By: ABP Desam | Updated at : 31 Dec 2021 09:00 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Deepam December 31 Episode (Image Credit: Star Maa/Hot Star)
కార్తీకదీపం డిసెంబరు 31 శుక్రవారం ఎపిసోడ్..
ఇంటి బయట కూర్చుని ఆలోచిస్తున్న కార్తీక్ కి స్నాక్స్ తీసుకొచ్చిన దీప.. రుద్రాణిని పోలీసులు అరెస్ట్ చేయడం సంతోషంగా ఉందని చెబుతుంది. కుక్కతోక వంకర అన్నట్టు అలాంటి వారు మారరు పైగా మరింత రెచ్చిపోతారు, శ్రీవల్లి వాళ్లు పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది... ఒక్కోసారి యుద్ధం కన్నా రాజీ ముఖ్యం కదా అన్న కార్తీక్.. మన వెళ్లి రుద్రాణిని బతిమలాడి తీసుకొచ్చేవారం అంటాడు. సరే అయిందేదో అయిపోయిందన్న దీప..రేపటి నుంచి వంటలు మొదలుపెడుతున్నా అంటుంది. మీ పేరే పెడతా అనడంతో.. నేను దురదృష్ట వంతుడిని వద్దు అంటాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి చేరిన రుద్రాణి.. అమ్మోరికి బలిచ్చే టైమొచ్చింది మనోళ్లందరకీ మేకపోతుల మాంసం పెట్టాలంటుంది. ఎన్ని వేటలు బలివ్వాలని తన దగ్గరున్న రౌడీలు అడిగితే.. రెండు అని చెబితుంది. అక్కా బలి రెండు అన్నావ్ అంటే.. అవసరమైతే అడ్డొస్తే వాళ్లిద్దరినీ కూడా చంపేయమని చెబుతుంది.
Also Read: పగతీర్చుకున్న రుద్రాణి, షాక్ లో కార్తీక్ -దీప .. కార్తీకదీపం డిసెంబరు 30 గురువారం ఎపిసోడ్
నరసమ్మ కాఫీ ఇవ్వలేదేంటి అన్న మోనితతో.. మనకు పాలు, కూరగాయలు ఏవీ అమ్మడం లేదని చెబుతూ..మీరంటే ఎందుకంత కోపం అని అడుగుతుంది. ఇతంలో ( గతంలో క్వశ్చన్ చేసిన ప్రియమణిని పంపించేశా అన్న మాటలు గుర్తుచేసుకుని) ఎందుకులేమ్మా ఎంతదూరం అయినా వెళ్లి పాలు తీసుకొస్తా అంటుంది. ఆ తర్వాత కూల్ గా కూర్చున్న మోనిత... దీపక్కా నీకు ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు.. నాలుగు రోజులు టైం పట్టినా వీళ్లని నావైపు తిప్పుకుంటా, మీ ఆచూకీ తెలుసుకుంటా అంటుంది. ఇల్లు కొన్నా, ఆసుపత్రి పెట్టా, త్వరలో బస్తీజనం అభిమానం కొనుక్కుంటా అంటూ కోటేష్ ఫొటో చూస్తుంది. ఫోన్లో కోటేష్ ఫొటో చూస్తూ..నా ఆనందరావుగారిని కిడ్నాప్ చేస్తావా-నీకు జీవితంలో ఆనందం ఉండదురోయ్ అంటుంది. కట్ చేస్తే... దీపను పిలిచిన శ్రీవల్లి.. కాసేపు బాబుని చూడవా అక్కా గుడికి వెళ్లివస్తా అంటుంది. ఈ ఒక్క రోజు బాబుని చూసుకో అక్కా..రేపటి నుంచి మా పిన్ని వస్తానంది అంటుంది. బాబుని నేను చూసుకుంటా అని చెప్పిన దీప..దేవుడి హుండీలో వేసేందుకు డబ్బులిస్తుంది.
Also Read: కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
పెద్దోడి గురించి ఆచూకీ ఏమైనా తెలిసిందా అని ఆదిత్యను సౌందర్య అడుగుతుంది. ఫోన్ వాడకపోవడంతో ఎలాంటి ఆధారం దొరకలేదని, పోలీసులు చెప్పినదాని ప్రకారం అన్నయ్య వాళ్లు ఏదో మారుమూల పల్లెటూర్లో ఉండొచ్చన్నారని చెబుతాడు. కార్తీక్ అందరికీ దూరంగా వెళ్లాడు కానీ తప్పించుకుని వెళ్లలేదు.. ఈ విషయం అందరకీ అర్థం అయ్యేలా చెప్పే బాధ్యత నీదే ఆదిత్య అంటాడు తండ్రి ఆనందరావు. మరోవైపు బాబుతో దీప కబుర్లు చెబుతూ..నువ్వు ఈ పెద్దమ్మతోనే ఉండిపో... వీపుపై పుట్టుమచ్చ ఉంటే గొప్పోళ్లవుతారు అంటారు.. నువ్వు నిజంగా గొప్పోడివే రుద్రాణి లాంటి రౌడీకే బుద్ధొచ్చేలా చేశావ్ అంటుంది. లేదంటే నీ నామకరణానికే అడ్డుపడుతుందా ఆ రుద్రాణి అని నవ్వుతుంది దీప. ఇంతలో అక్కడకు వచ్చిన కార్తీక్.. ఆ రుద్రాణి రాత్రే ఇంటికి వచ్చేసింది, ఊళ్లో అందరూ ఆ రుద్రాణి.. కోటేశ్ ని వదలదు అనుకుంటున్నారు. పగబడితే వదలదంటూనే..కోటేశ్ వాళ్లకి ప్రమాదం పొంచి ఉందంటాడు.
Also Read: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
మన జీవితంలో మంచి రోజులొచ్చాయి.. మంచి బాబునిచ్చాడు, దీపక్కని ఇచ్చాడు అంటూ భర్త కోటేష్ తో మాట్లాడుతూ త్వరగా ఇంటికి పోనీవయ్యా అంటుంది శ్రీవల్లి. మరోవైపు స్కూల్ కి వెళ్లిన దీప ఏం కావాలన్నా, ఏం నచ్చకపోయినా నాన్న ముందు మాట్లాడొద్దు, నన్ను మాత్రమే అడగండి అంటుంది. ఇద్దరికీ చెప్పులు కొనిస్తుంది. ఏ షోరూంలో కొన్నావ్ అని హిమ అడిగితే.. దార్లో తోపుడు బండిపై అమ్మితే కొన్నా అంటుంది. నేను పెద్ద షోరూంలో తెచ్చానని అబద్ధం చెప్పొచ్చు కానీ నేను అలా చెప్పను..మీరు కూడా ఒక విషయం తెలుసుకోవాలి, వస్తువులు సౌకర్యంగా ఉండాలి కానీ వాటి ధర, ఎక్కడ కొన్నాం అనేదానితో ఆనందం ముడిపడి ఉండకూడదు.. సంతోషం మనం పెట్టే ధరలో ఉండదు-చూసే దృష్టిలో ఉంటుందని చిన్న క్లాస్ వేస్తుంది వంటలక్క. కట్ చేస్తే ఇంట్లో ఒంటరిగా కూర్చున్న కార్తీక్.. నువ్వు డాక్టర్ అనే విషయాన్ని మర్చిపోవాలని అంతా అన్న మాటలు, జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటాడు.
రేపటి ఎపిసోడ్ లో
శ్రీవల్లి-కోటేశ్ ని చంపేందుకు కాపుకాసిన రుద్రాణి మనుషులు లారీతో బండిని గుద్దించేస్తారు. ఆ విషయం తెలిసిన డాక్టర్ బాబు ఆవేశంగా రుద్రాణి ఇంటికి వెళతాడు.
Also Read: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
Also Read: వసు పయనం ఎటువైపు, రిషి-జగతి ఏం చేయబోతున్నారు.. గుప్పెండత మనసు డిసెంబరు 30 గురువారం ఎపిసోడ్
Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: వసుధారతో గౌతమ్ మాట్లాడుతుంటే భరించలేకపోతున్న రిషి, గుప్పెడంతమనసు డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Janaki Kalaganaledu August 17th Update: గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి అఖిల్ వెళ్తున్నాడని పసిగట్టిన మల్లిక- అన్నకి రాఖీ కట్టమని జానకికి చెప్పిన జ్ఞానంబ
Guppedantha Manasu ఆగస్టు 17 ఎపిసోడ్: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి
Lucifer 2 Empuraan Movie : మెగాస్టార్ రీమేక్ సినిమాకు మాలీవుడ్లో సీక్వెల్ షురూ
Gruhalakshmi August 17th Update: సామ్రాట్ కాలర్ పట్టుకున్న నందు, నిజం బట్టబయలు- సముద్రంలో కొట్టుకుపోయిన తులసి?
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్తో మళ్లీ కలవరం!
Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !
V Srinivas Goud: తెలంగాణ మంత్రిపై NHRC లో ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్
TS LAWCET Results: నేడు తెలంగాణ లాసెట్ ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!
Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు