అన్వేషించండి

Varanasi Update : మహేశ్ 'వారణాసి' షూటింగ్ అప్డేట్ - మంచు కొండల్లో బిగ్ ఫైట్

Varanasi Movie : మహేశ్ బాబు 'వారణాసి' మూవీ షూటింగ్ ప్రస్తుతం అంటార్కిటికాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఇది మూవీకే హైలెట్ అని సమాచారం.

Mahesh Babu's Varanasi New Schedule : యావత్ సినీ ప్రపంచం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న విజువల్ వండర్ 'వారణాసి'. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతోన్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌తోనే హాలీవుడ్ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది.

అంటార్కిటికా షెడ్యూల్

రీసెంట్‌గా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన హింట్‌తో 'వారణాసి' నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో జరుగుతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. 'ది బ్లఫ్' మూవీపై ప్రశంసలు కురిపిస్తూ మహేశ్ బాబు ట్వీట్ చేయగా... ప్రియాంక ఆయనకు థాంక్స్ చెబుతూ... 'త్వరలో అంటార్కిటికాలో కలుద్దాం' అంటూ రిప్లై ఇచ్చారు. జార్జీయా షెడ్యూల్ తర్వాత అంటార్కిటికాలో కీలక సీన్స్ షూట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

స్పెషల్ అట్రాక్షన్

సినిమాలో భారీ యాక్షన్ సీన్ మంచు కొండల్లో షూట్ చేశారట. ఈ ఫైట్ మూవీకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని చెబుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ అంటార్కిటికా మంచు కొండలను చూపించి హైప్ క్రియేట్ చేశారు. సృష్టి ఆవిర్భావం నుంచి వారణాసి నగరం పుట్టుక, రామాయణంలో ఓ ముఖ్య ఘట్టంతో పాటు ప్రపంచ యాత్ర చేసే ఓ సాహసికుడు కథగా 'వారణాసి'ని తెరకెక్కిస్తున్నారు. అన్నీ కాలాలు, యుగాలను కలిపి విజువల్ వండర్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

షూటింగ్ అప్డేట్ ఏంటంటే?

ఇప్పటికే 14 నెలల షూటింగ్ పూర్తైనట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రియాంక చోప్రా. మరో 6 నెలల షూటింగ్ చేస్తే మూవీ కంప్లీట్ అవుతుందని అన్నారు. రామాయణం కీలక ఘట్టం సహా ఇతర సీన్స్ చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తుండగా... మిగిలిన సీన్స్ కూడా త్వరగా పూర్తి చేసి VFX, ఇతర పనులపై ఫోకస్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

ఓవర్సీస్ రైట్స్... బిగ్ ఆఫర్   

ఓ వైపు మూవీ షూటింగ్ జరుగుతుండగానే... మరోవైపు బిజినెస్ కూడా అంతే వేగంగానే జరుగుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఓటీటీ డీల్ కోసం బిగ్ కాంపిటీషన్ నెలకొనగా... ఓవర్సీస్ హక్కుల కోసం దాదాపు రూ.160 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అన్నీ ఇండియన్ భాషలకు కలిపి ఈ రేంజ్ ధర పలకడం ఓ రికార్డ్.

'వారణాసి' కోసం ఏడాది ముందు నుంచే మహేశ్, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అవి పూర్తిగా మొదలు కాక ముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం విశేషం. ఇక రాబోయే రోజుల్లో థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ - వయలెన్స్‌తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ వేరే లెవల్

మూవీలో రుద్రుడిగా మహేశ్, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణ కుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శివ భక్తుడిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో 2027 ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Leaked : ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
LIK Review Telugu - లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ: హ్యాట్రిక్ తర్వాత... ప్రదీప్ రంగనాథన్ సినిమా హిట్టా? ఫట్టా?
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ: హ్యాట్రిక్ తర్వాత... ప్రదీప్ రంగనాథన్ సినిమా హిట్టా? ఫట్టా?
Vaazha 2 OTT : పది కోట్ల బడ్జెట్... వంద కోట్ల కలెక్షన్స్ - స్టార్ హీరోస్ లేని బ్లాక్ బస్టర్ 'వాజా 2'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పది కోట్ల బడ్జెట్... వంద కోట్ల కలెక్షన్స్ - స్టార్ హీరోస్ లేని బ్లాక్ బస్టర్ 'వాజా 2'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sambhavam Adhyayam Onnu OTT : అడవిలో శవం... కాకి ఆకారంలో మిస్టరీ టెంపుల్ - ఓటీటీలోకి మలయాళం థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
అడవిలో శవం... కాకి ఆకారంలో మిస్టరీ టెంపుల్ - ఓటీటీలోకి మలయాళం థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Ayushman Bharat Card Apply: కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Dacoit OTT : అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Hyderabad Drug Tests: హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
Danam Nagender: జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయంతో రాజ్యసభ స్థానం వదులుకున్నారు: దానం నాగేందర్
జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయంతో రాజ్యసభ స్థానం వదులుకున్నారు: దానం నాగేందర్
DA for RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదల, జనవరి 1 నుంచి అమల్లోకి
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదల, జనవరి 1 నుంచి అమల్లోకి
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
Embed widget