Vijay Devarakonda: షూటింగ్ క్యాన్సిల్.. ఇంట్లోనే చిల్ అవుతోన్న రౌడీ హీరో..
పూరి జగన్నాథ్ తో 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా మొదలుపెట్టారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మొదలై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' లాంటి సినిమాలు విజయ్ రేంజ్ ని అమాంతం పెంచేశాయి. ఆ తరువాత కొన్ని ప్లాప్ లు వచ్చినా.. అవి విజయ్ పై ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. పూరి జగన్నాథ్ తో 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా మొదలుపెట్టారు విజయ్ దేవరకొండ.
ఈ సినిమా మొదలై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. కోవిడ్ కారణంగా ఈ సినిమా వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. తాజాగా మరోసారి షూటింగ్ క్యాన్సిల్ అయినట్లు వెల్లడించారు హీరో విజయ్ దేవరకొండ. 'క్లియర్ గా ఇది మరొక వేవ్ స్టార్మ్ అని తెలుస్తోంది.. షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఇంట్లోనే చిల్ అవుతున్నా' అంటూ ట్విట్టర్ వేదికగా ఓ ఫొటో షేర్ చేశారు.
ఇందులో తన డాగ్ తో కలిసి కనిపించారు విజయ్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల విడుదలైన 'లైగర్' సినిమా ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముంబై సిటీ నుంచి వచ్చిన స్లమ్ డాగ్ బాక్సర్ గా ప్రపంచ స్థాయికి ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థాయ్‌లాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు.
Apparently its another wave Storm.
— Vijay Deverakonda (@TheDeverakonda) January 7, 2022
Shoots cancelled. Back to us just chilling at home.. pic.twitter.com/mnJ2w1aGWy
Also Read: క్లాసులు షురూ.. ధనుష్ 'సార్' ఆన్ డ్యూటీ..
Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?
Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..
Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!
Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..
Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు





















