అన్వేషించండి

Karthika Deepam జనవరి 4 ఎపిసోడ్: దీపని రుద్రాణి ఏం చేసింది, కార్తీక్ కంగారులో అర్థం ఉందా.. కార్తీకదీపం మంగళవారం ఏం జరిగిందంటే..

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 4 మంగళవారం 1240 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథ ఈ రోజు మరో మలుపు తిరిగింది. ఏం జరిగిందంటే…

కార్తీకదీపం 2022 జనవరి 4 మంగళవారం ఎపిసోడ్

దీప పిండివంటలు చేస్తూ బాకీ తీరుస్తావా, ఎన్ని వంటలు చేసి తీరుస్తావు.. నేను వంటలు ఆపడమే కాదు నీ మొగుడి చేతే ఆపేలా చేయిస్తా అనుకుంటూ కార్తీక్ దగ్గరకు వెళుతుంది రుద్రాణి. ఇంట్లో బాబుకి పాలు కలుపుతున్న కార్తీక్ ని టార్గెట్ చేస్తుంది రుద్రాణి. మీ ఆవిడ బయటకు వెళ్లి వ్యాపారం చేస్తుంటే నువ్వు ఇంట్లోనే ఉండి బాబుని చూసుకుంటున్నావా.. మొగుడు పెళ్లాం అయితే..పెళ్లాం మొగుడైంది అన్న రుద్రాణితో ఇక ఆపు అని అరుస్తాడు కార్తీక్. పనీ పాటా చేతకాని వాళ్లకి కోపం ఎక్కువ అన్న  రుద్రాణి... అవును మా రంగరాజు ఎలా ఉన్నాడంటూ బాబుని ఉద్దేశించి అంటుంది. బాబు దగ్గరకు రావొద్దని కార్తీక్ అనడంతో మీకు ఇద్దరు పిల్లలున్నారు కదా బాబుని నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. నువ్వు ఇంట్లో బాబుని బాగానే ఆడిస్తావ్ కానీ..బయటకు వెళ్లిన నీ పెళ్లాం దీప, పిల్లలు క్షేమంగా రావాలి కదా, రోజులు అస్సలు బాగాలేవు అంటూనే.. ఎవరి టైం ఎలా ఉంటుందో ఏమో..ముందు జాగ్రత్తగా చెప్పానంటూ బెదిరించి వెళ్లిపోతుంది. 

Also Read: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్
సౌందర్య ఇంట్లోంచి విసిరిపడేసిన ఫొటోని ప్రజావైద్యశాలలో పెట్టిన మోనిత ..కార్తీక్ ఎంత బావున్నావ్ అనుకుంటూ ఉయ్యాల్లో ఉన్న బాబు బొమ్మతో మాట్లాడుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన నరసమ్మ..సార్ ఎక్కడికి వెళ్లారు మేడం అని అడుగుతుంది. ముంబై వెళ్లాడని చెప్పిన మోనితతో..మీ ప్రేమకథ మొత్తం నాకు తెలుసు అంటుంది. అయితే ఇంకేం నో ప్రాబ్లెమ్ అంటుంది. కట్ చేస్తే కార్తీక్ ని వెతకమని సౌందర్య బిచ్చగాడికి డబ్బులిస్తుంది. ఆ బిచ్చగాడు వెతుకుతూ తాడికొండ గ్రామానికి వెళతాడు. నేరుగా వెళ్లి రుద్రాణి మనిషి దగ్గరకు వెళ్లి... కార్తీక్ ఫొటో చూపించి ఈయన మీకు తెలుసా అని అడుగుతాడు. కానీ వాడు ఫొటో చూడకుండానే వెళ్లిపోతాడు. 

Also Read:  రుద్రాణికి కార్తీక్ వార్నింగ్, అప్పు తీర్చకపోతే కథ వేరే ఉంటదన్న రుద్రాణి.. ‘కార్తీకదీపం’ అప్ డేట్స్..
ఇంట్లో బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టిన కార్తీక్..దీప-పిల్లలు క్షేమంగా రావాలి కదా అన్న రుద్రాణి మాటలు గుర్తుచేసుకుంటూ దీప ఇంకా ఇంటికి రాలేదంటని ఆలోచిస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మహాలక్ష్మి అనే మహిళ దీప లేదా అని అడుగుతుంది. నేను స్కూల్ వరకూ వెళ్లిరావాలి బాబుని చూస్తావా అని ఆమెకి అప్పగించి కార్తీక్ స్కూల్ కివెళతాడు. స్కూల్లో కూర్చున్న పిల్లలు అమ్మ ఇంకా రాలేదు ఆకలి వేస్తోంది అనుకుంటారు. ఇంతలో అక్కడకు క్యారియర్ తీసుకుని వెళుతుంది రుద్రాణి. అప్పుడు పండ్లు, చాక్లెట్లు ఇచ్చాకదా అనగానే.. అవి మేం తినలేదు వేరేవాళ్లకి ఇచ్చేశాం అంటారు పిల్లలు. అప్పుడు ఇచ్చి వెళ్లాను..ఇప్పుడు తినిపించి వెళతా అంటుంది రుద్రాణి. మీరెవరు మాకు లంచ్ తేవడానికి, మేం ఎందుకు తినాలి అని క్వశ్చన్ చేసిన శౌర్య.. మా అమ్మ తీసుకొస్తుంది వెళ్లండి అంటుంది. మీకు ఆకలి వేస్తోందని తెలుసు తినండని చెప్పినా చేయి విసిరి కొడుతుంది శౌర్య. ప్రేమగా అన్నం తినిపిస్తుంటే వద్దంటారేంటి అంటూ తినిపించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడకు వెళతాడు కార్తీక్. అన్నం తినమని బెదిరిస్తోందని చెబుతారు పిల్లలు. దీంతో కార్తీక్ అసలు బుద్ధిలేదా అని రుద్రాణిపై ఫైర్ అవుతాడు. నేను ఏదో అన్నానని భయపడి వచ్చావా..పిల్లలంటే నాకు ఇష్టం వాళ్లని ఏమీ చేయను అంటూనే..దీప ఇంటికి వచ్చిందా...మరి ఎక్కడుందో వెతుక్కోవా అంటుంది. 

Also Read: రెండు క్యారెక్టర్లు ఔట్..కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్..
మరోవైపు తాడికొండ చేరిన బిచ్చగాడు ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అటు కార్తీక్..దీపను వెతుకుతూ తిరుగుతాడు. దీప గురించి ఎవర్ని అడగాలి...శ్రీవల్లి-కోటేష్ లా దీపకి ఏం కాకూడదని కోరుకుంటాడు. ఇంతలో కార్తీక్ ఎదురుగా వస్తాడు కానీ.. అప్పుడే వేరే వ్యక్తి టోపీ కిందపడడంతో బిచ్చగాడు కిందకు వంగుతాడు..కార్తీక్ క్రాస్ అయి వెళ్లిపోతాడు. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. 

Also Read: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
Also Read: సీతాకోక చిలుకల్లా రెండు మనసులు ఊగిన నెమలి ఈక ఉయ్యాల, గుప్పెడంత మనసు ఎపిసోడ్ అంతా ప్రేమమయం..
Also Read: వసుపై ప్రేమతో ప్లేట్ ఫిరాయించిన రిషి, మహేంద్ర క్లాస్-జగతి షాక్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
Also Read: వసు కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… ఆర్య టైప్ లవ్ స్టోరీలా మారిన గుప్పెడంత మనసు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget