Guppedantha Manasu జనవరి 6 ఎపిసోడ్: వసుధార కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… అయోమయంలో జగతి-మహేంద్ర… గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
వసుని ప్రేమలో పడేసేందుకు గౌతమ్ ప్రయత్నిస్తుంటే సతమతమైన రిషి..ఇప్పుడు తన ప్రేమను బయటపెట్టేందుకు ఓ అడుగు ముందుకేశాడు. ఏకంగా రోమియో జూలియట్ బుక్ ప్రజెంట్ చేశాడు. గుప్పెడంత మనసు జనవరి 6 గురువారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు జనవరి 6 గురువారం ఎపిసోడ్
కాలేజీ లైబ్రరీలో
వసుధార లైబ్రరీలో ఉందని తెలిసి అక్కడకు వెళ్లి గట్టిగా మాట్లాడుతున్న గౌతమ్ తో సైలెంట్ అంటుంది వసుధార. సైలెంట్ గా ఉండటం కష్టం వసుధార, ఎంత పనిష్మెంట్ అయినా తీసుకుంటా కానీ సైలెన్స్ మాత్రం నా వల్లకాదన్న గౌతమ్..నువ్వెళ్లి నేను చెప్పిన బుక్ వెతుకు అంటాడు. మీరు రిషి సర్ ఫ్రెండ్ అన్న గౌరవంతోనే ఈ బుక్ వెతుకున్నా..సైలెన్స్ ప్లీజ్ అని పేపర్ పై రాసిస్తుంది. అది చదివిన గౌతమ్..బయటకు శబ్దం చేయకపోయినా మనసులో విచ్చలవిడిగా గోల చేస్తా అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వెళ్లిన రిషి..గౌతమ్ ని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. సైలెన్స్ అని వేలు చూపిస్తాడు గౌతమ్. ఇంతలో వసుధార రాసిన పేపర్ చూసిన రిషి..నన్ను ఇలా కూడా వాడుకుంటున్నావా అంటాడు. ఇంతలో బుక్ తీసుకొస్తున్న వసుని చూసుకోకుండా డ్యాష్ ఇచ్చిన రిషి..ఆమె పడిపోకుండా పట్టుకుంటాడు. గౌతమ్ ది ప్రేక్షకపాత్రే. కింద పడిన బుక్ తీసి ఏంటిది అని అడిగిన రిషితో.. రోమియో జూలియట్ అందమైన ప్రేమకథ అని చెబుతాడు గౌతమ్. వసుకి ఈ పనులు చెబుతావా అంటే..కాలేజీ యానవర్సిరీకి ఓ నాటకం కావాలని అడిగావ్ కదా అని కవర్ చేస్తాడు. నువ్వు క్లాసుకి వెళ్లు వసుధార అని పంపించేస్తాడు. గౌతమ్ ని తన క్యాబిన్లో కూర్చోమంటాడు.
Also Read: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
జగతి-మహేంద్ర
జగతి-మహేంద్రని చూసి వాళ్ల క్యాబిన్లోకి వెళతాడు గౌతమ్. రిషి ఎక్కడ అని మహేంద్ర అడగడంతో క్లాస్ తీసుకుంటున్నాడని చెబుతాడు గౌతమ్. నన్ను కూడా స్టూడెంట్ లా చూస్తున్నాడు అంకుల్ అంటాడు. రిషితో నేను పడలేకపోతున్నా..తనతో మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారో తెలీదు..ఓ పట్టాన అర్థంకాడు అంటాడు గౌతమ్. నా సుపుత్రుడు ఎప్పుడెలా ఉంటాడో నాకే అర్థం కాలేదు.. నీకెలా తెలుస్తుంది గౌతమ్ అంటాడు మహేంద్ర. ఇంట్లో ఒకలా, కార్లో ఒకలా, కాలేజీలో ఇంకోలా..ఇలా అయితే ఎలా ..అప్పుడే ప్రేమ చూపిస్తాడు..అప్పుడే సీరియస్ అవుతాడు అంటాడు గౌతమ్. ఇంతలో మధ్యలో మాట్లాడిన జగతి.. ఇక్కడ లేని ఎండీగారి గురించి మాట్లాడటం సరికాదేమో అనడంతో.. గౌతమ్ మనసుల రిషిని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గౌతమ్ తీరు చూస్తుంటే రిషికి కొత్త తలనొప్పి పెట్టేలా ఉన్నాడన్న జగతితో.. రిషికి తనకు తానే పెద్ద తలనొప్పి అని సమాధానం ఇస్తాడు. నా కొడుకుని విమర్శించొద్దు..సమస్యకి పరిష్కారం చూడాలి అంటుంది జగతి. తన మనసులో ఏముందో తెలియదు..చెప్పడన్న మహేంద్రతో.. రిషి మనసు తెలుసుకోవడం బాధ్యత అనిపించలేదా అని క్వశ్చన్ చేస్తుంది. గౌతమ్ ని వాడుకుని రిషి మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు మహేంద్ర.
Also Read: వసుధారపై ప్రేమను బయటపెట్టే ప్రయత్నాల్లో రిషి, మరి గౌతమ్ సంగతేంటి..గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
వసు-రిషి-గౌతమ్
చేతిలో రోమియో, జూలియట్ బుక్ తోనే క్లాస్ కి వస్తాడు రిషి. చేతిలో రోమియో జూలియట్ బుక్ చూపిస్తూ..ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశం అని మాట్లాడతాడు. అంతా వింతగా చూస్తుండడం గుర్తించిన రిషి చేతిలో బుక్ చూసుకుని ... సరే ఇదే క్లాస్ చెప్పేద్దాం అనుకుంటాడు. కాలేజీ యానివర్శిరీలో దీన్ని నాటకంగా ప్లే చేద్దాం అనుకుంటున్నా అని కవర్ చేస్తాడు. వసుధారని పిలిచి ఇది నీకోసం అని బుక్ ఇస్తాడు. కట్ చేస్తే కాలేజీలో మెట్లపై కూర్చుని బుక్ ఓపెన్ చేసిన వసుధార..సర్ నాకెందుకు ఇచ్చారో అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి..ప్రేమంటే ఏంటో అర్థమైందా అని అడుగుతాడు. షాక్ అయిన వసుని చూసి..అదే ఆ బుక్ లో అంటాడు. ఇంకా చదవలేదు అన్న వసుతో..చదవమనే కదా ఇచ్చింది..చదివి చెప్పు అంటాడు. ఇంగ్లీష్ నాటకాలు కన్నా తెలుగు నాటకాలు గొప్పవి ఉన్నవి కదా అంటుంది. అదే సమయానికి అక్కడకు వచ్చిన గౌతమ్.. రోమియో-జూలియట్, దేవదాసు-పార్వతి, లైలా-మజ్ను, సలీమ్-అనార్కలి వీళ్లందరిలో కామన్ విషయం ఏంటో తెలుసా 'ప్రేమ' అంటాడు గౌతమ్. ఏంట్రా నీగోల అన్న రిషితో..ఇదేం లైబ్రరీ కాదంటాడు గౌతమ్. ఈ బుక్ ని నేను పాతికసార్లు చదివి ఉంటా అంటాడు. ఎపిసోడ్ ముగిసింది
రేపటి ఎపిసోడ్ లో
వసుధార ఏం చేస్తున్నావ్ అని కాల్ చేస్తాడు రిషి. మొక్కలకి నీళ్లు పడుతున్న వసు..చదువుకుంటున్నా అని చెబుతుంది..ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన రిషి వాటర్ కావాలని అడుగుతాడు. అదే సమయానికి అక్కడకు వచ్చిన మహేంద్ర ...రిషి నువ్వేంటి ఇక్కడ అంటూ..జగతిని పిలిచి వాటర్ కావాలని అడుగుతాడు. అప్పుడే వచ్చిన గౌతమ్..అందర్నీ చూసి షాక్ అవుతాడు. రియాక్టైన జగతి నీక్కూడా వాటర్ కావాలా అంటుంది. చూస్తుంటే రేపటి ఎపిసోడ్ ఫన్నీగా ఉండేట్టుంది...
Also Read: మోనిత కొడుకుపై ప్రేమ పెంచుకుంటున్న డాక్టర్ బాబు, వంటలక్క.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
Also Read: డాక్టర్ బాబు తమ్ముడిని 'బుజ్జి బంగారం' అంటూ వెంటపడుతోన్న మోనిత
Also Read: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్
Also Read: వసుధార విషయంలో గౌతమ్ కి షాకిచ్చిన రిషి, సర్ ప్రైజ్ చేసిన గౌతమ్..గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి