NTR: ఎన్టీఆర్ రెండు పడవల మీద అడుగులు వేస్తారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకేసారి రెండు పడవల మీద అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారా? ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారా?
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీ రామారావు జూనియర్ చేయబోయే సినిమా ఏది? సందేశాత్మక కథలకు కమర్షియల్ హంగులు అద్ది సినిమాలు తీసే దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. 'జనతా గ్యారేజ్' తర్వాత మరోసారి యంగ్ టైగర్, కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాను ఏకకాలంలో చేయడానికి ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
'ఆర్ఆర్ఆర్' కోసం ఎన్టీఆర్ ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు కేటాయించారు. కరోనా కావచ్చు, మరో కారణం కావచ్చు... సినిమా చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు విడుదల కూడా ఆలస్యం అవుతోంది. అందుకని, ఇప్పుడు గ్యాప్ లేకుండా చకచకా సినిమాలు చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట. కొరటాల శివతో పాటు 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేయాలని యంగ్ టైగర్ అనుకుంటున్నారట.
'నాన్నకు ప్రేమతో' సినిమాకు సానా బుచ్చిబాబు దర్శకత్వ శాఖలో పని చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు ఓ కథ చెప్పారు. ఆ తర్వాత 'ఉప్పెన'తో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం కావడం, మంచి విజయం అందుకోవడం తెలిసిన విషయాలే. 'ఉప్పెన' తర్వాత ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఓ కథ రెడీ చేశారు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ కావడంతో... కొరటాల శివ సినిమాతో పాటు ఆ సినిమాను కూడా పట్టాలు ఎక్కించాలని అనుకుంటున్నారట. అయితే... ముందు కొరటాల శివ సినిమా స్టార్ట్ అవుతుంది. కొంత షూటింగ్ చేసిన తర్వాత... రెండు నెలలకు సానా బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అవుతుందట.
Also Read: రియల్ లైఫ్ ఎమ్మెల్యేతో రొమాన్స్ చేయబోతున్న కీర్తి సురేష్
'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా ఓకే చేశారు. అది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయనుంది.
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
Also Read: 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేం మానాలిరా బాబూ!' - 'సుడిగాలి' సుధీర్ సెల్ఫ్ సెటైర్... అనసూయ ఈజ్ బ్యాక్!
Also Read: బాసూ... క్లాస్‌గా మెగాస్టార్ మాస్ స్టెప్పేస్తే? ఫుల్ సాంగ్ వచ్చేసింది... చూశారా?
Also Read: 'రాధే శ్యామ్' నిర్మాతలకు కొత్త తలనొప్పి... రోజుకు ఓసారి ఆ మాట చెప్పాల్సిందేనా?
Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి