Acharya: రెజీనాతో చిరు స్టెప్పులు.. 'సానా కష్టం' ప్రోమో చూశారా..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' సినిమాలో ఐటెం సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో తెరకెక్కుస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఫిబ్రవరి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను, టీజర్లను విడుదల చేశారు.
తాజాగా ఈ సినిమా నుంచి 'సానా కష్టం' అనే మరో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇదొక ఐటెం సాంగ్ అని తెలుస్తోంది. ఈ సాంగ్ లో నటి రెజీనాతో కలిసి స్టెప్పులేస్తూ కనిపించారు చిరంజీవి. మణిశర్మ మాస్ బీట్ కి చిరు స్టెప్పులు అదిరిపోయాయి. రేపు సాయంత్రం(జనవరి 3) 4:05 గంటలకు పూర్తి పాటను విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావడం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి సినిమాలను తీయడంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
Boss-uu nee grace-uu 🤩🤩
— Matinee Entertainment (@MatineeEnt) January 2, 2022
Here's #SaanaKastam Song Promo 💥💥
▶️ https://t.co/o9DR7oeX5S
Full song out tomorrow at 4:05 PM 🤘#Acharya#AcharyaOnFeb4th
Megastar @KChiruTweets #SivaKoratala @ReginaCassandra #ManiSharma @bhaskarabhatla @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/coPobmOtFa
Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?
Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు
Also Read: సంక్రాంతి రేసులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా 'డీజే టిల్లు'.
Also Read: ఆవకాయ్ సీజన్‌లో 'అంటే సుందరానికి'... చక్కిలిగింతల్ పెడుతుందని!
Also Read: మహేష్ బాబు TO నయనతార, రాయ్ లక్ష్మి... దుబాయ్‌లో నూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన స్టార్స్!
Also Read: 'ఆర్ఆర్ఆర్' వాయిదా... మరో'సారీ'... సరైన సమయంలో వస్తామన్న రాజమౌళి టీమ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి