేళ్లూనుకుందని అనుమానించడానికి దారితీస్తోంది. అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పాటు రాజస్థాన్‌కు చెందిన మరో ముగ్గురు నిందితులపై కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసులు అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. అరెస్టులు పూర్తయ్యే వరకు నిందితుల పూర్తి వివరాలు, వారి బ్యాక్‌గ్రౌండ్ తెలియజేయలేమని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో కీలకమైన అరెస్టులు జరిగితే తప్ప, ఈ నెట్‌వర్క్ గురించి సరైన, పూర్తి సమాచారం బయటకు రాదని వారు అభిప్రాయపడ్డారు. అందుకే, వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బృందాలు, హైదరాబాద్, రాజస్థాన్‌కు ప్రత్యేక టీమ్‌లను పంపించాయి. ఈ టీమ్‌లు ఫర్దర్ అరెస్ట్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, తద్వారా ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్ వెనుక ఉన్న పూర్తిస్థాయి సూత్రధారులను పట్టుకోగలమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా మీడియాతో మాట్లాడిన కాకినాడ ఎస్పీ బింధు మాధవ్ స్మగ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గంజాయి అక్రమ రవాణా తప్పని ఇలాంటి పనులు చేయొద్దని సూచించారు. పోలీసులు హెచ్చరికలు కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పడేస్తామన్నారు. అలాంటి రైట్ చట్టమే తమకు ఇచ్చిందని పేర్కొన్నారు. అందుకే ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దని వార్నింగ్ ఇచ్చారు.





















