Radhe Shyam: 'రాధే శ్యామ్'ను డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేస్తారా? ఆడియన్స్‌ను మోసం చేయడమేనా?
'రాధే శ్యామ్'ను థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేస్తారా? దీనిపై దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఏమంటున్నారు?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే' సినిమాను కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో విడుదల చేశారు. అలాగే, 'పే పర్ వ్యూ' పద్ధతిలో 'జీ ప్లెక్స్' ఓటీటీలో కూడా విడుదల చేశారు. ఎందుకంటే... 'రాధే' విడుదల అయిన సమయంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూసి ఉన్నాయి. కొన్ని చోట్ల 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లలో ప్రదర్శనలు నడిచాయి. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. అందుకని, 'రాధే శ్యామ్'ను ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది.
'రాధే శ్యామ్' వాయిదా పడుతుందని వస్తున్న వదంతులను కనీసం రోజుకు ఒకసారి అయినా సరే టీమ్ మెంబర్స్ ఖండిస్తున్నారు. డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. ఓటీటీ నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయని విన్నామని దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌కు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురు అయ్యింది. అందుకు సమాధానంగా "ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే ఆడియన్స్‌ను మోసం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే... బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాలి. బిగ్ స్క్రీన్ మీద ఇన్‌స్ఫైర్ అవ్వాలి. థర్డ్ వేవ్ అనేది మన చేతుల్లో లేదు. దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. జాగ్రత్తగా చూసుకోవడానికి మాకు మంచి నిర్మాతలు దొరికారు" అని చెప్పారు.
Also Read: ఒక్క పోస్టర్, ఒక్క డేట్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రమిది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. సౌత్ వెర్షన్స్‌కు జస్టిన్ ప్రభాకరన్, హిందీ వెర్షన్స్‌కు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు.
Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?
Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..
Also Read: ఎన్టీఆర్ రెండు పడవల మీద అడుగులు వేస్తారా?
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
Also Read: 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేం మానాలిరా బాబూ!' - 'సుడిగాలి' సుధీర్ సెల్ఫ్ సెటైర్... అనసూయ ఈజ్ బ్యాక్!
Also Read: బాసూ... క్లాస్‌గా మెగాస్టార్ మాస్ స్టెప్పేస్తే? ఫుల్ సాంగ్ వచ్చేసింది... చూశారా?
Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి