By: ABP Desam | Updated at : 03 Oct 2023 10:42 AM (IST)
నటి సోమీ అలీ, సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతాయి. సినిమాలే కాదు, పలు విషయాలతో నిత్యం వార్తల్లో ఉంటారు. ఆయన సినిమాల ద్వారా ఎంత పాపులర్ అయ్యారో, ఎఫైర్లు, వివాదాల ద్వారా అంతకంటే ఎక్కువ ప్రచారం పొందారు. గతంలో పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు. అయితే, ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి విషయాన్ని కాసేపు పక్కన పెడితే పాక్ నటి సోమీ అలీ మరోసారి సల్మాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనను అడ్డు పెట్టుకుని సంగీతా బిజ్లానీని మోసం చేశారని వ్యాఖ్యానించింది.
తాజాగా ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడిన సోమీ అలీ, తనను వాడుకొని సంగీతను సల్మాన్ ఎలా మోసం చేశాడో వివరించింది. సల్మాన్ ఖాన్, సంగీత విడిపోవడానికి తానే కారణమని వెల్లడించింది. నిజానికి సంగీత, సల్మాన్ పెళ్లి చేసుకోవాలని భావించారని చెప్పింది. కానీ, ఈ పెళ్లి ఇష్టం లేని సల్మాన్, తనను అడ్డు పెట్టుకుని క్యాన్సిల్ అయ్యేలా ప్రయత్నించారని తెలిపింది. “సంగీత సల్మాన్ ను ఎంతో ఇష్టపడింది. అతడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యాయి. కానీ, సల్మాన్ కు పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చూడాలి అనుకున్నారు. ఇందుకోసం నా సహకారం తీసుకున్నారు. ఇద్దరం కలిసి నా అపార్ట్ మెంట్ లో ఉండగా సంగీత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వెంటనే తను పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. సంగీతకు సల్మాన్ ఏం చేశాడో, నాకూ అదే జరిగింది. దీనినే కర్మ అంటారు. నేను కొంచెం పెద్దయ్యాక ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాను” అని తెలిపింది.
గతంలోనూ సల్మాన్ పై సోమీ సంచలన ఆరోపణలు చేసింది. హాలీవుడ్‌లో 'మీటూ' ఉద్యమం మొదలు కావడానికి నిర్మాత హార్వే వెయిన్ స్టీన్ కారణం. అయితే, బాలీవుడ్ హార్వే వెయిన్ స్టీన్ సల్మాన్ ఖాన్ అంటూ గతంలో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “ఏదో ఒక రోజు నీ రంగు బయట పడుతుంది. నువ్వు వేధించిన మహిళలు బయటకు వచ్చి నిజాలు చెప్తారంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు 'మేల్ ఛావినిస్ట్ పిగ్' అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించింది. అతడితో రిలేషన్ లో ఉన్న హీరోయిన్లను తీవ్రంగా హింసించే వాడని వెల్లడించింది. మానసికంగా, శారీరకంగా బాధపెట్టేవాడని తెలిపింది. సంగీతా బిజ్లానీ, సోమీ, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్‌లతో సల్మాన్ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్ నటి. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ‘ఆందోళన్’, ‘మాఫియా’ వంటి చిత్రాలతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ - సోమీ అలీ ప్రధాన పాత్రల్లో గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. చిత్రీకరణ దశలో ఉండగానే ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సోమీ - సల్మాన్ ప్రేమలో పడినట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. “సల్మాన్ అంటే నాకెంతో ఇష్టం. సల్మాన్‌కు నా ప్రేమను తెలియజేశా” అని గతంలో ఓసారి సోమీ వెల్లడించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు వీళ్లిద్దరూ విడిపోయారు. చాలా సంవత్సరాల తర్వాత సోమీ సల్మాన్ గురించి తీవ్ర విమర్శలు చేయడం సంచలనం కలిగిస్తోంది.
Read Also: ఓర్ని.. పెళ్లికి ముందు చిన్న పిల్లల్లా మారిపోయిన పరిణితీ, రాఘవ్ - మీకూ ఇలా ఆడాలని ఉందా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!
Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!
Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!
Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్లో ధాత్రి
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
/body>