Deepthi Sunaina: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..
షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది దీప్తి. అనంతరం రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ కి వచ్చి బ్రేకప్ పై స్పందించింది.
సోషల్ మీడియాలో దీప్తి సునయనకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఫొటోలకు, వీడియోలకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. యూట్యూబర్ గా తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి తన కో స్టార్ షణ్ముఖ్ తో రిలేషన్ లో ఉంది దీప్తి. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా వెళ్లిన షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. అతడు హౌస్ లో ఉన్నంతకాలం దీప్తి సపోర్ట్ చేస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో క్యాంపైన్స్ కండక్ట్ చేసింది. షణ్ముఖ్ పై జరిగిన ట్రోలింగ్ ను ఎదుర్కొంది. తనపై నెగెటివ్ కామెంట్స్ వచ్చినా.. తట్టుకొని షణ్ముఖ్ కి అండగా నిలిచింది. అయితే షణ్ముఖ్ మాత్రం హౌస్ లో సిరితో బాగా క్లోజ్ అయిపోయాడు. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడడంతో ఒకరిని విడిచిపెట్టి మరొకరు ఉండేవారు కాదు. వారిద్దరి హగ్గులు, ముద్దుల గురించి తెలిసిందే.
ఈ విషయంలో దీప్తి చాలా హర్ట్ అయినట్లు ఉంది. అందుకే షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. అనంతరం రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ కి వచ్చి బ్రేకప్ పై స్పందించింది. తన కెరీర్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు చెప్పింది. లైవ్ చేస్తున్నంతసేపు దీప్తి ఎమోషనల్ అవుతూనే ఉంది. ఫైనల్ గా తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేక లైవ్ మధ్యలోనే ఆపేసింది.
తన హార్ట్ బ్రేక్ అవ్వడంతో దీప్తి చాలా బాధ పడుతోందని తెలుస్తోంది. మరోపక్క షణ్ముఖ్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ లు షేర్ చేస్తున్నాడు కానీ తన లైఫ్ లో మూవ్ ఆన్ అయినట్లు తెలుస్తోంది. సిరి, జెస్సీలతో కలిసి చిల్ అవుతున్నాడు షణ్ముఖ్. రీసెంట్ గా సిరి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంది. దానికి షణ్ముఖ్ అటెండ్ అయ్యాడని అంటున్నారు.
ఈ విషయంలో చాలా మంది సిరి, షణ్ముఖ్ లను ట్రోల్ చేస్తున్నారు. షణ్ముఖ్ బ్రేకప్ కి కారణమైన సిరితో ఇంకా క్లోజ్ గా ఉంటుండడంతో దీప్తి ఫాలోవర్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. షణ్ముఖ్, సిరిలను టార్గెట్ చేస్తూ పలు కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క దీప్తిని ధైర్యంగా ఉండమని చెబుతున్నారు.
Also Read: 'నాయట్టు' రీమేక్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?
Also Read: రోజుకి కోటి రూపాయలా..? నిర్మాతకు షాకిచ్చిన విజయ్ సేతుపతి..
Also Read: హీరోయిన్ తో విక్రమ్ కొడుకు ప్రేమాయణం.. ఇద్దరూ ఒకే హోటల్ లో..
Also Read:ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా..
Also Read:లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి