Karthika Deepam: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్ 28 మంగళవారం 1234 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్

బాబు నామకరణానికి సంబంధించి పంతులుగారిని రేపు పిలుస్తున్నా అంటుంది శ్రీవల్లి. ఇంట్లో వంటపని మొత్తం నేను చూసుకుంటా అని దీప... డెకరేషన్ పనులు నేను చూసుకుంటా అని కార్తీ అనడంతో.. కోటేష్-శ్రీవల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అక్కా మనం పిలిచినా ఈ ఫంక్షన్ కి చుట్టుపక్కల ఎవ్వరూ రారు కదా అంటుంది. రుద్రాణితో గొడవ పడ్డాక మన ఇంటికి ఎవ్వరూ రారు.. రుద్రాణిని ఎదిరిస్తే ఊరంతా ఎదురుతిరిగేలా చేస్తుందని బాధపడుతుంది. ఎవరూ రాకపోయినా మేం ఉన్నాం  కదా అంటారు దీప-కార్తీక్. ఇంతలో ఆదిత్యను తలుచుకుంటాడు కార్తీక్. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇలా ఆలోచిస్తున్నారంటే వీళ్లు గొప్పోళ్లు.. దేవుడా వీళ్లని చల్లగా చూడు అనుకుంటాడు కోటేష్...

Also Read: వసుధారతో గౌతమ్ మాట్లాడుతుంటే భరించలేకపోతున్న రిషి, గుప్పెడంతమనసు డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
కట్ చేస్తే మోనిత ఇంట్లో నరసమ్మ ఇచ్చిన జ్యూస్ తాగుతుంటుంది.  ‘అమ్మా అయ్యగారు కనిపించడం లేదేంటమ్మా..’అంటుంది.  సినిమా మొత్తం చూసి హీరో-హీరోయిన్ కి ఏమవుతుందని అడిగినట్టుంది అంటుంది మోనిత.  నా కార్తీక్ బాబు కనిపించడం లేదు, నా కొడుకును ఎవరో ఎత్తుకెళ్లారు వాడిని వెతుక్కోవాలి, మొగుడూ లేడు-కొడుకు లేడు ఉన్నదల్లా గుండెనిండా ప్రేమ మాత్రమే అంటుంది మోనిత. ఒంటరిగా ఉండటం నరకమే కానీ నా కార్తీక్ ని తలుచుకుంటే నాకు ఏ బాధా ఉండదంటుంది. ఆ ఇంట్లో సౌందర్య గారు పెళ్లైన వాడిని ప్రేమించావ్ అన్నారని నరసమ్మ అనగానే.... చేతిలో గ్లాస్ విసిరేసి నరసమ్మకి క్లాస్ పీకుతుంది మోనిత. ‘చెప్పింది అర్థం కాలేదా.. అయిన నేను పెళ్లి అయిన వాడ్ని ప్రేమించలేదు, 18 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను, కార్తీక్ నన్ను పెళ్లిచేసుకోలేదు.   కార్తీక్కే నన్ను పెళ్లి చేసుకోలేదు.. కొడుకు లేడు. ప్రేమించినవాడూ లేడు.. ప్రేమ మాత్రమే ఉంది’ అంటుంది అరుస్తూ.. ‘అది చాలమ్మా ప్రేమ చాలు.. వాటన్నింటిని అదే లాక్కొస్తుంది’అంటుంది. ఇదివరకు ప్రియమణి అని ఓ జాతిరత్నం నా దగ్గర పని చేసేది.. అది ఎందుకు పని మానేసిందో తెలుసా? నీలానే అడ్డమైన ప్రశ్నలు వేసేది..వద్దన్నా వినలేదు..తన పనైపోయింది..వాళ్లూరు తాడికొండ వెళ్లిపోయింది. నీ ఉద్యోగం కొండెక్కకుండా ఉండాలంటే ప్రశ్నలు వేయడం మానేయాలని చెబుతుంది. 

Also Read:  కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
బాబుకి నామకరణం చేస్తున్నారని తెలుసుకున్న రుద్రాణి..ఏదో ఒక పేరు పెట్టాలికదా అందుకే నామకరణం చేస్తున్నారు చేసుకోనీ అంటుంది. నువ్వేమీ పట్టించుకోవా అంటాడు.. నీకు తెలుసు కదా చిన్నపిల్లలంటే నాకెంత ఇష్టమో.. పిల్లలు దేవుడితో సమానం కదా కానీ దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు..కుదిరితే నా తరపున కానుక పంపిద్దాం అంటుంది రుద్రాణి. కట్ చేస్తే  సౌందర్య ఇంటికి వచ్చిన రత్నసీత ఓ శుభవార్తతో వచ్చానంటుంది. మీరు చెప్పినట్టే మోనితని నేను ఫాలో అయ్యానని చెప్పిన రత్నసీత.. బాబు మిస్సైన ఏరియాలో ఎంక్వైరీ  చేశానంటూ సీసీ టీవీ ఫుటేజ్ వీడియో చూపిస్తుంది. 

Also Read: ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
బాబు నామకరణం ఏర్పాట్లు జరుగుతుంటాయి. బయట పిల్లలు ఆడుకుంటూ కిందపడతారు. రాయి గుచ్చుకుంది అంటుంది శౌర్య. చెప్పులేసుకుని ఆడుకోవాలి అని కార్తీక్ అంటే.. చెప్పులు తెగిపోయాయి కదా అంటుంది శౌర్య. ఆ మాటలు విని కార్తీక్ బాధపడతాడు. పాపని అత్తమ్మ అంటోంది..సార్ ఏమో రౌడీ అంటున్నారని శ్రీవల్లి-కోటేష్ మాట్లాడుకుంటారు. చిన్న రాయికే భయపడుతున్నావా అన్న దీప..పిల్లలిద్దరికీ చెప్పుకు కొంటానంటుంది. 

Also Read:  కార్తీక్, దీపకు మరోసారి షాక్ ఇచ్చిన రుద్రాణి, మోనిత కొడుకుని వెతికే పనిలో పడిన సౌందర్య, కార్తీకదీపం డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్
మోనితకి సౌందర్య క్లాస్
ఏంటి మోనిత మాట్లాడవేంటి అంటుంది సౌందర్య. నీ బిడ్డని మేం దొంగిలించామా...నీపై పగసాధించడానికి నా కొడుకు నీ బిడ్డని ఎత్తుకెళ్లాడా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, మాతృత్వం అందమైన బాధ్యత, కానీ దాన్ని నీ స్వార్థానికి వాడుకున్నావ్ మోనిత, పుట్టిన బిడ్డని సైతం అడ్డం పెట్టుకుని మమ్మల్ని సాధించాలని చూస్తున్నావ్, నీ మెళ్లో నువ్వే తాళి కట్టుకున్నావ్, నీ అంతట నువ్వే కార్తీక్ ని భర్తగా ఊహించుకున్నావ్, అబద్ధాలతో అన్నిసార్లూ గెలవలేవు మోనిత అని సౌందర్య పెద్ద క్లాస్ వేస్తుంది. నిల్చోబెట్టి మాట్లాడుతున్నావేంటి బయటకు గెంటేయ్ అంటాడు ఆదిత్య. మోనిత రియాక్టయ్యేలోగా స్పందించిన సౌందర్య..నీ కొడుకుని ఎవరో ఎత్తుకెళ్లారన్నావ్ కదా.. పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవాలి... రోడ్డు పక్కన కార్లో వదిలేసి వెళితే బాధ్యత అనిపించుకుంటుందా అంటూ నువ్వు చేసిన తప్పేంటో నీకే తెలుస్తుందని వీడియో చూపిస్తుంది సౌందర్య. షాక్ తిన్న మోనిత సైలెంట్ గా ఉండిపోతుంది. ఏం మాట పడిపోయిందా మోనిత..ఇప్పుడు మాట్లాడవేంటని క్వశ్చన్ చేస్తుంది సౌందర్య. నువ్వొచ్చిన మొదటి రోజే నిన్ను ఇంట్లోంచి గెంటేసేదాన్ని కానీ నీ వంకర బుద్ధి నాకు తెలుసుకదా..వీధిలోకి వెళ్లి రచ్చ చేస్తావ్..సానుభూతి కోసం ట్రై చేస్తావ్ అందుకే ఆగా... నిజం ఏంటో నిరూపించాకే నిన్ను బయటకు గెంటేద్దాం అని ఆగాఅంటుంది. వెళతావా..గెంటేయమంటావా..ఇంకోసారి ఈ గడప తొక్కాలని ప్రయత్నించకు అని అని గట్టిగానే ఇస్తుంది సౌందర్య.  ఎపిసోడ్ ముగిసింది...

రేపటి ఎపిసోడ్ లో
బాబుకి నామకరణం జరుగుతుంది. ఇంతకీ బాబు పేరు ఏం పెట్టాలని నిర్ణయించారని పంతులు అడిగితే.. రంగరాజు అంటూ రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది. మీరు ఎక్కువ చేస్తున్నారు బిడ్డని ఇచ్చేయండి అంటుంది దీప. అడుగు ముందుకేస్తే నువ్వు-మీ ఆయన-నీ పిల్లలు అన్యాయమైపోతారంటుంది రుద్రాణి. రేపటి ఎపిసోడ్ లో పెద్ద రచ్చే జరిగేలా ఉంది...

Also Read: రిషి మనసులో ఏముంది.. వసుని ఎందుకు హాస్టల్ కి పంపించేయమన్నాడు, గుప్పెడంత మనసు డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్...
Also Read: మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
Also Read:  వసు విషయంలో రిషికి క్లారిటీ ఇచ్చిన జగతి.. గౌతమ్ ప్రేమకి అడ్డుతగులుతున్న ఈగో మాస్టర్, గుప్పెడంత మనసు డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Dec 2021 09:06 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam Written Update Future story of Karthika Deepam Written UpdateKarthika Deepam 28th December 2021 28th December 2021 KARTHIKA DEEPAM

సంబంధిత కథనాలు

Mega154: చిరు సినిమా నుంచి మాస్ హీరో తప్పుకున్నాడా?

Mega154: చిరు సినిమా నుంచి మాస్ హీరో తప్పుకున్నాడా?

Kangana Ranaut: మా నిర్మాత ఆఫీసు అమ్ముకోలేదు - బాలీవుడ్ మీడియాపై కంగనా రనౌత్ ఫైర్

Kangana Ranaut: మా నిర్మాత ఆఫీసు అమ్ముకోలేదు - బాలీవుడ్ మీడియాపై కంగనా రనౌత్ ఫైర్

Prabhas: ప్రభాస్ 'రాధేశ్యామ్' - టీవీలోనూ వర్కవుట్ కాలేదే!

Prabhas: ప్రభాస్ 'రాధేశ్యామ్' - టీవీలోనూ వర్కవుట్ కాలేదే!

Ennenno Janmala Bandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి

Ennenno Janmala Bandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి

Ram Charan: క‌మెడియ‌న్‌ను తనతో పాటు ఓన్ ఫ్లైట్‌లో హైదరాబాద్ తీసుకొచ్చిన రామ్ చరణ్

Ram Charan: క‌మెడియ‌న్‌ను తనతో పాటు ఓన్ ఫ్లైట్‌లో హైదరాబాద్ తీసుకొచ్చిన రామ్ చరణ్

టాప్ స్టోరీస్

Auto Insurance new Rules: వాహన బీమా రూల్స్‌ ఛేంజ్‌! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!

Auto Insurance new Rules: వాహన బీమా రూల్స్‌ ఛేంజ్‌! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!

Raghurama Letter : సీఎం జగన్‌ నుంచి ప్రాణహానీ - ఎంపీలు అందరికీ లేఖలు రాసిన రఘురామ !

Raghurama Letter :  సీఎం జగన్‌ నుంచి ప్రాణహానీ - ఎంపీలు అందరికీ లేఖలు రాసిన రఘురామ !

Maayon Telugu Movie Review - 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Maayon Telugu Movie Review - 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Redmi K50i: రెడ్‌మీ కే50ఐ వచ్చేది ఆరోజే - అధికారికంగా ప్రకటించిన కంపెనీ!

Redmi K50i: రెడ్‌మీ కే50ఐ వచ్చేది ఆరోజే - అధికారికంగా ప్రకటించిన కంపెనీ!