అన్వేషించండి
Advertisement
Deepthi Sunaina: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
రీసెంట్ గా లైవ్ లో తన అభిమానులతో మాట్లాడింది దీప్తి సునైనా. ఈ క్రమంలో షణ్ముఖ్ తో బ్రేకప్ గురించి ప్రశ్నించారు నెటిజన్లు.
యూట్యూబ్ వీడియోలు, షార్ట్స్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన దీప్తి సునైనా, షణ్ముఖ్ దాదాపు ఐదేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. మొదట్లో తన గేమ్ తో అందరినీ ఆకట్టుకున్న షణ్ముఖ్.. ఆ తరువాత హౌస్ మేట్స్ లో సిరికి బాగా క్లోజ్ అయిపోయాడు. హౌస్ లో వారిద్దరే కలిసి ఉండేవారు. ఇక హగ్గులు, ముద్దుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ.. షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి అతడిని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టేది. షణ్ముఖ్ పై ట్రోలింగ్ జరిగినప్పుడు కూడా ఒక టీవీ షో చూసి అతడి క్యారెక్టర్ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.
షణ్ముఖ్ హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత దీప్తితో అతడికి బ్రేకప్ అయిందంటూ వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లే దీప్తి తనను బ్లాక్ చేసిందని ఇన్స్టాగ్రామ్ లైవ్ లో చెప్పాడు షణ్ముఖ్. దీంతో నెటిజన్లు బ్రేకప్ నిజమేనని ఫిక్సయిపోయారు. ఇక ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఓ పెద్ద లెటర్ పోస్ట్ చేసింది దీప్తి. షణ్ముఖ్ కూడా లవ్ బ్రేకప్ పై అంతే ఎమోషనల్ గా స్పందించాడు.
దీపుకి నిర్ణయం తీసుకునే హక్కు ఉందని.. ఈ ఐదేళ్లలో తను బెటర్ పెర్సన్ గా మారడానికి దీపు ఎంతో హెల్ప్ చేసిందని.. ఆమె ఎప్పటికీ సంతోషంగా ఉండాలంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చాడు. ఇక రీసెంట్ గా లైవ్ లో తన అభిమానులతో మాట్లాడింది దీప్తి సునైనా. ఈ క్రమంలో షణ్ముఖ్ తో బ్రేకప్ గురించి ప్రశ్నించారు నెటిజన్లు.
దానిపై స్పందించిన దీప్తి.. 'నేను నా లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నా లైఫ్, కెరీర్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు నా కెరీర్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. నన్ను నేను ప్రేమించుకోవాలి. నా గురించే నేను ఆలోచించాలనుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. లైవ్ చేసినంత సేపు కూడా దీప్తి కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూనే ఉంది. ఇక బ్రేకప్ గురించి మాట్లాడిన తరువాత మరింత ఎమోషనల్ అయింది. వెంటనే లైవ్ ఆపేసి వెళ్లిపోయింది.
Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..
Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..
Also Read:రెజీనాతో చిరు స్టెప్పులు.. 'సానా కష్టం' ప్రోమో చూశారా..?
Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion