Chiranjeevi: ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
సినీ కార్మికులంతా కలిసి చిరుని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా వ్యవహరించాలని కోరారు. తమకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన ఉన్నారనే ధైర్యం ఉంటుందని కార్మికులు అన్నారు.
![Chiranjeevi: ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్.. Megastar Chiranjeevi Comments on Cinema Industry Chiranjeevi: ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/4df88a5a548ac73956c79afdb1323036_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినిమా పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ ముందుకొచ్చింది. సినిమా పరిశ్రమలో పనిచేసేవారికి యాభై శాతం రాయితీతో టెస్ట్ లు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో కార్డుల పంపిణీ జరిగింది. దీనికి చిరు ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఎంతోమందిని బలి తీసుకుందని.. ఎంతోమంది ఆప్తులను, స్నేహితులను కోల్పోయామని అన్నారు. ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందరినీ కాపాడాలనే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోగం వచ్చాక బాధపడేకంటే రోగ నిర్ధారణ చేసుకోవడం ఉత్తమమని చెప్పారు. ఒమిక్రాన్ మహమ్మారి విజృంభిస్తోందని.. షూటింగ్ లో ఉన్నవాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లో పాల్గొనాలని చెప్పారు.
ఇదిలా ఉండగా.. సినీ కార్మికులంతా కలిసి చిరుని ఓ రిక్వెస్ట్ చేసుకున్నారు. కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరని.. చిరుని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా వ్యవహరించాలని కోరారు. తమకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన ఉన్నారనే ధైర్యం ఉంటుందని కార్మికులు అన్నారు.
దానిపై స్పందించిన చిరు.. 'ఇండస్ట్రీ పెద్దరికం పదవిలో నేను వుండను. ఆ స్థానం నాకు వద్దు. అవసరం వస్తే ఒక బిడ్డగా తప్పకుండా అక్కడ వుంటాను. అందరి బాధ్యత తీసుకుంటాను. కానీ ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు వద్దు. ఇండస్ట్రీకి సమస్య ఉన్నా.. కార్మికులకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధంగా వుంటాను. అంతేకానీ.. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య వివాదం జరిగితే, ఆ తగువులు తీర్చాలని నా వద్దకు వస్తే నేను ఆ పంచాయితీ చేయను. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా సమగ్ర విశ్లేషణ చేసి వారి కోసం నిలబడతా' అంటూ చెప్పుకొచ్చారు.
Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..
Also Read:రెజీనాతో చిరు స్టెప్పులు.. 'సానా కష్టం' ప్రోమో చూశారా..?
Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?
Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు
Also Read: సంక్రాంతి రేసులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా 'డీజే టిల్లు'.
Also Read: ఆవకాయ్ సీజన్‌లో 'అంటే సుందరానికి'... చక్కిలిగింతల్ పెడుతుందని!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)