అన్వేషించండి

Black hole Explained in Telugu | బ్లాక్ హోల్ గురించి కంప్లీట్ గా తెలియాలంటే ఈ వీడియో చూసేయండి | ABP Desam

  ఓ యాపిల్ పండు చెట్టు నుంచి రాలితే భూమి మీద ఎందుకు పడుతుంది అని న్యూటన్ కి వచ్చిన ఆలోచన గ్రావిటీకి కారణమైతే.. దమ్ముంటే నా గ్రావిటీ అంతు ఏంటో చూడండి అన్నట్లు సైన్స్ ఇంత డెవలప్ అవుతున్నా ఇప్పటికి మన ఖగోళ శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్నవి బ్లాక్ హోల్స్. తెలుగులో కృష్ణ బిలాలు అని ముద్దుగా పిలుచుకునే ఈ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవటం కొంచెం కష్టమైనా...వన్స్ అది అర్థం చేసుకోవటం మొదలుపెడితే ఆ మజానే వేరు. అందుకే ఈ వారం మన అంతరక్ష కథల్లో బ్లాక్ హోల్స్ గురించి సింపుల్ గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం.

మనకు అందరికీ నక్షత్రాలు ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ కనిపిస్తాయి కదా. అలా కనిపించటానికి కారణంగా వాటిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్. హైడ్రోజన్ ఏటమ్స్ అన్నీ న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి హీలియంగా మారుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో చాలా శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది. అదే నక్షత్రాలు మిణుకు మిణుకు మంటూ మెరవటానికి కారణం. ఉదాహరణకు మన సూర్యుడు ఓ నక్షత్రం కదా. సూర్యుడు నిరంతం ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ తో మండిపోతూ తన శక్తిని మన సౌర కుటుంబం అంతా ప్రసరింప చేస్తూ ఉంటాడు. ఆ శక్తిని మనం సూర్యకిరణాల రూపంలో ఎండగా ఫీల్ అవుతున్నాం అదే. ఆ ఎనర్జీనే అదే. సరే ఇప్పుడు దీనికి బ్లాక్ హోల్ తో సంబంధం ఏంటీ...మన సూర్యుడు కాదు కానీ సూర్యుడి కంటే 200-300మిలియన్ రెట్లు పెద్దవైన నక్షత్రాలు మన విశ్వంలో ఉంటాయి. అవి కూడా సూర్యుడిలా నిత్యం మండుతూ ఉంటాయి. ఎప్పడైతే వాటిలో ఉన్న ఇంధనం మొత్తం అయిపోతుందో...అప్పుడు ఆ నక్షత్రాలు వాటిలో అవే కుప్పకూలిపోతాయి. అంటే ఆ నక్షత్రానికి ఉండే గురుత్వాకర్షణ శక్తి అత్యంత బలంగా పని చేస్తూ ఆ నక్షత్రం తనకు తను బలి తీసుకునేలా చేసుకుంటుంది అన్నమాట. ఆ తర్వాత అది కనీసం కంటికి కూడా కనిపించదు. దాన్నే బ్లాక్ హోల్ అంటారు. తెలుగులో కృష్ణబిలం.

మరి అదేంటీ అక్కడేం కనిపించకపోతే అక్కడ బ్లాక్ హోల్ ఏర్పడింది అని నీకెలా తెలుసు అంటే...రెండు రకాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి కనీసం కాంతి కూడా ఆ బ్లాక్ హోల్ గుండా ప్రయాణించలేదు. ఆ చనిపోయిన నక్షత్రపు బలమైన గ్రావిటీ ఫీల్డ్ ఇంకా పని చేస్తూనే ఉంటుంది. అందుకే లైట్ బ్లాక్ హోల్ దగ్గర ఇదుగో ఇరువైపుల నుంచి ఇలా బెండ్ అవుతూ ట్రావెల్ చేయాల్సిందే. ఇలా లైట్ బెండ్ అవ్వటం వల్ల..మనకు అక్కడ బ్లాక్ హోల్ ఉందని అర్థం చేసుకోవచ్చు.  అంతే కాదు ఆ లైట్ బెండ్ అవ్వటం వల్ల కనిపించే లైన్స్ ను ఈవెంట్ హొరైజాన్  అంటారు సైంటిస్టులు..అంటే వన్స్ ఆ ఈవెంట్ హొరైజాన్ ను దాటితే ఇంకే ఉండదు. ఇక వెనక్కి రావటం అనేది లేనట్లే. సో చనిపోయిన అతి భారీ నక్షత్రాలు బ్లాక్ హోల్స్ గా మారతాయి. లైట్ బెండ్ అవ్వటం వల్ల బ్లాక్ హోల్స్ గురించి ఆనవాలు పట్టొచ్చు


ఈ బ్లాక్ హోల్ అంటే కేవలం మన సౌర కుటుంబంలో సూర్యుడు ఉన్నట్లు గెలాక్సీ సెంటర్ లోనే ఉంటుందా అంటే లేదు..ఎక్కడైనా ఉండొచ్చు. కానీ పాలపుంతలోని అతిపెద్ద బ్లాక్ హోల్ మాత్రం అన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తుంది. మీకు ఓ డౌట్ రావచ్చు. కాంతి కూడా దాన్ని నుంచి వెళ్లలేదు అంటున్నావ్...చాలా గ్రావిటీ ఉంటుంది అంటున్నావ్ మరి గెలాక్సీ మొత్తాన్ని బ్లాక్ హోల్ తనలోకి లాగేసుకోదా అని. కోదు. బ్లాక్ హోల్ కి దగ్గరగా ఉన్న నక్షత్రాలపై దాని ప్రభావం ఉంటుంది కానీ...గెలాక్సీలోని మిగిలిన నక్షత్రాలు, గ్రహాలు, డార్క్ మేటర్ అంతా కలిపి గ్రిప్ గ్రావిటీలా ఏర్పడి ఆ గెలాక్సీ మొత్తం కృష్ణ బిలంలోకి జారిపోకుండా గ్రిప్ గ్రావిటీ ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని గెలాక్సీల్లో ఒకటి కాదు రెండు మూడు బ్లాక్ హోల్స్ కూడా ఉంటాయి కానీ అతి పెద్ద మాసివ్ స్టార్ ఏదైతే బ్లాక్ హోల్ గా మారిందో దాని డామినేషనే ఎక్కువ ఉంటుంది. కానీ బ్లాక్ హోల్స్ అసలు గెలాక్సీల్లో కాకుండా నార్మల్ వాయిడ్ స్పేస్ లో కూడా ఉంటాయి. వాటిని రోగ్ బ్లాక్ హోల్స్ అంటారు.

1700వ సంవత్సరంలో జాన్ మిచెల్ అని లాప్లాస్ అని ఇద్దరు శాస్త్రవేత్తలు ఫస్ట్ టైమ్ డార్క్ స్టార్స్ గురించి మాట్లాడారు. 1915లో ఐన్ స్టైన్ జనరల్ రిలేటివిటీ బ్లాక్ హోల్స్ ఉండొచ్చు అని చెబుతుంది. 1960లో జాన్ వీలర్ అనే సైంటిస్టు ఈ డార్క్ స్టార్స్ కి బ్లాక్ హోల్స్ అని పేరు పెట్టారు. 1970లో ఈ బ్లాక్ హోల్స్ కూడా సూర్యుడిలాగా రేడియేషన్ ను రిలీజ్ చేస్తాయని ఫస్ట్ టైమ్ కనిపెట్టారు అందుకే దాన్ని ఇప్పటికీ హాకింగ్ రేడియేషన్ అని పిలుస్తారు. స్టీఫెన్ హాకింగ్ ఈ బ్లాక్ హోల్స్ గురించి చాలా బుక్స్ కూడా రాశారు...చక్రాల కుర్చీలో కూర్చునే కనీసం తన పనులు తాను చేసేందుకు వీలులేని నరాల వ్యాధితో బాధపడుతున్నా కూడా.

ఈ బ్లాక్ హోల్స్ మీద పరిశోధనలు చేయటం మన సైంటిస్టులకు కూడా చాలా కష్టం ఎందుకంటే...బ్లాక్ హోల్ యూనివర్స్ లో వచ్చే కాంతిని బెండ్ చేసేస్తుంది. టైమ్ కూడా బ్లాక్ హోల్ దగ్గర పనిచేయదు. టైమ్ ని కూడా స్ట్రెచ్ చేస్తుంది. మీరు ఇంటర్ స్టెల్లార్ సినిమా చూస్తే ఈ పాయింట్ అర్థం అవుతుంది. హీరో బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చేసరికి భూమి మీద వాళ్ల చిన్న పాప ముసలిది అయిపోయి ఉంటుంది. ఎస్ టైమ్ ని స్ట్రెచ్ చేసేస్తుంది బ్లాక్ హోల్. మనం ఉన్న మన పాలపుంతలో కూడా ఓ బ్లాక్ హోల్ ఉంది. దాని పేరు సజిటేరియస్ A. ఇది మన సూర్యుడి కంటే 40లక్షల రెట్లు పెద్దది. మనం మన పాలపుంత బ్లాక్ హోల్ నుంచి 26వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాం కాబట్టి మన సౌర కుటుంబంపై బ్లాక్ హోల్ గ్రావిటీ ప్రభావం చాలా తక్కువ. 


సరే మరి ఈ బ్లాక్ హోల్స్ పైన 
ఎవరైనా పరిశోధనలు చేస్తున్నారా అంటే...ఎస్ నాసా వాళ్లు చంద్ర, న్యూస్టార్, హబుల్ టెలిస్కోపులతో విశ్వంలో ఉన్న బ్లాక్ హోల్స్ పై పరిశోధనలు చేస్తూ ఉంటుంది. మన ఇస్రో, జపాన్ వాళ్ల జాక్సా సైంటిస్టులు కూడా ఎక్స్ రే అబ్జర్వేషన్స్ తో బ్లాక్ హోల్స్ పరిశోధనల్లో సాయం అందిస్తున్నారు. అందరూ కలిసి  2019లో ఫస్ట్ టైమ్ బ్లాక్ హోల్ ను ఫోటో తీయగలిగారు. చూడండి ఇదిగో ఇలా ఉంది రియల్ బ్లాక్ హోల్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget