Arjun Kapoor: ఆంటీతో లవ్ ఎఫైర్.. ట్రోలింగ్ పై హీరో ఘాటు రియాక్షన్..
తొలిసారి తమపై జరుగుతోన్న ట్రోలింగ్ పై స్పందించారు హీరో అర్జున్ కపూర్.
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ చాలా ఏళ్లుగా నటి మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్నాడు. అయితే వీరిద్దరికీ వయసులో చాలా గ్యాప్ ఉంది. మలైకాకు 48 ఏళ్లు కాగా.. అర్జున్ కపూర్ కి 36 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య పన్నెండేళ్ల తేడా ఉంది. అవేమీ పట్టించుకోకుండా ఈ జంట తమ లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కానీ వీరి ప్రేమపై తరచూ ట్రోల్స్ వస్తుంటాయి. ఆంటీని ప్రేమించడం ఏంటంటూ.. చాలా మంది అర్జున్ ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటారు.
మొన్నామధ్య మలైకా పుట్టినరోజు సందర్భంగా అర్జున్ ఓ ఫొటో షేర్ చేసి విషెస్ చెప్పాడు. ఆ ఫొటోలో మలైకా.. అర్జున్ నుదిటిపై ముద్దు పెడుతూ కనిపించింది. ఈ ఫొటోనైతే ఏకంగా తల్లీ కొడుకులతో పోల్చారు నెటిజన్లు. ఇలాంటి కామెంట్స్ ను అర్జున్, మలైకా చూసి చూడనట్లుగా వదిలేశారు. ట్రోలింగ్ పై ఎప్పుడూ స్పందించింది లేదు. ఎంత ట్రోలింగ్ చేస్తున్నా.. ఈ జంట మాత్రం తమ ఫొటోలను షేర్ చేస్తూ ఒకపై ఒకరికున్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
అయితే తొలిసారి తమపై జరుగుతోన్న ట్రోలింగ్ పై స్పందించారు హీరో అర్జున్ కపూర్. ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ.. 'నాకు తెలిసి ఇలాంటి వ్యాఖ్యలపై రెస్పాన్స్ కోరుకునేది మీడియా మాత్రమే' అంటూ కౌంటర్ వేశారు. ఆ తరువాత ఇలాంటి ట్రోలింగ్ ని పెద్దగా పట్టించుకోమని.. అవన్నీ నిజం కాదని అన్నారు. అందుకే చాలా వరకు ఫేక్ ఉంటాయని.. ట్రోలింగ్ చేసేవాళ్లే నేను కలిసినప్పుడు సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారని.. కాబట్టి దాన్ని నమ్మలేమని అన్నారు.
తన వ్యక్తిగత జీవితంలో ఏదైనా చేస్తానని.. అది తన హక్కు అని చెప్పుకొచ్చారు. తన పనికి తగ్గ గుర్తింపు లభిస్తే చాలని అన్నారు. ఎవరు వయసు ఎంత అనే దాని గురించి అంతగా బాధ పడాల్సిన అవసరం లేదని.. ఎవరి లైఫ్ వారు జీవించాలని చెప్పారు. వయసుని చూసి రిలేషన్షిప్ లో దిగడమనేది పిచ్చితనమని చెప్పుకొచ్చారు. మలైకాకు ఇదివరకే అర్భాజ్ ఖాన్ తో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ మలైకా తన భర్తతో విడిపోయింది. తన కొడుకు కోసం అప్పుడప్పుడు అర్భాజ్ ను కలుస్తుంటుంది.
Also Read: హీరోయిన్ తో విక్రమ్ కొడుకు ప్రేమాయణం.. ఇద్దరూ ఒకే హోటల్ లో..
Also Read:ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా..
Also Read:లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..
Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి