News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

MAD Trailer: స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే నవ్వులు- 'మ్యాడ్' ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

టాలీవుడ్ నుంచి వస్తున్న యూత్ ఫుల్ మూవీ ‘మ్యాడ్’. సంగీత శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, మరోవైపు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యానర్ లో యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ మూవీ రాబోతోంది. ఆ సినిమా పేరే 'మ్యాడ్'.  జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత రాధాకృష్ణ కుమార్తె హారిక ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతోంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో ఫార్చునర్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నారు.

ట్రైలర్ విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్    

‘మ్యాడ్’ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వస్తున్న యూత్ ఫుల్ కామెడీ మూవీ కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నరు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ‘మ్యాడ్’ ట్రైలర్ ను పాన్ ఇండియన్ స్టార్ జూ. ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే నవ్వి నవ్వి పొట్ట చెక్కలు కావాల్సిందే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో నిండిపోయింది. ఈ ట్రైలర్ చూశాక సినిమా ఓ రేంజిలో యువతను ఆకట్టుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.    

‘జాతిరత్నాలు’ అనుదీప్ స్పెషల్ రోల్   

ఇక ఈ చిత్రంలో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన  టీజర్ లో కనిపించి కనిపించనట్టు కనిపించిన ఆయన, ట్రైలర్ మాత్రం బాగానే కనిపించాడు. రెండు మూడు డైలాగ్స్ కూడా చెప్పాడు. ఈ చిత్రంలో ఆయన ఉన్నారంటేనే, నవ్వుల పువ్వులు పూస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో యూత్ ను ఆకట్టుకునే చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటి వరకు కాలేజీ బ్యాగ్రాఫ్ లో వచ్చిన సినిమాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.  ‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారు లోకం’, ‘సై’ సహా పలు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమా కూడా యూత్ ను ఓ రేంజిలో ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.  

‘మ్యాడ్’ మూవీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు  

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ‘మ్యాడ్ ‘ మూవీలో హీరోగా నటిస్తుడటంతో ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా దక్కుతోంది. యువతను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. దినేష్ కృష్ణన్ బి, షామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్స్ గా వ్యవహరిస్తున్నారు.   రఘుబాబు, మురళీధర్ గౌడ్, రచ్చ రవి, విష్ణు, ఆంథోనీ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read Also: నన్ను వాడుకుని సంగీతను సల్మాన్ మోసం చేశాడు - పాకిస్తాన్ నటి సంచనల ఆరోపణలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 03 Oct 2023 11:29 AM (IST) Tags: kalyan shankar Bheems Ceciroleo MAD Movie S. Naga Vamsi MAD Movie Trailer

ఇవి కూడా చూడండి

Chitra Shukla Marriage: పెళ్లి పీటలెక్కిన ‘సిల్లీ ఫెలోస్’ బ్యూటీ, పోలీస్ అధికారితో ఏడడుగులు!

Chitra Shukla Marriage: పెళ్లి పీటలెక్కిన ‘సిల్లీ ఫెలోస్’ బ్యూటీ, పోలీస్ అధికారితో ఏడడుగులు!

Bootcut Balaraju Teaser: ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్, ఊర్లో మీ గాలి బ్యాచ్ బ్రాండ్ వ్యాల్యూ భలే ఉంది గురూ!

Bootcut Balaraju Teaser: ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్, ఊర్లో మీ గాలి బ్యాచ్ బ్రాండ్ వ్యాల్యూ భలే ఉంది గురూ!

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Intinti Gruhalakshmi December 11th Episode - ఇంటింటి గృహలక్ష్మి సీరియల్: విషమించిన పరంధామయ్య ఆరోగ్యం, నందుని కడిగిపారేసిన తులసి!

Intinti Gruhalakshmi December 11th Episode - ఇంటింటి గృహలక్ష్మి సీరియల్: విషమించిన పరంధామయ్య ఆరోగ్యం, నందుని కడిగిపారేసిన తులసి!

Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!