Guppedantha Manasu డిసెంబర్ 31 ఎపిసోడ్: వసుపై ప్రేమతో ప్లేట్ ఫిరాయించిన రిషి, మహేంద్ర క్లాస్-జగతి షాక్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్

వసుని ఇంట్లోంచి పంపించేయమని జగతికి చెప్పిన ఈగోమాస్టర్ రిషి..మాట మార్చి పెద్ద షాకిచ్చాడు. ఎట్టకేలకు ఆమెను వెళ్లకుండా ఆపాడు. గుప్పెడంత మనసు డిసెంబరు 31 శుక్రవారం ఎపిసోడ్ లో ఏ జరిగిందంటే..

FOLLOW US: 

గుప్పెడంత మనసు డిసెంబరు 31 శుక్రవారం ఎపిసోడ్

వసు-జగతి-మహేంద్ర

ఎట్టకేలకు రిషి మాట మేరకు వసు ఇంట్లోంచి వెళ్లేపోయేందుకు సిద్ధం చేసింది జగతి. లగేజ్ సర్దుకుని వెళ్లిపోతూ మేడం దగ్గర కాసేపు నిల్చుని బయటకు వెళ్లిపోతుంటుంది వసుధార. ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర షాక్ అవుతాడు. ఏంటిది..ఎక్కడికి వెళుతున్నావ్.. జగతి ఏంటిది అని క్వశ్చన్ చేస్తాడు. వెళ్లిపోతోంది మహేంద్ర అని సమాధానం చెబుతుంది జగతి. ఎక్కడికి అని అడిగితే ఇంట్లోంచి వెళ్లిపోతోందని అంటుంది. తనెక్కడికి వెళుతుంది-ఎక్కడ ఉంటుంది అంటే.. తను చిన్న పిల్ల కాదు-ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అన్నీతెలుసని చెబుతుంది. తనని ఇలా పంపించేయడం కరెక్టేనా అన్న మహేంద్రతో..ఒక విషయం అందరకీ కరెక్ట్ అనిపించాలని లేదు మహేంద్ర.. వ్యక్తులు-పరిస్థితుల్ని బట్టి మారుతుందని రిప్లై ఇస్తుంది. వసు ఎక్కడికి వెళ్లిపోతున్నావ్ అని అడిగితే నేను ఎవరికీ భారం కాకూడదని వెళుతున్నా అనగానే..భారం ఏంటి చెట్టుకి కాయ భారం అవుతుందా అంటే.. కొన్నాళ్లకి కాయ కూడా చెట్టునుంచి విడిపోక తప్పదు  సార్ అంటుంది వసు. జగతి మాట్లాడవేంటి అని మహేంద్ర రెట్టించినా మౌనమే సమాధానం అయింది. 

Also Read: రెండు క్యారెక్టర్లు ఔట్..కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్..
ఎక్కడికి వెళతావ్ అంటే.. ఎక్కడో చోట నాకు ప్లేస్ దొరుకుతుంది.. నా జీవితం లక్ష్యాలను మరిచిపోను, వాటిని సాధించుకుని తీరుతా అన్న వసుతో.... నీకు సౌకర్యాలు ఉండాలి కదా అంటాడు.  కడుపు నిండితే భోజనం, కన్ను మూస్తే నిద్ర... ఎదురీదితే జీవితం అవుతుందని చెబుతుంది. మీరిద్దరూ గొడవ పడే అవకాశమే లేదన్న మహేంద్ర..నీ ప్రవర్తనలో ఏదో మార్పొచ్చింది, నువ్వు నువ్వులా లేవు, నీలో నువ్వు కాని ఓ కొత్త జగతి కనిపిస్తోందని రెట్టించి అడుగుతాడు. తనని ఎందుకు వెళ్లమంటున్నావ్ అని అడిగితే.. వెళతా అంది ఆపలేదు..ఎవరి జీవితం వాళ్లిష్టం అంటుంది. ఇది నువ్వు కాదు..అలా అనుకోవు అని మహేంద్ర.. ఇప్పుడు అనుకోవడం మొదలు పెట్టా అని జగతి అంటుంది. ఎవరైనా బెదిరించారా అని అడిగితే..ఎవరో బెదిరిస్తే భయపడతానా అని స్థిరంగా సమాధానం చెబుతుంది. వసు కనీసం ఏమైందో నువ్వైనా చెప్పు అంటూనే.. జగతి మాట్లాడు అని ఫైర్ అవుతాడు. స్పందించిన జగతి..మహేంద్ర నీకో విషయం అర్థం కావడం లేదు, వసుధార జీవితం తనిష్టం, ఎక్కడికైనా వెళుతుంది, ఎక్కడైనా ఉంటుంది, వసుధార స్వతంత్రురాలు, తను ఎక్కడైనా ఉండేహక్కు ఉంటుంది, తనతో మనకేం సంబంధం మహేంద్ర అంటుంది. 

Also Read:  వసు పయనం ఎటువైపు, రిషి-జగతి ఏం చేయబోతున్నారు.. గుప్పెండత మనసు డిసెంబరు 30 గురువారం ఎపిసోడ్
రిషి ఎంట్రీ
అక్కడకు ఎంట్రీ రిషి ... ఏంటి మేడం మీకెలాంటి సంబంధం లేదా.. అంత ఈజీగా సంబంధం లేదని ఎలా అంటారని మాట్లాడి షాకిస్తాడు. ఏ సంబంధం లేకపోతే ఎక్కడో చదివే వసుధారని డీబీఎస్టీ కాలేజీకి ఎందుకు తీసుకొచ్చారు, ఏం సంబంధం లేకపోతే తనకోసం చాలాసార్లు నాతో ఎందుకు గొడవపడ్డారు, గురు-శిష్యుల సంబంధం కన్నా గొప్పది ఏముంది మేడం, మీకు తనపై బాధ్యత ఒకటుండాలి కదా, ఓ కాలేజ్ టాపర్ ని చదువు మధ్యలో ఇలా గాలికి వదిలేస్తే తను ఏమైపోతుందో ఆలోచించారా...అయినా మధ్యలో వదిలేయడం మీకు అలవాటే కదా అని రూట్ మారుస్తాడు. ఒకవేళ వసుధార వెళ్తాను అన్నా కూడా మీరు ఆపాలి కదా, ఎటుపోతే నాకేంటి అనుకుంటున్నారా ( షాక్ అయిన జగతి.. ఏంటి రిషి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది). ఏంటి డాడ్ మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, తను వెళ్లిపోతానంటే చేతిలో బ్యాగ్ లాక్కుని విసరాలి కదా అనేసి..వసు నువ్వు ఎక్కడికీ వెళ్లడం లేదు ఇక్కడే ఉంటున్నావ్ అంటాడు ( ఈ మాట విని జగతి ఆనందంతో ఉప్పొంగిపోతుంది). ఎవరు ఏమన్నా నువ్వు ఇక్కడే ఉండాలని స్ట్రాంగ్ గా చెబుతాడు. ఇది మీ మేడంగారి తరపున నా మాట అని చెబుతాడు. వసు ఇంకా ఆలోచిస్తూనే ఉండగా.. లోపలకు వెళ్లు అని చెప్పేసి బయటకు వెళ్లిపోతాడు రిషి. వసు చేతిలో బ్యాగ్ తీసుకుని లోపల పెడుతుంది జగతి. మహేంద్ర-వసుధారకి ఏమీ అర్థం కాక అలాగే ఆగిపోతారు. 

Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
రిషి తనలో తాను అనుకుంటాడు
రోడ్డు పక్కన కారు ఆపిన రిషి..తన మాటలు గుర్తుచేసుకుంటాడు. నేనే వసుధారని హాస్టల్ కి పంపించమన్నాను-మళ్లీ నేనే వద్దన్నాను జగతి మేడం మనసులో ఏమనుకుంటున్నారో అనుకుంటాడు. జగతి దగ్గర వసు ఉంటే ఆమె ప్రభావం ఉంటుందన్న భయం ఉంది..కానీ.. వసు ఏదైనా తీసుకోకూడని నిర్ణయం తీసుకుని ఉంటే నేనే బాధపడాల్సి వచ్చేది. ఈ విషయం గురించి జగతి మేడం వసు-మహేంద్ర కి చెప్పొచ్చు -చెప్పకపోవచ్చు..వసు విషయంలో నేను తీసుకున్న రెండు నిర్ణయాలు కరెక్టే. ఇప్పుడు నిజం చెప్పలేను-అబద్ధం చెప్పలేను, ఆమె విషయంలో ఇంకేమైనా ఆలోచించాలి.. కానీ జగతి-వసు ఇద్దరూ శరీరం-ఆత్మలా కలసిపోయారు.. వాళ్లని కలసి చూడలేను, విడదీసి వసుని బాధించలేను..ఏదో చేయాలి అనుకుంటాడు. 

జగతి-మహేంద్ర బయట నిల్చుని ఉండగా వసుధార కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇది నీ ఆలోచన కాదు..నీ వెనుక ఎవరున్నారు అని అడిగి.. రిషి ఏమైనా చెప్పాడా, అసలు రిషి ఎందుకొచ్చాడు, నువ్వు ఇలా ఆలోచించవు, వసుధారని వెళ్లమని చెప్పవు, వెళ్తా అన్నా వెళ్లనివ్వవు.. ఇలా ఎందుకు చేశావ్, దీని వెనుక రిషి ఉన్నాడా అని జగతిని వరుసప్రశ్నలు వేస్తాడు..ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

Also Read: వసుధారతో గౌతమ్ మాట్లాడుతుంటే భరించలేకపోతున్న రిషి, గుప్పెడంతమనసు డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
Also Read: కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: పగతీర్చుకున్న రుద్రాణి, షాక్ లో కార్తీక్ -దీప .. కార్తీకదీపం డిసెంబరు 30 గురువారం ఎపిసోడ్

Published at : 31 Dec 2021 08:57 AM (IST) Tags: Raksha Gowda Mukesh Gowda గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు Sai Kiran Guppedantha Manasu December 31 Episode serial

సంబంధిత కథనాలు

Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్‌పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్

Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్‌పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్

Kalyaan Dhev: కూతురి బర్త్ డే, విష్ చేయని కళ్యాణ్ దేవ్ - తెరపైకి మరోసారి శ్రీజ విడాకుల వ్యవహారం!

Kalyaan Dhev: కూతురి బర్త్ డే, విష్ చేయని కళ్యాణ్ దేవ్ - తెరపైకి మరోసారి శ్రీజ విడాకుల వ్యవహారం!

Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!

Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!

Regina Cassandra: 2019లో కులు మనాలి రూమ్‌లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా

Regina Cassandra: 2019లో కులు మనాలి రూమ్‌లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా

Vijay Sethupathi: రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో విజయ్ సేతుపతి - పాన్ ఇండియా లెవెల్లో!

Vijay Sethupathi: రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో విజయ్ సేతుపతి - పాన్ ఇండియా లెవెల్లో!

టాప్ స్టోరీస్

IND vs ENG, 5th Test: ఓటమికి తోడు టీమ్‌ఇండియాకు మరో షాక్‌! WTC ఫైనల్‌ అర్హతకు ప్రమాదం!

IND vs ENG, 5th Test: ఓటమికి తోడు టీమ్‌ఇండియాకు మరో షాక్‌! WTC ఫైనల్‌ అర్హతకు ప్రమాదం!

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం

జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం

KCR BRS Postpone : కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పుడే కాదా ? మూడో సారి గెలవడమే ప్రస్తుత లక్ష్యమా ?

KCR BRS Postpone :   కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పుడే కాదా ? మూడో సారి గెలవడమే ప్రస్తుత లక్ష్యమా ?