అన్వేషించండి

Rashmika And Vijay Deverakonda: పండితులుండరు, వేదమంత్రాలుండవ్.. కొడవ సంప్రదాయంలో వివాహం ఎలా జరుగుతుంది?

What is the Kodava ceremony: విజయ్ దేవరకొండ - రష్మిక వివాహం ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది. ఇందులో తెలుగు సంప్రదాయం, కొడవ సంప్రదాయంలో వివాహం జరిగింది? కొడవ సంప్రదాయంలో వివాహం ప్రాసెస్ ఏంటి?

What is a Kodava wedding: హీరో హీరోయిన్, ప్రేమికులైన విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి ఉదయ్ పూర్ లో కన్నుల పండువగా జరిగింది. విజయ్ తెలుగు సంప్రదాయంలో ఉదయం, రష్మిక జన్మస్థలమైన కూర్గ్ లో అనుసరించే కొడవ సంప్రదాయంలో సాయంత్రం వివాహం జరిగింది

గీతగోవిందం మూవీలో మొదటిసారి నటించిన విజయ్ దేవరకొండ-రష్మిక ప్రేమలో పడ్డారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య అయిందని విజయ్... విజ్జూ నా జీవితంలో అన్నింటా నువ్వున్నావ్ అంటూ రష్మిక ప్రేమను వ్యక్తం చేశారు..తమ బంధాన్ని పరిచయం చేశారు. వివాహం సమయంలో హిందూ, కొడవ సంప్రదాయాలను అనుసరించడంతో కొడవ సంప్రదాయంలో వివాహం ఎలా జరుగుతుందో అనే ఆసక్తి నెటిజన్లలో నెలకొంది..

తెలుగు సంప్రదాయంలో వివాహం అందరకీ తెలిసిన విషయమే..

కొడవ సంప్రదాయంలో వివాహం పద్ధతేంటి?

కొడవ సంప్రదాయంలో వివాహాలు సాధారణ హిందూ వివాహాలకు భిన్నంగా ఉంటాయ్. ఇందులో పూజారులు ఉండరు, వేద మంత్రాలు వినిపించవ్, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు మాత్రమే ఉంటాయ్. యోధుల సంస్కృతి నుంచి వచ్చిన ఈ వివాహాలు చాలా సరళంగా, సంతోషంగా జరుగుతాయ్. పెళ్లి ఖర్చులు ఇరు కుటుంబాలవారు సమానంగా భరిస్తారు. 

కొడవ సంప్రదాయంలో వివాహాలు 2 రోజులు జరుగుతాయి
 
మొదటి రోజు ఊరుకూడవ అంటారు...రెండో రోజు ముహూర్తం ఉంటుంది
 
ఊరుకూడవలో భాగంగా రెండు కుటుంబాలు ఓచోట చేరి వివాహ స్థలాన్ని సిద్ధం చేస్తారు. కూరగాయలు, పందిమాంసం కట్ చేస్తారు. ఐదు కాళ్ల పండాల్ నిర్మిస్తారు. ఇందులో ఓ స్తంభాన్ని పాలు ఇచ్చే చెట్టు నుంచి తీసుకుంటారు. మామిడి ఆకులు, పనస ఆకులతో మండపాన్ని అలంకరిస్తారు. 
 
వధూవరులకు పసుపు, నూనె రాసి పవిత్ర జలంతో స్నానం చేయిస్తారు
 
వధువు సిల్క్ శారీ ప్రత్యేకంగా ధరిస్తుంది..ప్లీట్స్ వెనుకవైపు ఉంటాయి..ఇది యోధుల సంస్కృతి నుంచి వచ్చినది, బలం - సిద్ధతను సూచిస్తుంది. రెడ్ లేదా వైట్ రంగులు, గోల్డ్ బార్డర్లు ఉన్న చీరలు కట్టుకుంటారు. తలపై ముసుగు ఉంటుంది.  ఏడుగురు రుషులకు చిహ్నంగా వధువు ఏడు ఆభరణాలు ధరిస్తుంది. వరుడు తెల్లటి లాంగ్ స్లీవ్స్ ఉండే కుర్తా ధరిస్తాడు  

ముహూర్తం సమయానికి వధూవరుల కుటుంబ పెద్దలంతా ఆశీర్వదిస్తారు..వివాహం తంతు ముగుస్తుంది.వీరి భోజనంలో మాంసాహారం, మద్యం ఉంటుంది. తెలుగు వివాహాల్లో కేవలం శాఖాహారం ఉంటుంది కాబట్టి ఇది భిన్నం

వరుడు తాళి కట్టడు

హిందూవివాహాల్లో వరుడు వధువు మెడలో తాళి కట్టడం ప్రధాన ఆచారం కానీ కొడవ సంప్రదాయంలో వరుడు వధువు మెడలో తాళికట్టడు. ఇందుకు బదులుగా వధువు తల్లి పథక్ అనే బంగారు నాణెం ఉన్న చైన్ ను వధువు మెడలో వేస్తుంది. ఇది వారి సంప్రదాయంలో వివాహం అయిందని చెప్పేందుకు సూచన..అయితే వరుడు బదులు వధువు తల్లి కట్టడం ప్రత్యేకం
 

కొడవ యోధుల సంస్కృతి

కొడవులు లేదా కూర్గ్ ప్రజలు.. కర్నాటకలో కూర్గ్ ప్రాంతంలో నివసించే సమూహం. వీరు శతాబ్దాలుగా యోధుల సంస్కృతిని అనుసరిస్తారు వారి సంస్కృతి ధైర్యం, స్వతంత్రత, ప్రకృతి ఆరాధన, మార్షన్ ఆర్ట్స్ పై ఆధారపడి ఉంటుంది. భారత్ లో ఇతర సమూహాలతో పోలిస్తే కొడవులు చిన్న సమూహనం..అయినప్పటికీ వీరి యుద్ధ చరిత్ర, సైనిక సేవలు ప్రముఖమైనవి. కొందరు వారిని మొహెంజో-దారో, హరప్పా సంస్కృచి నుంచి వచ్చినవారిగా మరికొందరు ఇండో-సిథియన్ లేదా ద్రావిడియన్ వంశంగా భావిస్తారు. అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికులతో సంబంధం కలిగి ఉండొచ్చనేన వాదనలూ ఉన్నాయ్. వారు శత్రువుల నుంచి తమ ప్రాంతాన్ని రక్షించుకునేందుకు అడవుల్లో జీవించారని ఇది వారి ధైర్యసాహసాలకు మూలం అని చెబుతారు. భారత సైన్యంలో కొడవ సమాజం సేవలు అపారం...మొదటి ఆర్మీ చీఫ్ జనరల్ K.M.కారియప్ప కొడవే. భారత్ లో లైసెన్స్ లేకుండా ఆయుధాలు ధరించే అనుమతి ఉన్న సమూహాల్లో కొడవులు ఒకటి. వారి యోధ సంప్రదాయానికి చిహ్నం

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.


    
 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget