Vicky Kaushal: విక్కీ కౌశల్ పై పోలీస్ కంప్లైంట్.. అసలేం జరిగిందంటే..?

విక్కీ కౌశల్ పై ఇండోర్ కి చెందిన జైసింగ్ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

FOLLOW US: 

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ పై ఇండోర్ కి చెందిన జైసింగ్ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పర్మిషన్ తీసుకోకుండా తన ద్విచక్ర వాహనం నెంబర్ ను విక్కీ తన సినిమా వాడారంటూ జైసింగ్ పోలీసులను ఆశ్రయించాడు. విక్కీ కౌశల్‌, సారా అలీ ఖాన్‌ జంటగా నటిస్తున్న సినిమా 'లుకా చుప్పి 2'. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇటీవల ఓ వీడియో క్లిప్‌ లీకైంది. 

ఇందులో హీరో.. సారా అలీ ఖాన్‌ను బైక్‌ పై తీసుకెళ్తూ కనిపించాడు. ఈ సన్నివేశంలో తన బైక్ నెంబర్ వాడుకున్నారంటూ జైసింగ్ మండిపడ్డాడు. ఆ సన్నివేశంలో విక్కీ నడుపుతోన్న బైక్ నెంబర్ నాది అని చెప్పాడు జైసింగ్. ఈ విషయంపై చిత్రబృందానికి అవగాహన ఉందో లేదో తనకు తెలియదని.. కానీ అనుమతులు తీసుకోకుండా ఒక ద్విచక్రవాహనం నెంబర్ వేరొకరు వాడడం చట్ట వ్యతిరేకమని చెప్పాడు జైసింగ్. 

అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని.. తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు జైసింగ్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై స్పందించిన పోలీస్ అధికారు.. కంప్లైంట్ వచ్చిన మాట నిజమేనని.. ఒకవేళ చిత్రబృందం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే మోటార్ సైకిల్ యాక్ట్ కింద వాళ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఇదిలా ఉండగా.. రీసెంట్ గానే విక్కీ కౌశల్.. ప్రముఖ నటి కత్రినా కైఫ్ ను పెళ్లాడారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనడానికి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని ముంబైకి వచ్చారు విక్కీ కౌశల్. తన భార్య కత్రినాతో వేడుకలు జరుపుకున్న తరువాత తిరిగి ఇండోర్ కు బయలుదేరారు. 

Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..

Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..

Also Read:రెజీనాతో చిరు స్టెప్పులు.. 'సానా కష్టం' ప్రోమో చూశారా..?

Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?

Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు

Also Read: సంక్రాంతి రేసులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమా 'డీజే టిల్లు'.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Jan 2022 02:50 PM (IST) Tags: Sara Ali Khan Vicky Kaushal Complaint on Vicky Kaushal Vicky Kaushal motor cycle number

సంబంధిత కథనాలు

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

టాప్ స్టోరీస్

TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు

TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు

Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు