News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కంగనా - ఆసక్తికరంగా 'తేజస్' టీజర్!

కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ తేజస్ టీజర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. టీజర్ లో వైమానిక దళ కమాండర్ గా కంగనా ఆకట్టుకుంది.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. ఎక్కువగా డిఫరెంట్ జానెర్ సబ్జెక్ట్స్ తోపాటు లేడీ ఓరియంటెడ్ కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇటీవలే చాలా కాలం తర్వాత సౌత్ మూవీ 'చంద్రముఖి 2' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. టైటిల్ రోల్ లో కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచిందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కంగనా ఖాతాలో ఉన్న మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'తేజస్'(Tejas). తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను గాంధీ జయంతి(అక్టోబర్ 2) సందర్భంగా విడుదల చేశారు. ఈ మూవీలో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్ పాత్రలో నటించింది. టీజర్ విషయానికొస్తే.. గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కంగనా డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మన దేశంపై ప్రేమ కోసం తేజస్ టేకాఫ్ కి సిద్ధమవుతుందని టీజర్ లో ఆసక్తికరంగా చూపించారు. టీజర్ లో కంగనా వైమానిక దళ కమాండర్ గా కనిపించింది. దేశం కోసం పోరాడిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా కంగనా లుక్ కూడా ఆకట్టుకుంది. 'భారత్ జోలికి వస్తే వదిలేది లేదు' అంటూ కంగనా టీజర్ చివర్లో చెప్పే డైలాగ్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది.

ఇక మూవీ ట్రైలర్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా అక్టోబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రొన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్‌, వరుణ్ మిత్ర ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తేజస్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సర్వేశ్ మేరా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ దేశభక్తి కాన్సెప్ట్ తో వస్తుండంతో ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకి వారం రోజులు ముందు దసరా బరిలో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో పెద్దపెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి.

తెలుగు నుంచి 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు' తమిళం నుంచి విజయ్ 'లియో', కన్నడ నుంచి శివరాజ్ కుమార్ 'ఘోస్ట్' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాలీవుడ్ లో చూసుకుంటే టైగర్ ష్రాఫ్ నటించిన గణ్ పథ్ విడుదలవుతోంది. ఈ సినిమాలన్నింటితో పోటీపడి కంగనా రనౌత్ నటిస్తున్న 'తేజస్' బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. మరోవైపు ఈ సినిమాతో పాటు కంగనా 'ఎమర్జెన్సీ' అనే మూవీలో కూడా నటిస్తోంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ కూడా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతోంది. కంగనా సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టి, కంగనా రనౌత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 24న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే నవ్వులు- 'మ్యాడ్' ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 03 Oct 2023 12:08 PM (IST) Tags: Kangana Ranaut Tejas Movie Tejas Teaser Kangana Ranaut's Tejas

ఇవి కూడా చూడండి

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు