అన్వేషించండి
Advertisement
Vijay Sethupathi: రోజుకి కోటి రూపాయలా..? నిర్మాతకు షాకిచ్చిన విజయ్ సేతుపతి..
టాలీవుడ్ కి చెందిన ఓ ప్రొడ్యూసర్ ఇటీవల విజయ్ సేతుపతిని కలిశారట. ఆయన దగ్గరున్న కథతో విజయ్ హీరోగా సినిమా చేయాలనుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. 'ఉప్పెన' సినిమాతో ఆయన టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు. అయితే ఆ తరువాత తెలుగులో మరో సినిమా చేయలేదు. విజయ్ కి ఎంత క్రేజ్ ఉన్నా.. ఆయన డిమాండ్స్ ను నిర్మాతలు భరించలేకపోతున్నారట. దీంతో విజయ్ తో సినిమా చేయాలనే ఆలోచనను కూడా పక్కన పెట్టేస్తున్నారట.
టాలీవుడ్ కి చెందిన ఓ ప్రొడ్యూసర్ ఇటీవల విజయ్ సేతుపతిని కలిశారట. ఆయన దగ్గరున్న కథతో విజయ్ హీరోగా సినిమా చేయాలనుకున్నారు. విజయ్ సేతుపతికి కూడా కథ నచ్చింది. కానీ రెమ్యునరేషన్ రోజువారీ ఇవ్వాలని అడిగారట విజయ్. అది కూడా ఎంతో తెలుసా..? రోజుకి కోటి రూపాయలట. పైగా సినిమా ప్రమోషన్స్ కి రానని చెప్పారట. ఒకవేళ వస్తే మాత్రం అదనంగా ఛార్జ్ చేస్తానని నిర్మాతకు చెప్పినట్లు తెలుస్తోంది.
వీటితో పాటు మరో కండీషన్ పెట్టారట. ఆ సినిమాను తమిళంలో డబ్ చేయకూడదని చెప్పారట. ఇన్ని షరతులతో సినిమా చేయలేక నిర్మాత సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతితో సినిమా చేస్తే.. తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ ఉంటుందని భావించిన సదరు నిర్మాతకి విజయ్ పెద్ద షాకే ఇచ్చాడు. అయితే తెలుగు నిర్మాతలకు మాత్రమే విజయ్ ఇన్ని కండీషన్స్ పెడుతున్నారని సమాచారం.
తమిళంలో ఆయన తక్కువ రెమ్యునరేషన్ కి ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. కానీ లాభాల్లో వాటాలు తీసుకుంటూ ఉంటారు. కానీ తెలుగుకి వచ్చేసరికి రెమ్యునరేషన్ లో ఆయన ప్లానింగ్ మొత్తం మారిపోయింది. ఇలా అయితే విజయ్ సేతుపతి నేరుగా తెలుగు సినిమాల్లో ఆఫర్లు సంపాదించడం కష్టమే..!
Also Read: హీరోయిన్ తో విక్రమ్ కొడుకు ప్రేమాయణం.. ఇద్దరూ ఒకే హోటల్ లో..
Also Read:ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా..
Also Read:లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion