Karthika Deepam 27 December Today Episode 1233: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్ 27 సోమవారం 1233 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో సోమవారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోందంటే...
కార్తీకదీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్
సౌందర్య ఇంట్లో ఎపిసోడ్ మొదలైంది. పొద్దున్నే సౌందర్యకి కాల్ చేసిన భారతి.. మోనిత క్లీనిక్ అమ్మేసింది, ఊరొదిలి వెళ్లిపోయిందని చెబుతుంది. ‘ఏం మాట్లాడుతున్నావ్ భారతి? మోనిత క్లినిక్ అమ్మి వెళ్లిపోవడం ఏంటీ? తను మా ఇంట్లోనే ఉంది’ అంటుంది కంగారుగా.. ఫోన్ పెట్టేసి.. ‘శ్రావ్యా మోనిత ఇంట్లోనే ఉంది కదా?’ అంటే.. లేదత్తయ్యా అంటుంది శ్రావ్య. మోనిత ఊరొదిలి వెళ్లిపోతోందంటే కార్తీక్ ఎక్కడుతున్నాడో తెలిసిందా అనే ఆలోచనలో పడుతుంది సౌందర్య .
Also Read: ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
ఇక కార్తీక్ దీపతో నేనూ ఏదొక పని చేస్తాను దీపా.. నీ పిండివంటకాలను మార్కెటింగ్ చేయనా అంటేవద్దంటుంది దీప. మీరు ఇక్కడ ప్రజావైద్యశాల పెట్టాలంటుంది దీప. సేమ్ టైమ్ కి అక్కడ మోనిత బస్తీలో ప్రజావైద్యశాల అనే బోర్డు పెట్టిస్తుంది. ‘నా కార్తీక్ ఆశీస్సులతో.. వంటలక్క ప్రజావైద్యశాల.. డా.మోనిత కార్తీక్’ అని రాసిన బోర్డ్‌ని చూసిన వారణాసి.. ఇవన్నీ చూస్తూ ఎందుకు ఊరుకోవాలి పీకి పారేద్దాం అంటాడు. వెంటనే లక్ష్మణ్ వారణాసిని ఆపి మనం ఏం చెయ్యలేం.. ఈ ఇంటిని ( గతంలో దీప ఉన్న ఇల్లు) మోనిత కొనేసింది అంటాడు. నాది జాలి గుండె.. నాకు మానవత్వం, వగైరా ఎక్కువంటారు. దీప లేదు, నా కార్తీక్ లేడు..పాపం ఎక్కడికి వెళ్లారో తెలియదు, మీరంతా వాళ్లు లేకుండా దిక్కులేనివారు అవుతారని నేనొచ్చాను, నేనున్నానని డైలాగ్స్ వేస్తుంది. అందరం కలసి వాళ్లని వెతుకుందా అంటుంది.
Also Read: కార్తీక్, దీపకు మరోసారి షాక్ ఇచ్చిన రుద్రాణి, మోనిత కొడుకుని వెతికే పనిలో పడిన సౌందర్య, కార్తీకదీపం డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్
మరోవైపు సౌందర్య... ఆదిత్యతో మాట్లాడుతుంది. అన్నయ్య వాళ్లు లేకుండా ఎలా ఉంటున్నాం అనుకుంటారు. మోనిత ఇంట్లోంచి వెళ్లిపోయిందంటే పీడ పోయినట్టే అనుకుంటారు. మరోవైపు మోనితకి కార్తీక్ ఎక్కడున్నాడు తెలిసి వెళ్లి ఉంటుందంటావా అంటుంది సౌందర్య. కార్తీక్ ఆచూకీ తెలిసి ఉంటే అక్కడికి వెళ్లి వాళ్లని ఇబ్బంది పెడుతుందేమోనని నాకు భయంగా ఉందంటుంది సౌందర్య. ఇంతలో అక్కడకు వచ్చిన రత్నసీత.. మోనిత బస్తీకి షిప్ట్ అయిన విషయం చెబుతుంది. అక్కడ ఇల్లు కొనుక్కుని మోనితకార్తీక్ ప్రజావైద్యశాల అని ఆసుపత్రి ప్రారంభించిందని చెబుతుంది. కట్ చేస్తే..బస్తీలో మోనిత ఎంత మాట్లాడినా అక్కడి జనం పట్టించుకోకుండా వెళ్లిపోతారు. ఇంతలో బ్యాగ్ పట్టుకుని ఒక అమ్మాయి వస్తుంది. నమస్తే అమ్మా... అరుంధతి మేడం పంపించారంటుంది. నా పేరు నరసమ్మ అనడంతో వృత్తికి తగ్గా పేరు అని సమాధానం చెబుతుంది. ప్రియమణి అని ఓ ఓవర్ యాక్షన్ పని మనిషి ఉండేది.. తను వాళ్ల ఊరు తాడికొండ గ్రామానికి వెళ్లిందని చెబుతుంది. ( ఆ ఊరిలోనే కార్తీక్-దీప ఉన్న విషయం బ్యాంగ్రౌండ్ లో చూపిస్తారు)
Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..
బాబుకి పేరు పెట్టబోతున్నాం.. రేపే పంతుల్ని రమ్మన్నాం అని కోటేష్, శ్రీవల్లి చెప్పగానే..బాబుని నేనుచూసుకుంటా మీరు వెళ్లండని చెబుతాడు కార్తీక్. అదేంటో నేను ఎత్తుకుంటే వీడు అస్సలు ఏడవడు అని అనుకుంటాడు. మరోవైపు బస్తీలో ప్రజావైద్యశాల ఏర్పాటు చేశా అందుకే స్వీట్స్ చేయించా అంటూ ముందుగా అత్తయ్య, మావయ్యలకి స్వీట్స్ ఇవ్వు అని నరసమ్మతో చెబుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన ఆదిత్య, శ్రావ్యకి స్వీట్స్ ఇమ్మంటుంది. వాళ్లు తీసుకోపోవడంతో నేను చెప్పిన శుభవార్తతోనే కడుపు నిండిపోయిందేమో అంటూ స్వీట్స్ తిని ఎంజాయ్ చేస్తుంది మోనిత. ఎక్కువ చేయకు మోనిత..నోర్ముయ్ అంటుంది సౌందర్య. నేను కొంచెం ఎక్కువే చేస్తానని మీకు తెలుసు కదా అంటూ..ప్రేమ గురించి గొప్పగా చెబుతుంది. వంటలక్క-కార్తీక్ అని బోర్డుపై పెట్టడంతో నా పుణ్యంలో వాటా వాళ్లకి కూడా వెళుతుందంటుంది.
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
మోనితకి సౌందర్య క్లాస్
పెళ్లైన వాడిని ప్రేమించడం నువు చేసిన మొదటి తప్పు
దంపతులను విడదీయడం రెండో తప్పు
మా కుటుంబంలో కలతలు సృష్టించి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశావ్ ఇది మూడో తప్పు
స్త్రీ జాతిలో ఆణిముత్యంలానీకు నువ్వు ఫీలవకు... ఆడవాళ్లు సిగ్గుపడే పనులే చేస్తున్నావ్. బస్తీకి వెళ్లి ప్రజావైద్యశాల పెడితే నీకు బ్రహ్మరథం పడతారనుకుంటున్నావా. దీప-కార్తీక్ వాళ్లకి దైవంతో సమానం. నువ్వు ఆ బస్తీలో ఎన్ని పిచ్చి వేషాలు వేసినా.. అక్కడ నా కోడలు దీప సంపాదించిన అభిమాన్ని పొందలేవు. వైద్యం అంటే అపురూపమైన సేవ..దాన్ని ప్రేమతో చేయాలి .. వృత్తికి కూడా అన్యాయం చేయొద్దు మోనిత అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎప్పటిలానే సిగ్గులేకుండా దులిపేసుకున్న మోనిత..బుర్ర గిర్రున తిరిగిపోయిందంటూ గులాబ్ జాం తింటుంది.
Also Read: వసు విషయంలో రిషికి క్లారిటీ ఇచ్చిన జగతి.. గౌతమ్ ప్రేమకి అడ్డుతగులుతున్న ఈగో మాస్టర్, గుప్పెడంత మనసు డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
బాబు బారసాలకి వంటలు చేస్తానని దీప... నేను పిల్లలు డెకరేషన్ చేస్తామని కార్తీక్ అంటాడు. మీరెంత మంచోళ్లు సార్ అంటారు శ్రీవల్లి-కోటేష్... ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.
మంగళవారం ఎపిసోడ్
నీ బిడ్డని మేం దొంగిలించామా, నీపై పగసాధించాలని అనుకున్నామా... ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అంటుంది సౌందర్య. కోటేష్ బిడ్డని కార్లోంచి ఎత్తుకెళ్లిన వీడియో చూపిస్తుంది సౌందర్య. కట్ చేస్తే దీప ఇంట్లో అంతా బారసాల ఏర్పాట్లలో ఉంటారు.
Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..
Also Read : బుద్ధి చూపించిన మోనిత, బాధపడిన డాక్టర్ బాబు.. కార్తీకదీపం డిసెంబరు 23 గురువారం ఎపిసోడ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి