
Ameesha Patel: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..
చాలా రోజులుగా అమీషా పటేల్ దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ తో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

తొంభైలలో నటి అమీషా పటేల్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె నటించిన సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అదే సమయంలో 'బద్రి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తరువాత తెలుగులో రెండు, మూడు సినిమాలు చేసింది కానీ ఏవీ వర్కవుట్ అవ్వలేదు. బాలీవుడ్ లో కూడా కొన్నాళ్లకు ఈమెకి అవకాశాలు తగ్గాయి. దీంతో సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్ ను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.
ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా ఈమె దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ తో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కానీ ఈ జంట మాత్రం తమ ప్రేమ విషయంపై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇటీవల ఫైజల్ తన 41వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమీషా అతడిని విష్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
'హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు' అంటూ రాసుకొచ్చింది. అలానే ఫైజల్ తో తీసుకున్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. దీనిపై స్పందించిన ఫైజల్.. 'థాంక్యూ అమీషావెటెల్. ఈ సందర్భంగా నీకు పబ్లిక్ గా ప్రపోజ్ చేస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..?' అంటూ ట్వీట్ పెట్టాడు. కానీ కాసేపటికే ఫైజల్ ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.
అయితే అప్పటికే నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీయడంతో ఫైజల్ పెళ్లి ప్రపోజల్ హాట్ టాపిక్ గా మారింది. ఫైజల్ కి ఇదివరకు జైనాబ్ అనే మహిళతో వివాహం జరిగింది. కానీ ఆమె గుండెపోటుతో 2016లో మరణించింది. అనంతరం ఫైజల్.. అమీషాను ప్రేమించడం మొదలుపెట్టారు. మరి ఈ జంట పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి!
Happy bday my darling @mfaisalpatel … love uuuuu … ❤️💖💖💞💓💘have a super awesome year ❤️💖💖💖 pic.twitter.com/Yworua1hLv
— ameesha patel (@ameesha_patel) December 30, 2021
Also Read: విక్కీ కౌశల్ పై పోలీస్ కంప్లైంట్.. అసలేం జరిగిందంటే..?
Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..
Also Read:రెజీనాతో చిరు స్టెప్పులు.. 'సానా కష్టం' ప్రోమో చూశారా..?
Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?
Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

