RGV Kodali : కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు
తనకు మంత్రి కొడాలి నాని ఎవరో తెలియదని.. తనకు తెలిసిందన్నా హీరో నాని మాత్రమేనని ఆర్జీవీ ట్వీట్ చేశారు. గతంలో మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇది ఉండటంతో ట్వీట్ వైరల్ అవుతోంది.
రామ్ గోపాల్ వర్మతో వాదన పెట్టుకుంటే ఇక మొత్తం వదిలేసుకోవాల్సిందే. దాచుకోవడానికి ఏమీ లేకుండా చేస్తాడు. అందుకే ఆయనతో పెట్టుకోవడానికి చాలా మంది వెనుకాడతారు. అయితే ఇప్పుడు తప్పని సరి పరిస్థితి ఏపీ ప్రభుత్వంలోని కొంత మంది ఆయనతో వాదన పెట్టుకుంటున్నారు. అదీ కూడా టిక్కెట్ల విషయంలో. మంత్రి పేర్ని నానికి... ఆయనకు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఈ వార్‌లో నాని డ్రైవర్‌కూ.,., నానికీ తేడా లేదా అని ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A P టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ @NameisNani ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
అంతటితో ఆపేస్తే ఆర్జీవీ ఎందుకవుతారు. వోడ్కా పెగ్గు పెగ్గుకి ఓ ట్వీట్ వేస్తున్నారు. తాజా ఆయన వేసిన ట్వీట్ .. రివర్స్ పంచ్ లెవనల్లో .. సినిమాలపై సెటైర్లు వేసిన వైఎస్ఆర్‌సీపీ నేతలకు తగలడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా టిక్కెట్ల అంశంపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని తనను అడుగుతున్నారని.. కానీ తనకు నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసని.. ఇంకే నాని తెలియదని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!
కొద్ది రోజల క్రితం శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల సందర్భంగా టిక్కెట్ల అంశంపై హీరో నాని స్పందించారు. ధియేటర్ యజమానుల కన్నా ఆ ధియేటర్ ఎదురుగా ఉండే కిరాణా దుకాణ యజమానికి ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. దీనిపై వైఎస్ఆర్‌సీపీ మంత్రులు రకరకాలుగా స్పందించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే.. తనకు ఒక్క కొడాలి నాని మాత్రమే తెలుసని ఆయన పాపులర్ అని.. ఇంకే నాని తెలియదని అనేశారు. ఆయనమాటలు వైరల్ అయ్యాయి.
Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు
ఇప్పుడు రివర్స్ లో రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్‌సీపీ నేతలకు.. మంత్రులకు ఇచ్చిన కౌంటర్ స్ట్రాంగ్ డోస్‌లాగా కనిపిస్తోంది. మంత్రి అనిల్ మాటల్లో చెప్పాలంటే బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింటని.. ఇప్పుడది ఆర్జీవీ చేసి చూపించారని నెటిజన్లు రియాక్టవుతున్నారు. ఎంతైనా ఆర్జీవీ మార్క్ అంతే మరి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి