అన్వేషించండి

Karthika Deepam: పగతీర్చుకున్న రుద్రాణి, షాక్ లో కార్తీక్ -దీప .. కార్తీకదీపం డిసెంబరు 30 గురువారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్ 30 గురువారం 1236 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం డిసెంబరు 30 గురువారం ఎపిసోడ్..

తమ బిడ్డని రుద్రాణి తీసుకెళ్లిపోయిందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు కోటేష్-శ్రీవల్లి. ఈ విషయంపై బాధపడిన కార్తీక్ వాళ్లకి సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. బుధవారం ఎపిసోడ్ ఇక్కడ ముగిసింది. ఇక డిసెంబరు 30 గురువారం ఎపిసోడ్ కూడా కార్తీక్-దీప మాటలతోనే ప్రారంభమైంది. అయిపోయిన దానిగురించి ఆలోచిస్తే ఏమొస్తుందని దీప అంటుంది. రుద్రాణి బెదిరింపులు గుర్తుచేసుకున్న కార్తీక్.. కోటేశ్-శ్రీవల్లికి అండగా ఉంటానంటాడు. దీప వద్దని అడ్డుపడుతుంది. సాయం చేసే విషయంలో నాకన్నా నువ్వే ముందుంటావు..నాకేమైనా అవుతుందేమో అనే భయంతో వద్దన్నావు కదా అంటాడు. మీరు వెళితే పిల్లలు-నేను భయంగా ఎదురుచూడాలని దీప.. గొడవల్లో జోక్యం చేసుకోవద్దని పిల్లలు చెప్పడంతో సరే అంటాడు కార్తీక్.

Also Read:  కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
రుద్రాణి ఇంట్లో
బాబుని ఒళ్లో కూర్చోబెట్టుకున్న రుద్రాణి బాబుని నిద్రపుచ్చేందుకు తన అనుచరులను పాట పాడమంటుంది. ఇంతలో పోలీసులను తీసుకుని శ్రీవల్లి-కోటేశ్ అక్కడకు వస్తారు. రుద్రాణి ఇంటికే పోలీసులు వస్తారా అని కోపంతో ఊగిపోతుంది.  ఇన్నాళ్లూ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారు కాబట్టి నేను ఏం చేయలేకపోయానంటుంది ఎస్ ఐ. శ్రీవల్లి కంప్లైంట్ ఇస్తే తీసుకోవడమే తప్పు..పైగా నా ఇంట్లో అడుగుపెట్టడం ఇంకా పెద్ద తప్పు అంటే..రుద్రాణి ఆపు అని అరుస్తుంది ఎస్.ఐ.  అక్కా అని పిలువు అనగానే లాగిపెట్టి కొడుతుంది ఎస్ ఐ. నన్ను ఎదిరించి ఈ ఊళ్లో ఉంటాననుకుంటావా అనగానే.. ఇప్పటికే ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది వెళ్లేముందు పాతలెక్కలు సెట్ చేసే వెళతా అంటుంది ఎస్ ఐ. తప్పని పరిస్థితిలో బాబుని శ్రీవల్లికి అప్పగిస్తుంది రుద్రాణి. తప్పు చేస్తున్నావు మాధురి అని ఎస్ ఐని ఉద్దేశించి అనడంతో..తప్పు గురించి నువ్వు మాట్లాడుతున్నావా రుద్రాణి అని ఫైర్ అవుతుంది. బయట తలుపులు వేసి వెళ్లు అని తనదగ్గరున్న కానిస్టేబుల్ కి చెబుతుంది. కాసేపటి తర్వాత డోర్ తీసుకుని బయటకు వచ్చిన రుద్రాణి..నాపైనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పెద్ద తప్పు చేశావ్ అని మనసులో అనుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.

Also Read: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
సౌందర్య ఇంట్లో
కట్ చేస్తే కార్తీక్ ఫోన్ దొరికిన బిచ్చగాడిని కానిస్టేబుల్ రత్నసీత ... సౌందర్య ఇంటికి తీసుకొస్తుంది. కార్తీక్ ఫోన్ అమ్ముతుంటే తీసుకొచ్చా అని రత్నసీత చెబుతుంది. కార్తీక్ ఫోన్ నేను కొట్టేయలేదు నాకు దొరికింది అని చెబుతుంది. ఆ రోజు ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు కార్తీక్ ఓ చోట ఫోన్ పడేసి అక్కడినుంచి బస్సెక్కి వెళ్లిపోయిన విషయం చెబుతాడు బిచ్చగాడు.  ఇదే విషయం డబ్బులు పంపించి ఓ మేడం అడిగింది కదా ఆ విషయం చెప్పాలా వద్దా అనే ఆలోచించేలోగా.. సౌందర్య థ్యాంక్యూ చెప్పి నీకు డబ్బులిస్తాను వాళ్లు ఎక్కిన చోటే బస్సెక్కి ప్రతి స్టాప్ లోనూ దిగి వాళ్లెక్కడున్నారో కనిపెట్టు అని అడుగుతుంది. 

Also Read: ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
దీప-కార్తీక్
తమ్ముడు ఇంకా రాలేదంటమ్మా అని పిల్లలు అడుగుతారు. వస్తారులే కాసేపు మాట్లాడకుండా కూర్చోండని దీప చెబుతుంది. ఇంతలో బాబుని తీసుకుని శ్రీవల్లి-కోటేశ్ రావడం చూసి పిల్లలు పరిగెత్తుకుని వెళ్లిపోతారు. ఏదైనా గొడవ జరిగిందా అని దీప అడిగితే..ఎస్ ఐ వచ్చి రుద్రాణికి గట్టిగా చెప్పి బాబుని ఇప్పించారని చెబుతుంది శ్రీవల్లి. రుద్రాణి పోలీస్ స్టేషన్ కి వెళ్లిందన్నమాటే కానీ వచ్చాక ఏం పగ తీర్చుకుంటుందో అనే భయం ఉందని శ్రీవల్లి చెప్పగానే.. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదంటారు దీప-కార్తీక్. మళ్లీ పంతులుగారికి ఫోన్ చేసి రమ్మను నామకరణం చేద్దాం అంటుంది దీప.

Also Read: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సౌందర్య ...కార్తీక్,పిల్లల్ని తలుచుకుని బాధపడుతుంది. అందరం సరదాగా కూర్చుని భోజనం చేసేవారం ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో అని బాధపడుతుంది.  శ్రావ్య మీ అమ్మానాన్నలకి ఈ విషయం తెలుసా, ఈ మధ్య ఫోన్ చేయడం లేదు ఇంటికి రావడం లేదు ఏమైందని అడుగుతుంది సౌందర్య. ఇలాంటి పరిస్థితి ఊహించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే బావగారు, దీపక్క పిల్లలు వైజాగ్ షిప్ట్ అయ్యారని చెప్పానంటుంది శ్రావ్య. అబద్ధం చెప్పి అయినా అత్తింటి పరువు నిలబెట్టావంటాడు ఆనందరావు.

Also Read: కార్తీక్, దీపకు మరోసారి షాక్ ఇచ్చిన రుద్రాణి, మోనిత కొడుకుని వెతికే పనిలో పడిన సౌందర్య, కార్తీకదీపం డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
వీడు గొప్పోడు స్వామీ... నామకరణానికి అడ్డొచ్చిందని రుద్రాణిని పోలీస్ స్టేషన్ కి పంపించేశాడు అంటుంది దీప. అయితే ఆ రుద్రాణి రాత్రే ఇంటికి వచ్చేసింది దీప , ఊర్లో అంతా అదే మాట్లాడుకుంటున్నారు.. ఆమె పగబడితే మామూలుగా ఉండదు..కోటేష్-శ్రీవల్లికి ప్రమాదం పొంచిఉందని చెబుతాడు కార్తీక్. ఆ మాటలు విని దీప షాక్ అవుతుంది. మరోవైపు బండిపై వెళుతున్న శ్రీవల్లి-కోటేశ్ ను లారీతో గుద్దించేస్తుంది రుద్రాణి

Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: వసుధారతో గౌతమ్ మాట్లాడుతుంటే భరించలేకపోతున్న రిషి, గుప్పెడంతమనసు డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
ICC Champions Trophy: ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
Mahakumbh 2025 : రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన
రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Embed widget