Karthika Deepam జనవరి 5 ఎపిసోడ్: మోనిత కొడుకుపై ప్రేమ పెంచుకుంటున్న డాక్టర్ బాబు, వంటలక్క.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 5 బుధవారం 124 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథ ఈ రోజు మరో మలుపు తిరిగింది. ఏం జరిగిందంటే…
మంగళవారం ఎపిసోడ్ లో రుద్రాణి మాటలకు భయపడిన కార్తీక్ ఊరంతా తిరిగి దీపని వెతుకుతాడు. బుధవారం ఎపిసోడ్ కార్తీక్ ఇంట్లో కూర్చుని ఆలోచించడంతో మొదలైంది. నా బాకీ తీర్చకపోతే నీ కూతుర్ని దత్తత తీసుకుంటానని, దీప పిల్లలు జాగ్రత్త అని రుద్రాణి మాటలు గుర్తుచేసుకుని కార్తీక్ బాధపడతాడు. ఇంతలో బాబుని చేతుల్లోకి తీసుకుంటూ ఇంత సేపు పడుకున్నాడేంటనుకుంటాడు. జ్వరం రావడంతో చన్నీళ్లతో వళ్లంతా తుడుస్తాడు. టెంపరేచర్ తగ్గేలా కనిపించడం లేదు..జ్వరం మందు వేయాల్సిందే, ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే .. నేను కూడా డాక్టర్ నే అనేసి..(కార్తీక్ నువ్వు పేషెంట్ ని చంపేశావ్ అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు). దీప ఎక్కడికి వెళ్లింది..ఊరంతా తిరిగాను ఎక్కడా కనిపించలేదు.. ఏమైనా చేసిందా అని ఆలోచించి వెతికేందుకు వెళుతుండగా దీప ఇంటికి వస్తుంది. ఏంటీ దీపా ఎంత టెన్షన్ పడుతున్నానో , ఏమయ్యావో, ఎవరేం చేశారో అని అంటాడు. పిండి వంటలు అమ్మేందుకు కొంచెం ఎక్కువ తిరిగాను, మీరెందుకు అలా భయపడుతున్నారంటుంది. ఆ రుద్రాణి అని ఏదో చెప్పబోయి ఆగిపోతాడు కార్తీక్. తనేదో అందని భయపడుతున్నారా, రుద్రాణి నన్నేం చేస్తుందంటుంది. ఇంతలో అక్కడకు పిల్లలు వచ్చి రుద్రాణి లంచ్ తీసుకొచ్చిందని అందుకే తినకుండా తొందరగా వచ్చేశాం అంటారు. ఆమె మాకెందుకు లంచ్ బాక్స్ తెస్తోందని ప్రశ్నించిన పిల్లలకు..మీరు తెలుసు కదా అందుకే తీసుకొచ్చిందేమో అని సర్దిచెబుతుంది.
Also Read: డాక్టర్ బాబు తమ్ముడిని 'బుజ్జి బంగారం' అంటూ వెంటపడుతోన్న మోనిత
దీప-కార్తీక్ ని వెతుకుతూ తాడికొండ గ్రామానికి వెళ్లిన బిచ్చగాడు కార్తీక్ ఫొటో చూసి ఎక్కడున్నారు సార్ అనుకుంటాడు. ఈ ఊర్లో వెతకడం అయిపోయింది ఇప్పుడు మరో ఊరు వెళ్లాలని అనుకుంటాడు. మరోవైపు బాబుకి జ్వరం వచ్చిందంటూ ఒళ్లు తుడుస్తున్నా అంటాడు. ఇవన్నీ మీకెలా తెలుసు అన్న దీపతో..నేను డాక్టర్ ని అనబోయి ఆగిపోతాడు. ఎవరో ఏదో అన్నారని పదిమందికీ ఉపయోగపడే వృత్తిని వదిలేసుకుంటే ఎలా అంటుంది. స్వామీజీ-పాము కథ చెబుతుంది..స్వామి చెప్పాడని కాటేయడం మానేసిన పాముని అంతా కొట్టేవారు.. మరో రోజు స్వామిజీ దగ్గరకు వెళ్లిన పాము నేను కాటేయడం మానేసినా అంతా కొడుతున్నారని అంటే.. కాటేయొద్దు అన్నా కానీ బుసకొట్టొద్దని చెప్పలేదు కదా అనే కథ చెబుతుంది. ఎన్నో గొప్ప ఆపరేషన్లు చేసిన మీ చేతిలో ఓ ప్రాణం పోయింది..దానికి కారణాలేవైనా జరిగిందేదో జరిగిపోయింది. మన కళ్లముందే శ్రీవల్లి-కోటేశ్ చనిపోయినా ఏం చేయలేకపోయాం. తెలియని వాటికి బాధ్యత వహించకపోయినా, కళ్లముందు కనపిస్తున్నవాటికైనా బాధ్యత వహించాలంటుంది దీప. డాక్టర్ ని కాదని మీకు మీరే చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు సమాధాన పర్చుకుంటున్నారు..ఎవరు అవునన్నా కాదన్నా డాక్టరే. తెలియన వంద తప్పులు చేయొచ్చు కానీ తెలిసి ఒకతప్పు చేయడం పాపం అని క్లాస్ వేసి బాబుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తా అంటుంది. ఇంతలో కార్తీక్ బాబుకి అవసరమైన మందులు చీటీ రాసిచ్చి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు.
Also Read: దీపని రుద్రాణి ఏం చేసింది, కార్తీక్ కంగారులో అర్థం ఉందా.. కార్తీకదీపం మంగళవారం ఏం జరిగిందంటే..
ఫొటో బయట విసిరేయకుండా స్టోరూంలో పెట్టావ్.. ఆ ఫొటో మోనిత వచ్చి తీసుకెళ్లిందని ఆదిత్యకు చెబుతుంది సౌందర్య. అసలే బస్తీలో ఇల్లు కొనుక్కుని ఆసుపత్రి పెట్టింది కదా ఆ ఫొటో తీసుకెళ్లి ఏం చేస్తుందో అంటుంది సౌందర్య. అమ్మా ఆ మోనిత గురించి ఎక్కువ భయపడుతున్నావు..అన్నయ్య ఆచూకీ కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నా అంటాడు ఆదిత్య. అన్నయ్య వాళ్లు కావాలని మనకు దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు కాబట్టి దొరకలేదు కానీ లేదంటే ఇప్పటికే పట్టుకునే వారం అంటాడు. మోనిత వల్ల కొత్తగా జరగాల్సిన నష్టం ఏమీలేదు..మోనితని మరిచిపో అంటాడు ఆదిత్య. కట్ చేస్తే సీన్ ప్రజా వైద్యశాలలో ఓపెనైంది. నర్సమ్మా అంటూ అరుచుకుంటూ వచ్చిన మోనిత..వారణాసిని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నర్సమ్మని బయటకు పంపించాం అన్న వారణాసి..ఎవ్వరు వచ్చినా పంపించేస్తామని..మీ ఆటలు ఇక్కడ సాగవని హెచ్చిరిస్తాడు. మీకు మా బస్తీవాళ్లగురించి పూర్తిగా తెలిసినట్టు లేదని హెచ్చరించి వెళ్లిపోతాడు వారణాసి.
Also Read: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్
అన్నం తింటున్న పిల్లలు..అమ్మా తమ్ముడికి కూడా పెట్టవా అని అడుగుతారు. అప్పుడే పెట్టకూడదని చెబుతుంది. మనకే తినడానికి ఇబ్బంది అంటే ఓ బాబుని పెంచుకుంటున్నారని అంటున్నారని చెబుతుంది శౌర్య. మన చుట్టూ ఉన్న వాళ్లవాళ్లంతా మన ఎదురుగా మాట్లాడరు..వెనకే మాట్లాడతారు. అడవిలో సింహంలా బతకాలి..జంతువులు ఏం మాట్లాడుకున్నా పట్టించుకోకూడదంటుంది దీప. ఈ వయసులోనే వీడు తల్లిదండ్రులును పోగొట్టుకుని మనకు దగ్గరయ్యాడు..మన దగ్గరే ఉంటాడు ఎవరేమన్నా పట్టించుకోవద్దు..మన కుటుంబంలో సభ్యుడు అంటుంది దీప. ఎపిసోడ్ ముగిసింది...
Also Read: వసుధార విషయంలో గౌతమ్ కి షాకిచ్చిన రిషి, సర్ ప్రైజ్ చేసిన గౌతమ్..గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
Also Read: రుద్రాణికి కార్తీక్ వార్నింగ్, అప్పు తీర్చకపోతే కథ వేరే ఉంటదన్న రుద్రాణి.. ‘కార్తీకదీపం’ అప్ డేట్స్..
Also Read: సీతాకోక చిలుకల్లా రెండు మనసులు ఊగిన నెమలి ఈక ఉయ్యాల, గుప్పెడంత మనసు ఎపిసోడ్ అంతా ప్రేమమయం..
Also Read: వసుపై ప్రేమతో ప్లేట్ ఫిరాయించిన రిషి, మహేంద్ర క్లాస్-జగతి షాక్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి