Karthika Deepam Sobha Shetty: డాక్టర్ బాబు తమ్ముడిని 'బుజ్జి బంగారం' అంటూ వెంటపడుతోన్న మోనిత
బుల్లితెరపై డాక్టర్ బాబుని నా కార్తీక్ అంటూ వెంటపడుతున్న మోనిత.. ఇప్పుడు రూట్ మార్చి మరిది ఆదిత్య ని బుజ్జి బంగారం అని ముద్దుచేస్తోంది. అసలు విషయం ఏంటో చూసేయండి..
కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సాయంత్రం ఏడున్నర అయ్యేసరికి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పూనకాలే. ఈ సీరియల్ లో పాత్రలన్నీ ప్రేక్షకులకు బాగా కనెక్టైపోయాయి. ముఖ్యంగా కార్తీక్, దీప, సౌందర్య, ఆనందరావు, ఆదిత్య, శ్రావ్య, మోనిత, శౌర్య, హిమ... వీళ్ల నటనకు ఫిదా కానివారు లేరు. అయితే డాక్టర్ బాబు, వంటలక్క, సౌందర్య కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మోనిత కూడా తగ్గేదేలే అన్నంత ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సీరియల్ లో ఆమె నటన చూసి ప్రేక్షకులు నిజంగా తిడుతున్నారంటే ఏ మేరకు మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. బుల్లితెరపై ఇంత మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న మోనిత ఇప్పుడు వెండితెరపై వెలిగేందుకు సిద్ధమవుతోంది. మీకు అర్థమవుతోందో..శోభాశెట్టి హీరోయిన్ గా రాబోతోంది. హీరో ఎవరంటారా.. ఇంకెవరు డాక్టర్ బాబే అనుకుంటే పొరపాటే..డాక్టర్ బాబు తమ్ముడు ఆదిత్య (యశ్వంత్).
View this post on Instagram
అయితే మోనిత సీరియల్ లో కార్తీక్ చుట్టూ తిరిగితే.. రియల్ గా మాత్రం కార్తీక్ తమ్ముడి తుమ్ముడి క్యారెక్టర్ యశ్వంత్ చుట్టూ చక్కర్లు కొడుతోందట. ఎందుకంటే శోభాశెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు, వీడియోల్లో ఎక్కువగా యశ్వంత్ కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడేకంగా వీరిద్దరూ కలసి నటించబోతున్నారు. శోభాశెట్టి నిర్మిస్తోన్న ఈ సినిమాలో తనే హీరోయిన్ కాగా.. యశ్వంత్ హీరో. టైటిల్ ‘బుజ్జి బంగారం’. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మంచి రొమాంటిక్ సినిమాలా ఉందంటున్నారు. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే అనిపిస్తోందంటున్నారు నెటిజన్లు.
కార్తీకదీపం సీరియల్ లో మోనిత అంటే ఆదిత్య(యశ్వంత్ ) కి అస్సలు పడదు. ఆమె కనిపిస్తేనే తిట్టే క్యారెక్టర్. అటు మోనిత కూడా డాక్టర్ బాబు తనని పట్టించుకోపోవడంతో ఆ కక్షతో మరిది ఆదిత్యకి యాక్సిడెంట్ కూడా చేయిస్తుంది. అంటే సీరియల్ లో టామ్ అండ్ జెర్రీలా ఉండే మోనిత-ఆదిత్య..ఇప్పుడు హీరోహీరోయిన్లు అన్నమాట. మరి సీరియల్ ని ఆదరించినట్టే సినిమాని కూడా ఆదరిస్తారా..వెయిట్ అండ్ సీ...
Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..
Also Read: 'రాధే శ్యామ్'ను డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేస్తారా? ఆడియన్స్‌ను మోసం చేయడమేనా?
Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
Also Read: 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేం మానాలిరా బాబూ!' - 'సుడిగాలి' సుధీర్ సెల్ఫ్ సెటైర్... అనసూయ ఈజ్ బ్యాక్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి