Aa Ammayi Gurinchi...: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు
సుధీర్ బాబు ఓ అమ్మాయి మెడపై ముద్దు పెట్టారు. రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్ కోసం! ఆ అమ్మాయి ఎవరో కృతీ శెట్టి. వీళ్లిద్దరి లుక్ చూశారా?
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అని హీరో సుధీర్ బాబు అంటున్నారు. ఆ అమ్మాయి ఎవరని అనుకుంటున్నారా? కృతీ శెట్టి! వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. 'సమ్మోహం', 'వి' సినిమాల తర్వాత సుధీర్ బాబు, ఇంద్రగంటి కలయికలో హ్యాట్రిక్ సినిమా ఇది. జనవరి 1న సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
కృతీ శెట్టి మెడపై సుధీర్ బాబు రొమాంటిక్‌గా ముద్దు పెడుతున్న ఫోటోను 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. బ్లాక్ అండ్ వైట్‌లో లుక్ విడుదల చేయడం విశేషం. ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
View this post on Instagram
గాజులపల్లి సుధీర్ బాబు సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బి. మహేందర్ బాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, 'వెన్నెల' కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: సంక్రాంతి రేసులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా 'డీజే టిల్లు'.
Also Read: ఆవకాయ్ సీజన్‌లో 'అంటే సుందరానికి'... చక్కిలిగింతల్ పెడుతుందని!
Also Read: మహేష్ బాబు TO నయనతార, రాయ్ లక్ష్మి... దుబాయ్‌లో నూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన స్టార్స్!
Also Read: 'ఆర్ఆర్ఆర్' వాయిదా... మరో'సారీ'... సరైన సమయంలో వస్తామన్న రాజమౌళి టీమ్
Also Read: ఒక్క పోస్టర్, ఒక్క డేట్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్!
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి