Jana Nayagan Release Date : విజయ్ జన నాయగన్ సెన్సార్ అప్డేట్ - మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Jana Nayagan : విజయ్ జన నాయగన్ మూవీ సెన్సార్ వర్క్స్‌లో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఆ పనులు పూర్తి కాగానే సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Thalapathy Vijay Jana Nayagan To Censor Soon : కోలీవుడ్ స్టార్, ఇళయ దళపతి విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్ కోసం ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోర్టు కేసులను వెనక్కి తీసుకున్న మూవీ టీం సెన్సార్ బోర్డు సూచనల మేరకు రివైజింగ్ కమిటీకి పంపింది. తాజాగా దీనిపై బిగ్ అప్డేట్ వచ్చింది.
సెన్సార్ అప్పుడేనా?
ఈ మూవీ సెన్సార్ ఈ నెల 9న మధ్యాహ్నం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'జన నాయగన్' నిర్మాతలకు CBFC రివైజింగ్ కమిటీ నుంచి సమాచారం అందినట్లు టాక్ వినిపిస్తోంది. సెన్సార్ ప్రక్రియ పూర్తైన తర్వాత మేలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ అనుకుంటున్నారట. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Also Read : సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
ఈ మూవీ జనవరి 9నే రిలీజ్ కావాల్సి ఉండగా సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులతో వాయిదా పడింది. ఈ క్రమంలో కోర్టు కేసులను వెనక్కి తీసుకున్న ప్రొడ్యూసర్ సెన్సార్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మూవీని రివైజింగ్ కమిటీకి పంపాలన్న బోర్డు ఆదేశాల మేరకు అలాగే చేశారు. అన్నీ క్లియరెన్సులు వచ్చిన తర్వాత విజయ్ 52వ బర్త్ డే సందర్భంగా జూన్ 22న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు ప్రచారం సాగింది.
ఇప్పుడు సెన్సార్ పనులు ముందుకు కదలడంతో ఆ రోజు కంటే ముందుగానే మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అంటే మేలో 'జన నాయగన్' రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. యంగ్ హీరోయిన్ మమితా బైజు కూతురిగా నటించారు. వీరితో పాటే బాబీ డియోల్, నరైన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు.
ట్రెండింగ్ వార్తలు




















