Karthika Deepam జనవరి 3 ఎపిసోడ్: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 3 సోమవారం 1239 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథ ఈ రోజు మరో మలుపు తిరిగింది. ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం 2022 జనవరి 3 సోమవారం ఎపిసోడ్
గత ఎపిసోడ్‌లో రుద్రాణి.. అబ్బులు సాయంతో శ్రీవల్లి, కోటేష్‌లను చంపిస్తుంది. కార్తీక్ వెళ్లి.. 'ఇద్దరు అమాయకుల్ని చంపేస్తావా' అని అడగడంతో మొదట నాకేం తెలియదు అన్న రుద్రాణి.. కార్తీక్ దగ్గర కెమేరాలు, ఫోన్ రికార్డులు లేవని చెక్ చేయించి మరీ నిజం చెబుతుంది.  పైగా నెల రోజుల్లో డబ్బు కట్టకుంటే మీ హిమని నేను దత్తత తీసుకుంటాను అని వార్నింగ్ కూడా ఇస్తుంది.

Also Read: రుద్రాణికి కార్తీక్ వార్నింగ్, అప్పు తీర్చకపోతే కథ వేరే ఉంటదన్న రుద్రాణి.. ‘కార్తీకదీపం’ అప్ డేట్స్..
 ఈ రోజు ( జనవరి 3 సోమవారం ఎపిసోడ్ లో) అమ్మా వంటలు నేర్పించు అని పిల్లలంటే.. వద్దమ్మా..వంటలక్క అనే బిరుదు నాతోనే అంతమైపోవాలంటుంది దీప. ఇంతలో అక్కడకు కార్తీక్ రావడంతో పిల్లలు 'నాన్నా తమ్ముడ్ని మనమే పెంచుకుందాం.. వాడు పెద్దయ్యాక  సొంత తమ్ముడు కాదని తెలిస్తే బాగోదు కదా అంటారు. అయితే ఊర్లో ఉంటే అంతా శ్రీవల్లి వాళ్ల బాబు అంటున్నారని అందుకే ఊరు వదలి వెళ్లిపోదాం అంటారు. వీడిని మనమే పెంచుకుందా కానీ ఇప్పుడప్పుడే ఈ ఊరు వదిలి వెళ్లలేం అన్న కార్తీక్ తో..ఎందుకు అని అడుగుతారు దీప-పిల్లలు. అదే సమయంలో కార్తీక్..అప్పుతీరుస్తానంటూ రుద్రాణికి చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు. ఆ విషయం అర్థం చేసుకున్న దీప..ఈ ఇంటిని వదిలేస్తే రుద్రాణి తీసుకుంటుంది కదా అప్పుడు మనం అప్పు తీర్చాల్సిన పనిలేదు కదా అంటుంది. అలా చేస్తే శ్రీవల్లి-కోటేష్ ల చావుకి అర్థం లేకుండా పోతుంది..ఎందుకంటే ఇది కోటేష్ పూర్వీకుల ఆస్తి కాబట్టి దీనికి వారసుడు ఆనంద్.. అలాంటప్పుడు ఇల్లు రుద్రాణికి అప్పగిస్తే వీడికి మనం అన్యాయం చేసినట్టు అవుతుంది కదా అంటాడు. స్పందించిన దీప ఇంత దూరం ఆలోచించలేదంటుంది... కానీ డాక్టర్ బాబు ఏదో విషయం నా దగ్గర దాచుతున్నారని మనసులో అనుకుంటుంది.

Also Read: రెండు క్యారెక్టర్లు ఔట్..కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్..
కట్ చేస్తే సౌందర్య ఇంట్లో...
పిల్లల పుస్తకాలు వెతుకున్నా వాళ్ల చేతిరాత చూసినా ఆనందంగా ఉంటుందని సౌందర్య అంటుంది. ఇన్ని సౌకర్యాలు వదిలేసి ఎక్కడుంటున్నారో ఏం తింటున్నారో, అసలు పిల్లలు స్కూల్ కి వెళుతున్నారో లేద కూడా తెలియడం లేదు, పిల్లలు ఏం చేశారని వాళ్లకీ శిక్ష అని భర్త దగ్గర బాధపడుతుంది. సౌకర్యాల్లో సంతోషం లేదు సౌందర్య..వాళ్లు మనకు దూరమయ్యారే కానీ సంతోషానికి దూరమయ్యారని ఏమాత్రం అనుకోవద్దు.. ఏదో ఒక రోజు మన దగ్గరకు వస్తారని చెబుతాడు ఆనందరావు. మరోవైపు బస్తీలో లక్ష్మణ్, అతడి భార్య.. మోనిత గురించి మాట్లాడుకుంటారు. ‘మోనితని దూరం పెట్టడం కరెక్ట్ కాదేమో.. ఆ బాబు కార్తీక్ బాబు వాళ్ల బాబే అని అనుకుంటున్నారు అంతా.. పైగా శాంతులు కోసం పూజలు కూడా చేయించారట కార్తీక్ బాబు వాళ్ల అమ్మగారు. అంటే మోనితదే తప్పు అని అనుకోలేం కదయ్యా.. నిప్పులేనిదే పొగరాదు కదయ్యా’ అంటూ మోనితకి అనుకూలంగా మాట్లాడుతుంది. దాంతో లక్ష్మణ్ ఆలోచనలో పడతాడు. 

Also Read: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
దీప బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అక్కడకు వచ్చిన కార్తీక్ ..నేను ముళ్ల చెట్టు లాంటివాడిని, నీడనివ్వలేనని బాధపడతాడు. శ్రీవల్లి-కోటేశ్ కి అన్యాయం జరిగినా నోరు విప్పలేకపోయాను, రుద్రాణి నువ్వు చేసింది తప్పు అని అరిచి లోకానికి చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయాను, కాళ్లకు మట్టి అంటకుండా పెరిగిన పిల్లలకి కాళ్లకి చెప్పుల్లేకుండా ఉన్న పరిస్థితి తీసుకొచ్చాను, కడుపునిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను..నా దగ్గర ఇంకా తగ్గించుకునేందుకు ఏముందని అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేను బాధపడానని నాకు ధైర్యం చెబుతున్నావు కానీ నేనేంటి, నేనెవరు అని క్వశ్చన్ చేస్తాడు. డాక్టర్ ని అయిండి వైద్యం చేయలేకపోతున్నాను, మనిషిని అయిండి సాయం చేయలేకపోతున్నాను, తండ్రినా- పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను, భర్తనా-నీకు అండగా ఉండలేకపోతున్నా అంటాడు. స్పందించిన దీప..మీకు ఇష్టమైన పని-మీరు చేతనైన పని ఏదో ఒకటి చేయండి చాలు అప్పుడైనా మీకు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయంటుంది దీప.

Also Read: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
 సౌందర్య స్టోర్ రూమ్ కి వెళ్లి పిల్లల పుస్తకాలు చూసి వాళ్లు అడిగే ప్రశ్నలు గుర్తుచేసుకుని ఏడుస్తుంది. ఇంతలో స్టోర్ రూమ్ లో మోనిత-కార్తీక్ ఫొటో చూసి కోపంతో రగిలిపోతుంది. ఈ ఫొటోను తీసుకెళ్లి విసిరేయకుండా ఎందుకింత భద్రంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని కోపంగా విసిరేస్తుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడకు వచ్చిన మోనిత ఆ ఫొటోని పట్టుకుంటుంది. నమస్తే ఆంటీ గారూ మీరు విసిరేస్తే క్యాచ్ పట్టుకున్నా బాగానే పట్టుకున్నా...నేను దీనికోసమే వచ్చాను..నా మనసు తెలుసుకున్నట్టే ఇచ్చారు..న్యూ ఇయర్ గిఫ్ట్ గా భావిస్తా అంటుంది. కొన్ని అనుకుంటాం కానీ అవి జరగవు, మీరు నన్ను ఫ్యామిలీ లోంచి పంపిద్దామనుకున్నారు, నేను దగ్గరవుదాం అనుకుంటున్నా అంటుంది. మిడిసిపడకు మోనిత అని సౌందర్య అంటే.. నా కార్తీక్-నా బిడ్డతో ఈ ఇంట్లో అడుగుపెడతాను అప్పుడు మీరే హారతిచ్చి రమ్మంటారని వెళ్లిపోతుంది. 

Also Read: సీతాకోక చిలుకల్లా రెండు మనసులు ఊగిన నెమలి ఈక ఉయ్యాల, గుప్పెడంత మనసు ఎపిసోడ్ అంతా ప్రేమమయం..
ఉయ్యాల్లో ఉన్న బాబుని ఒళ్లోకి తీసుకున్న కార్తీక్.. అనుకోని అతిథిగా మా జీవితాల్లోకి వచ్చావ్, ఈ పేదరికంలో నిన్నెలా బాగా చూసుకోవాలి అనుకుంటాడు.  ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి శ్రీవల్లి - కోటేశ్ కొడుకయ్యావు. వాళ్లు వెళ్లిపోయారు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావ్.. నీకు మేం ఉన్నాం. నా బిడ్డలతో సమానంగా చూసుకుంటాను నానుంచి ఎవ్వరూ వేరు చేయలేరు అనుకుంటాడు. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి పాలు తీసుకొస్తా అంటూ వెళతాడు కార్తీక్. మరోవైపు రుద్రాణి... దీపా పిండివంటలు చేస్తూ బాకీ తీరుస్తావా, ఎన్ని వంటలు చేసి తీరుస్తావు, నేను వంటలు ఆపడమే కాదు నీ మొగుడి చేతే ఆపేలా చేయిస్తా అనుకుంటుంది.

Also Read: వసుపై ప్రేమతో ప్లేట్ ఫిరాయించిన రిషి, మహేంద్ర క్లాస్-జగతి షాక్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
Also Read:  గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Jan 2022 08:56 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam Written Update Future story of Karthika Deepam Nirupam Paritala as Karthik Premi Viswanath as Deepa Shobha Shetty as Monitha Bhavana Reddy as Rudraani. Written UpdateKarthika Deepam 3rd January 2022

సంబంధిత కథనాలు

Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు

Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' రిలీజ్ ఎప్పుడంటే?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' రిలీజ్ ఎప్పుడంటే?

Allu Sirish: ముంబైలో అల్లు శిరీష్ - ఏం చేస్తున్నాడంటే?

Allu Sirish: ముంబైలో అల్లు శిరీష్ - ఏం చేస్తున్నాడంటే?

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!

Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!

టాప్ స్టోరీస్

IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?

IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Bank Accounts Benefits: అవునూ.. అసలెన్ని బ్యాంక్‌ అకౌంట్లు ఉంటే బెస్ట్‌! ఇలాంటి బెనిఫిట్స్‌ ఉంటాయని తెలిస్తే..!

Bank Accounts Benefits: అవునూ.. అసలెన్ని బ్యాంక్‌ అకౌంట్లు ఉంటే బెస్ట్‌! ఇలాంటి బెనిఫిట్స్‌ ఉంటాయని తెలిస్తే..!