Ustaad Bhagat Singh OTT : పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ బిగ్ డీల్! - పవర్ స్టార్ మూవీ అంటే అట్లుంటది...
Ustaad Bhagat Singh OTT Platform : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ డీల్ లాక్ అయినట్లు తెలుస్తోంది. భారీ ధరకు ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫాం రైట్స్ సొంతం చేసుకుంది.

Pawan Kalyan's Ustaad Bhagat Singh OTT Deal Locked : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. సూపర్ హిట్ కాంబో కావడంతో బిగ్ హైప్ నెలకొంది. తాజాగా ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.
బిగ్ ఓటీటీ డీల్
'ఉస్తాద్ భగత్ సింగ్' డిజిటల్ రైట్స్ దాదాపు రూ.80 కోట్లకు సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంతకు ముందు 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఓటీటీ హక్కులను ఓన్ చేసుకుందనే టాక్ వినిపించినా ఫైనల్‌గా 'నెట్ ఫ్లిక్స్' భారీ ధరకు డీల్ క్లోజ్ చేసిందని తెలుస్తోంది. ఓ ప్రాంతీయ చిత్రానికి ఈ స్థాయిలో డిజిటల్ రైట్స్ సేల్ కావడం ఓ రికార్డనే చెప్పాలి.
ఈ మూవీలో వింటేజ్ పవన్ లుక్స్, స్టైలిష్ డ్యాన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. 'దేఖ్‌లేంగే సాలా' సాంగ్‌లో పవన్ స్టెప్స్‌ను వరల్డ్ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్‌తో పోలుస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీడియోస్ షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ కూడా వేరే లెవల్‌లో ఉంది. రియల్ పవనిజాన్ని చూపించేలా ఉన్న లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. పవర్ స్టార్ మేనరిజాన్ని సాంగ్‌లో అద్భుతంగా చూపించారు.
ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా... పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపించనుండగా... ఫోటోగ్రాఫర్ పాత్రలో రాశీ ఖన్నా కనిపించనుంది. నెగిటివ్ రోల్‌లో తమిళ సీనియర్ హీరో పార్తీబన్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా మార్చి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్, పవన్ కాంబోలో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించగా... ఇప్పుడు అంతే రేంజ్‌లో వస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్'పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.
























