Vijay Deverakonda Rashmika Wedding : విజయ్ దేవరకొండ తాళి కట్టు శుభవేళ... రష్మిక ఎమోషనల్ - బెస్ట్ మూమెంట్ ఫర్ ఎవర్
Virosh Wedding : విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 12 గంటల్లోనే 2.5 కోట్ల లైక్స్ వచ్చాయి. రష్మిక ఎమోషనల్ ఫోటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Moments : స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక గురువారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇరువురూ తమ కుటుంబాల సంప్రదాయాలను పాటిస్తూ ఉదయం హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకోగా... సాయంత్రం కడువ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఓ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది.
తాళి కట్టు శుభవేళ...
విజయ్ దేవరకొండ తన మెడలో తాళి కడుతుండగా రష్మిక ఎమోషనల్ అయ్యారు. కనపించకుండానే కంట తడి పెట్టుకుంటూ కనిపించారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఎవరికైనా ఇదే బెస్ట్ మూమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'హాయ్ మై లవ్స్... ఇంట్రడ్యూసింగ్ మై హస్బండ్' అంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. అటు విజయ్ సైతం తన భార్య రష్మికను పరిచయం చేస్తూ పోస్ట్ చేశారు. దాదాపు 12 గంటల్లోనే వీరి పోస్టులకు 2.5 కోట్ల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
'నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి, స్నేహితులతో ప్రయాణించడం ఎంత సరదాగా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి... ఈ వ్యక్తి గురించి పుస్తకం రాయగలను.' అంటూ రష్మిక రాయగా... 'ఒక రోజు తనను మిస్ అయ్యాను. తను నా పక్కన ఉంటే జీవితం బావుంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య అయ్యింది' అంటూ విజయ్ రాసుకొచ్చారు.
View this post on Instagram
Also Read : పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ బిగ్ డీల్! - పవర్ స్టార్ మూవీ అంటే అట్లుంటది...
సెలబ్రిటీల విషెష్
అటు టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి విరోష్ కపుల్‌కు విషెష్ వెల్లువెత్తుతున్నాయి. నేచరల్ స్టార్ నాని... 'ఈ అందమైన జంటకు నా అభినందనలు. ప్రియమైన విజయ్, రష్మిక మీరు మరింత అందమైన ఆనందకర జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా.' అంటూ రాసుకొచ్చారు.
స్టార్ హీరోయిన్స్ సమంత, కీర్తి సురేష్, ఆషికా రంగనాథ్, శ్రీలీల, కల్యాణి ప్రియదర్శన్ ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా వదినమ్మకు తమ ఫ్యామిలీలోకి స్వాగతం పలుకుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
View this post on Instagram
అమిత్ షాకు ఆహ్వానం
ఇరు కుటుంబాల సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు పూర్తైన తర్వాత విరోష్ కపుల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన ఇంటికి వెళ్లిన నూతన జంటను ఆయన సాదరంగా ఆహ్వానించారు. తమ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రావాలని ఆయన్ను ఇన్వైట్ చేశారు. గణపతి విగ్రహాన్ని ఆయనకు కానుకగా అందించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
























