Guppedantha Manasu జనవరి 3 ఎపిసోడ్: వసు కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… ఆర్య టైప్ లవ్ స్టోరీలా మారిన గుప్పెడంత మనసు
వసు ప్రేమ కోసం గౌతమ్ ప్రయత్నిస్తుంటే.. చూస్తూ ఊరుకోలేక-బయటపడలేక సతమతమవుతున్నాడు రిషి. అటు జగతి-మహేంద్ర రిషి బయటపడేదెప్పుడో అనే ఆలోచనలో పడ్డారు.గుప్పెడంత మనసు జనవరి 3 సోమవారం ఎపిసోడ్ లో ఏ జరిగిందంటే
గుప్పెడంత మనసు 2022 జనవరి 3 సోమవారం ఎపిసోడ్
మహేంద్ర-రిషి
వసుని ఇంట్లోంచి పంపించేయమని చెప్పిన రిషి.. మళ్లీ జగతి ఇంటికి వెళ్లి మరీ..ఎక్కడికీ వెళ్లొద్దని చెబుతాడు. ఈ మొత్తం వ్యవహారానికి కారణం రిషి అని మనసులో అనుకుంటాడు మహేంద్ర. జనవరి 3 సోమవారం ఎపిసోడ్ లో...గ్రౌండ్ లో నిల్చున్న మహేంద్ర... వసు-జగతి-రిషి మాటలు గుర్తుచేసుకుని ఆలోచనలో పడతాడు. ఇంతలో అక్కడకు రిషి వస్తాడు. నలుగురు నడిచే దారిలో అరటితొక్క వేసేవారిని ఏమంటారని అడుగుతాడు మహేంద్ర... బుర్ర తక్కువ అంటారని చెబుతాడు రిషి. మరి..అవసరం లేకపోయినా వేరే వాళ్లని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే వారిని ఏమంటారని అడుగుతాడు... ఎందుకిలా అడుగుతున్నారని అంటాడు రిషి. మొన్న టైమ్ కి నువ్వొచ్చావు కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేది..అనవసరంగా జగతి-వసుధార విడిపోయేవారు అంటాడు. విడిపోలేదు కదా అంటాడు రిషి. ఒకవేళ విడిపోయినా వాళ్ల మధ్య ఎవరో ఏదో చేశారు అన్న మహేంద్రతో..డాడ్ ఆ విషయం వదిలేయండి అంటాడు. వదిలేయను ... నాకు తిట్లు రావు కానీ తిట్టాలని ఉంది..అయినా వాళ్లు విడిపోయే ఏమొస్తుంది అంటాడు మహేంద్ర. కానీ వదలను రిషి అని హెచ్చరిస్తాడు మహేంద్ర. అయితే డాడ్ కి నాపేరు మేడం చెప్పకపోవడం మంచిదైంది అనుకుంటాడు రిషి.
Also Read: సీతాకోక చిలుకల్లా రెండు మనసులు ఊగిన నెమలి ఈక ఉయ్యాల, గుప్పెడంత మనసు ఎపిసోడ్ అంతా ప్రేమమయం..
జగతి ఇంట్లో
పొద్దున్నే ఇంటికి వచ్చిన గౌతమ్ ని చూసి జగతి షాక్ అవుతుంది. వసుధార లేదా అంటే..మేం ఇప్పుడు కాలేజీకి బయలుదేరే టైం కదా అంటుంది. మీ టైం డిస్టబ్ చేయను కానీ మిషన్ ఎడ్యుకేషన్ గురించి అద్భుతమైన ఐడియాలు నాకొచ్చాయి..మీకు ఉపయోగపడతాయని ఈ ప్రింట్స్ తీసుకొచ్చా అంటాడు గౌతమ్. ఓపిగ్గా టైప్ చేసి, ప్రింట్ తీసి తీసుకొచ్చాడు.. మెయిల్ కూడా చేయొచ్చని మరిచిపోయినట్టున్నారు పాపం అంటూ సెటైర్ వేస్తుంది జగతి. ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేసే టైం లేదు ఆపేపర్స్ తీసుకో మనం కాలేజీకి వెళదాం అంటుంది జగతి. ఆ మాటలు విన్న గౌతమ్.. తనని ఇన్ డైరెక్ట్ గా వెళ్లిపోమని చెబుతోందా అనుకుంటాడు మనసులో. ఇంతలో వసుతో సెల్ఫీ తీసుకుని ఓ పెద్ద పనైపోయింది వసుధారం అంటాడు.
Also Read: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్
రిషి ఇంట్లో
అంతా కూర్చుని టిఫిన్ తింటుంటారు. గౌతమ్ కనిపించడం లేదేంటని అడిగితే.. వసుధార వాళ్ల ఇంటికి వెళ్లాడని చెబుతుంది ధరణి. వసుధారకి అభిమానిగా మారిపోయాడేమో అంటుంది దేవయాని.. అవును వసు తెలివితేటలకి ఎవరైనా అభిమానిగా మారక తప్పదు అంటాడు రిషి పెదనాన్న ఫణీంద్ర. ఇంతలో హర్ట్ అయిన రిషి టిఫిన్ తినకుండా వెళ్లిపోతాడు. కట్ చేస్తే జగతి-వసుధార కారుల్లో వెళుతుంటారు ( ప్రతి రోజూ కారు అలవాటైందా అని వసుని అన్నమాటలు జగతి... నేను వెళ్లమంటే వెళ్లిపోతావా అన్న జగతి మాటలు వసు గుర్తుచేసుకుంటారు). ఎదుటి వారి పాయంట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలిగితే చాలా అపార్థాలు తొలగిపోతాయి అంటుంది జగతి. ఇంతలో వసుకి కాల్ చేసిన రిషి.. వసుధారా ఎక్కడున్నావ్, ఎవరితో ఉన్నావ్, ఏం చేస్తున్నావ్, పొద్దున్నే గౌతమ్ ఎందుకొచ్చాడని అడుగుతాడు. ఇప్పుడెక్కడున్నావ్ అంటే కాలేజీకి వెళుతున్నా అని చెబుతుంది..సరే కాలేజీలో కలుద్దాం అనేసి కాల్ కట్ చేస్తాడు రిషి. అక్కడకు వచ్చిన మహేంద్రని చూసి షాక్ అయిన రిషి.... డాడ్ గౌతమ్ కి వసుధార దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏంటని అడుగుతాడు. మీరైనా వాడికి అర్థమయ్యేలా చెప్పండి అంటే.. గౌతమ్ నీ ఫ్రెండ్ కదా అదేదో నువ్వే చెబితే బావుంటుంది అంటాడు మహేంద్ర. గౌతమ్..వసు ఇంటికి వెళితే కోపం వస్తుంది..కానీ ఎందుకు కోపం వస్తుందో చెప్పవ్ అనుకుంటాడు మహేంద్ర.
Also Read: వసుపై ప్రేమతో ప్లేట్ ఫిరాయించిన రిషి, మహేంద్ర క్లాస్-జగతి షాక్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
కాలేజీలో
జగతి జీవితం విచిత్రమైనది కదా ఎప్పుడేమవుతుందో తెలియదు అంటుండగా..రిషి రావడం చూసి ఆపేస్తాడు. వాడి మూడ్ బాగోపోతే నాకు జ్ఞానబోధ చేస్తాడని అక్కడి నుంచి మహేంద్ర వెళ్లిపోతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి.. థ్యాంక్యూ చెబుతాడు. మీరు చెప్పిన పని నేను చేయలేకపోయాను కదా అంటే అందుకే థ్యాంక్స్ అంటాడు. వసుధార గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు అలాంటప్పుడు అలా ఎలా పంపించేయాలనుకుంటారు, మీ స్టూడెంట్ పై మీకు ఆమాత్రం బాధ్యత లేదా అని రివర్సవుతాడు రిషి. మేడం గౌతమ్ నా ఫ్రెండ్ అయినా దానివల్ల మీ టైమ్ డిస్టర్ అవకుండా చూసుకోండనేసి వెళ్లిపోతాడు. నీ మనసు ఒకటి చెబుతోండి-నీ పెదాలు మరొకటి అంటాయ్ నిన్ను అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటుంది జగతి. రిషి మనసేంటో నీకైనా అర్థమవ్వాలి వసుధార అనుకుంటుంది జగతి. జేబులోంచి ఫోన్ తీస్తుండగా కార్ కీ పడిపోయినా చూసుకోకుండా రిషి వెళ్లిపోతాడు. అది తీసేందుకు వెళ్లేలోగా అటుగా నడిచే స్టూడెంట్స్ కాలితో ఎక్కడికో తోసేస్తారు. అది వెతికి తీసుకొస్తా అంటుంది వసుధార....కానీ క్లాస్ కి లేటవుతోందంటూ పుష్ప..వుసుని లాక్కెళ్లిపోతుంది.
Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
రెస్టారెంట్లో కూర్చున్న రిషిని చూసి కాఫీ కావాలా అని అడుగుతుంది వసుధార. కాఫీ కోసమే కదా ఇక్కడకు వస్తా అని కేర్లెస్ గా సమాధానం ఇస్తాడు. మరోవైపు హలో వసుధార అని పిలుస్తాడు. గౌతమ్- రిషి ఒకర్నొకరు చూసి షాక్ అవుతారు. నువ్వెందుకు ఇక్కడకు వచ్చావంటే నువ్వెందుకు వచ్చావని క్వశ్చన్ చేసుకుంటారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి