By: ABP Desam | Updated at : 01 Jan 2022 09:49 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Deepam 1St January Episode (Image Credit: Star Maa/Hot Star)
జనవరి 1 శనివారం ఎపిసోడ్ కార్తీక్ తో ఓపెన్ అయింది. నువ్వు డాక్టర్ గా అనర్హుడివి అంటూ అంతా అన్న మాటలు, ఆస్తి మొత్తం బాధిత కుటుంబానికి ఇచ్చేయడం అంతా గుర్తుచేసుకుంటాడు. అమ్నా-నాన్న క్షమించండి అంటూ పరిస్థితుల ప్రభావంతో ఇలా చేయడం తప్పలేదని మనసులో అనుకుంటాడు. ఇంతలో బాబు గుక్కపట్టి ఏడ్వడంతో కార్తీక్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు ( నువ్వు ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తున్నాడు అన్న హిమ మాటలు గుర్తుచేసుకుంటాడు). నీకు నాకు ఏంట్రా ఈ అంతు చిక్కని అనుబంధం అంటూ మళ్లీ ఉయ్యాల్లో వేయగానే ఏడుపు మొదలెడతాడు. అమ్మా-నాన్న వచ్చేస్తారు బయటకు వెళ్లారని బాబుకి చెబుతుంటాడు.
Also Read: రెండు క్యారెక్టర్లు ఔట్..కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్..
మోనిత బస్తీలో ఎందుకు ఆసుపత్రి పెట్టిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని సౌందర్యతో వారణాసి అంటాడు. అక్కడ ఆమె ఆసుపత్రి పెట్టినా ఎవ్వరూ అక్కడకు వెళ్లడంలేదు, ఎవ్వరూ మాట్లాడడం లేదు, పాలు-కూరగాయలు ఏవీ అమ్మడం లేదు, బస్తీ మొత్తం ఒకేమాటమీద ఉన్నాం అని చెబుతాడు. దీప ఫోన్ చేయలేదా అని అడిగితే..ఒకవేళ ఫోన్ చేస్తే ఆమె చెప్పొద్దన్నా నేను చెబుతా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు వారణాసి. నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందండీ..కార్తీక్ ఎక్కడున్నా బావుంటాడనే ధైర్యం వచ్చింది..చిన్న చిన్న కష్టాలున్నా వాటిని దీప చూసుకుంటుందనే ధైర్యం వచ్చింది అని భర్త ఆనందరావుతో అంటుంది. వారణాసి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కదా ఈ ధైర్యం ఏంటి అని అడుగుతాడు... బస్తీ వాసుల మనసులో ఉండిపోయేలా అంతలా ప్రభావం చేసిందంటే ఇక భర్తని కూడా ఎంతో బాగా చూసుకుంటుందని అంటుంది సౌందర్య. రత్నసీత తీసుకొచ్చిన మహేశ్ కూడా వెతకడానికి వెళ్లాడు కదా త్వరలో కార్తీక్ వాళ్ల ఆచూకీ తెలిస్తే బావుంటుందనుకుంటుంది.
Also Read: కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
గుడి నుంచి ఇంటికి వెళుతున్న కోటశ్-శ్రీవల్లి బండిని రుద్రాణి మనుషులు లారీతో గుద్దించేస్తారు. బాబుని తలుచుకుంటూ ఇద్దరూ చనిపోతారు. కట్ చేస్తే ఆసుపత్రి దగ్గరకు వచ్చిన మోనిత కారు దిగేలోగా వారణాసి నమస్కారం మేడం అంటాడు. బస్తీవాసులు కూడా అక్కడకు వస్తారు. మీరు నా బుట్టలో పడతారని నాకు తెలుసు అనుకుంటుంది. ఏం కావాలి అంటుంది మోనిత.. పాతిక్కో పరక్కో దిగజారే వాళ్లలా కనిపిస్తున్నామా, ఇక్కడి నుంచి వెళ్లిపోండని చెబుతారు. ఈ ఇల్లు నేను కొనుక్కున్నా ఇక్కడే ఉంటా అంటుంది మోనిత.
ALso Read: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
రుద్రాణి-కార్తీక్
రూమ్ నిండా ఉన్న పిల్లల ఫొటోలు చూస్తూ... పోలీస్ తనని కొట్టిన విషయం తల్చుకుంటుంది. కోటేష్-శ్రీవల్లి నన్నెందుకు ఇబ్బంది పెట్టారు.. నాపై రాయేస్తే ఇలాంటి పనులే చేస్తానంటుంది. అప్పు తీర్చలేదు నేను బాబుని తీసుకొచ్చా..నన్ను పోలీస్ స్టేషన్ కి పంపించారు..మీరు పైకి పోయారు..ఏం బాగుపడ్డారని అనుకుంటుంది. ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన కార్తీక్.. అసలు నువ్వు మనిషివేనా, ఇద్దరు అమాయకుల్ని చంపావ్, వాళ్ల ప్రాణాలు తీసి ఏం బాగుపడతావ్ అని ఫైర్ అవుతాడు. నేను ప్రాణాలు తీయడమేంటని క్వశ్చన్ చేసిన రుద్రాణితో ఇంకా నటించకు.. ఇప్పటి వరకూ నువ్వు ఏం చేసినా అడిగేవారు లేరు.. నీకు కోపం వస్తే ఓ మాట అంటే సరిపోతుంది.. ఆ మాత్రం దానికే యాక్సిడెంట్ చేయించి చంపించాలా అంటాడు. నేను మర్యాదగా మాట్లాడుతుంటే నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి..వాళ్ల చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదన్న రుద్రాణి..ఎక్కువ మాట్లాడితే కథ వేరే ఉంటుంది సార్ , పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తుంది. స్పందించిన డాక్టర్ బాబు నీ అంతు చూడనిదే వదిలిపెట్టనంటాడు కార్తీక్. అప్పు తీరుస్తానని సంతకం పెట్టాక కూడా వాళ్లనెందుకు చంపావ్ అంటాడు.
Also Read: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
రుద్రాణి డైలాగ్స్
అవును నేనే చంపించాను.. నా ఇంటికి పోలీసులు వచ్చారు, ఆ పోలీస్ నన్ను ఘోరంగా అవమానించింది, ట్రాన్ఫర్ అయి వెళ్లిపోయింది, నా పగ ఎవరిపై తీర్చుకోవాలి, నాపై కంప్లైంట్ ఇచ్చిన శ్రీవల్లి-కోటేష్ ల పైనే కదా .. తప్పేలేదు, నువ్వు నా మనుషుల్ని-నీ పెళ్లాం నన్ను కొట్టారు అయినా సరే అనుకున్నా. కానీ ఆ శ్రీవల్లి-కోటేశ్ నా అభిమానంపై దెబ్బకొట్టారు తట్టుకోలేకపోయాను. రుద్రాణికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది. నీకేదో బ్యాంగ్రౌండ్ ఉన్నట్టు దీప మాట్లాడుతోందని రుద్రాణి అంటుంది. స్పందించిన కార్తీక్ చేసిన తప్పు ఒప్పుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపో లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటాడు. దీంతో మరింత రెచ్చిపోయిన రుద్రాణి ... నా బాకీ తీర్చకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా అని రెట్టిస్తుంది. మీ కూతురు హిమను నేను దత్తత తీసుకుంటా అంటుంది. ఎపిసోడ్ ముగుసింది...
Also Read: వసుపై ప్రేమతో ప్లేట్ ఫిరాయించిన రిషి, మహేంద్ర క్లాస్-జగతి షాక్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్
Kalyaan Dhev: కూతురి బర్త్ డే, విష్ చేయని కళ్యాణ్ దేవ్ - తెరపైకి మరోసారి శ్రీజ విడాకుల వ్యవహారం!
Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!
Regina Cassandra: 2019లో కులు మనాలి రూమ్లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా
Vijay Sethupathi: రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో విజయ్ సేతుపతి - పాన్ ఇండియా లెవెల్లో!
IND vs ENG, 5th Test: ఓటమికి తోడు టీమ్ఇండియాకు మరో షాక్! WTC ఫైనల్ అర్హతకు ప్రమాదం!
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !
జియో యూజర్స్కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్స్క్రిప్షన్ ఉచితం
KCR BRS Postpone : కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పుడే కాదా ? మూడో సారి గెలవడమే ప్రస్తుత లక్ష్యమా ?