Kanchana Re Relase : మళ్లీ థియేటర్లలోకి హారర్ థ్రిల్లర్ కాంచన - సరికొత్త వెర్షన్‌లో రీ రిలీజ్ ఎప్పుడంటే?
Kanchana Movie : కోలీవుడ్ స్టార్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ మూవీ కాంచన. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ మూవీని ఇప్పుడు రీ రిలీజ్ చేయనున్నారు.

Raghava Lawrence's Kanchana Movie Re Release In 4K Version : కోలీవుడ్ స్టార్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'కాంచన'. ఓ వైపు భయపెడుతూనే... మరోవైపు నవ్వించేశారు లారెన్స్. 2011లో వచ్చిన ఈ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 'తెలిసిపోయిందా... మీకూ తెలిసిపోయిందా...' అంటూ అర్ధనారీశ్వర రోల్‌లో లారెన్స్ చెప్పే డైలాగ్ అప్పట్లో ట్రెండింగ్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
రీ రిలీజ్ ఎప్పుడంటే?
14 ఏళ్ల తర్వాత ఈ నెల 13న సరికొత్త 4K వెర్షన్‌లో 'కాంచన' థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అప్పట్లో ఈ చిత్రాన్ని రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా... వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వసూళ్లు రాబట్టింది. మరి రీ రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
#Kanchana4K Grand Re - Releasing on March 13th 🔥
— rkfilmsnlr (@rkfilmsnlr) March 9, 2026
More Details Soon
THE FIRST EVER HORROR RE-RELEASE MOVIE IN TELUGU🤕
BOOKING OPENED #NELLORE@offl_Lawrence @realsarathkumar @iamlakshmirai @MusicThaman #BellamkondaSuresh @adityamusic @D_films09 @KedarFilms @DayaArjun2 pic.twitter.com/Byw2anJoGR
Also Read : రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
ఈ మూవీలో ప్రత్యేక అతిథి పాత్రలో రాధికా శరత్ కుమార్ నటించారు. వీరితో పాటే రాయ్ లక్ష్మి, కోవై సరళ, దేవదర్శిని సుకుమారన్, శ్రీమాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై బెల్లంకొండ సురేష్ మూవీని నిర్మించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆడియన్స్‌ను భయపెట్టేందుకు థియేటర్లలోకి రానుంది.
ట్రెండింగ్ వార్తలు























