Dhruv Vikram: హీరోయిన్ తో విక్రమ్ కొడుకు ప్రేమాయణం.. ఇద్దరూ ఒకే హోటల్ లో..
ధృవ్, బనిత చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఫారెన్ ట్రిప్ కి వెళ్లడంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని బలంగా వార్తలొస్తున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ బాల దర్శకత్వంలో హీరోగా పరిచయం కావాల్సింది. 'అర్జున్ రెడ్డి' రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ సినిమా పూర్తయిన తరువాత ప్రోమోలు చూసి అందరూ విమర్శించారు. విక్రమ్ కి కూడా ఆ వెర్షన్ నచ్చకపోవడంతో మొత్తం సినిమాను పక్కన పడేసి మళ్లీ ఫ్రెష్ గా సినిమాను తీశారు. 'అర్జున్ రెడ్డి' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన గిరీశయ్య సినిమాను డైరెక్ట్ చేశారు.
ప్రస్తుతం ధృవ్ తన తండ్రితో కలిసి 'మహాన్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ధృవ్ తన ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. తన తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ బనిత సంధుతో అతడు ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 'ఆదిత్య వర్మ' సినిమా విడుదలై రెండేళ్లు దాటేసినా.. ఇప్పటికీ ధృవ్, బనిత చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఫారెన్ ట్రిప్ కి వెళ్లడంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని బలంగా వార్తలొస్తున్నాయి.
న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఈ జంట దుబాయ్ కి వెళ్లింది. అక్కడే బుర్జ్ ఖలీఫాకు దగ్గర్లో ఒక హోటల్ లో ఉండి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. హోటల్ గది నుంచి బనిత బుర్జ్ ఖలీఫాను చూస్తున్న వీడియోను ధృవ్ స్వయంగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ధృవ్, బనిత ప్రేమలో ఉన్నట్లు ఫిక్సయిపోయారు.
మొత్తానికి న్యూ ఇయర్ సందర్భంగా వారు రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పకనే చెప్పారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ధృవ్, బనితల ఫొటోలను రీట్వీట్ చేస్తూ పలు ప్రశ్నలు అడుగుతున్నారు అభిమానులు. ఇక బనిత 'ఆదిత్య వర్మ' సినిమా తరువాత తమిళంలో మరో సినిమా చేయలేదు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ సినిమా 'సర్ధార్ ఉద్దమ్'లో కీలకపాత్రలో కనిపించింది.
🎶That should be me that should be me🎶 https://t.co/5Cvb8lBLjj
— vaishhh🧋 (@wtfvaishstop) January 1, 2022
Also Read:ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా..
Also Read:లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..
Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి