RGV: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..
ఏపీ సినిమాటోగ్రఫీ మినిష్టర్ పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ పలు ప్రశ్నలు అడిగారు వర్మ.
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇండస్ట్రీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఎవరూ కూడా ముందుకొచ్చి మాట్లాడడం లేదు. నాని, సిద్ధార్థ్ లాంటి హీరోలు మాట్లాడితే వారిని టార్గెట్ చేస్తూ మండిపడుతున్నారు ఏపీ మంత్రులు. తాజాగా ఈ విషయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
సినిమా వాళ్లను ఉద్దేశిస్తూ ఆయనొక ట్వీట్ చేశారు. 'ఇది నా రిక్వెస్ట్ కాదు.. డిమాండ్. ఇప్పటికైనా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వారంతా టికెట్ రేట్ ఇష్యూ గురించి మీ అభిప్రాయాలను వెల్లడించండి. ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. తరువాత మీ కర్మ' అంటూ రాసుకొచ్చారు వర్మ.
అలానే ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ పలు ప్రశ్నలు అడిగారు వర్మ. ముందుగా 'సినిమాతో పాటు ఏదైనా ప్రొడక్ట్ మార్కెట్ ధర నిర్ణయించడంలో ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉంటుందని..?' ప్రశ్నించారు. ఆ తరువాత వరుసగా ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.
నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకొని అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయిస్తారు. అయితే అది సినిమాకి ఎలా వర్తిస్తుంది..?. పేదలకు సినిమా అవసరమని మీరు భావిస్తే.. విద్యా, వైద్య సేవలకు రాయితీ ఇస్తున్నట్లు సినిమాలకు రాయితీ ఇవ్వొచ్చు కదా..? ఇలా ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపించారు వర్మ. వీటికి సమాధానం ఇవ్వాలని పేర్ని నానిని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఈ ట్వీట్లు చూసిన నెటిజన్లు వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో వర్మని విమర్శిస్తున్నారు.
It is not my request, but it is my demand to all my colleagues in the film industry to speak up on their true feelings about the ticket rates issue because ippudu nollu moosukunte inkeppatikee theravaleru ..Tharvatha Mee kharma
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2022
Dear honourable minister of cinematography @perni_nani sir ,in case you feel cinema is so essential for the poor then why doesn’t the government subsidise it like how you do it for medical and educational services by paying the balance from the government’s pocket sir ?
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2022
Dear honourable minister of cinematography @perni_nani sir, I understand government might intervene and fix a price below or above the equilibrium when there’s a dire shortage of an essential commodity like wheat, rice , kerosene oil etc , But how does that apply to films sir ?
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2022
Also Read: రాజమౌళితో కరణ్ జోహార్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?
Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..
Also Read: 'నాయట్టు' రీమేక్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?
Also Read: రోజుకి కోటి రూపాయలా..? నిర్మాతకు షాకిచ్చిన విజయ్ సేతుపతి..
Also Read: హీరోయిన్ తో విక్రమ్ కొడుకు ప్రేమాయణం.. ఇద్దరూ ఒకే హోటల్ లో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి